హైదరాబాద్

ఎవరెస్ట్ శిఖరంపై ఎగిరింది.. ఎగిరింది.. తెలంగాణ కీర్తి పతాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, జూన్ 23: ప్రపంచ చరిత్రలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సుమారు 20వేల అడుగుల ఎత్తులో జరుపుకున్న దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2ను 20 వేల అడుగుల పర్వతంపై ఈ వేడుకలను జరుపుకొని, బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లోని అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణకు చెందిన ఏడుగురు సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు. తమ ప్రాణాలకు తెగించి మైనస్ 20 డిగ్రీల నుండి మైనస్ 30 డిగ్రీల ప్రతికూల వాతావరణంలో ఈ సాహస యాత్రను మే 22 నుండి ప్రారంభించారు.
ఈ సాహస యాత్ర కోసం అనేక పరీక్షలు నిర్వహించగా చివరకు కె.రంగారావు, భజరంగ్ కల్పేష్ షా, ఆర్.కిరణ్‌కుమార్, ఆర్.రాజేంద్రకుమార్ (వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా), కె.రాఘవేంద్ర, అలీ అహ్మద్ (నిజామాబాద్), డా.శివకుమార్ లాల్‌ను ఎంపికచేశారు.
బృందానికి కె.రంగారావు టీం లీడర్‌గా వ్యవహరించగా, డా.శివకుమార్ టీం డాక్టర్, మేనేజర్‌గా వ్యవహించారు. బృందం ప్రయాణానికి మే 16న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కె.వి.రమణ చారి జెండా ఊపి ప్రారంభించారు. బృందం ఢిల్లీలోని భారతీయ పర్వతారోహణ సంస్థ నిర్వహించిన వౌంట్ ఎవరెస్టు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొని 1965లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సభ్యులతో గడిపింది. మే 22 నుండి సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూ జమ్ముకాశ్మీర్, లడక్ దాటుకుంటూ స్టాక్ గ్రామం చేరుకొని ఈ సాహస యాత్రను కొనసాగించింది. వాతావరణం అనుకూలత కోసం రెండు రోజులు మనకొరంలో గడిపిన తరువాత తిరిగి బేస్ క్యాంప్‌కు ప్రయాణం సాగించింది. ఎంతో ప్రతి కూల వాతావరణంలో 16500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బేస్ క్యాంప్‌లో రూట్ ఓపెనింగ్, రోప్ కోర్సులో ప్రాథమిక శిక్షణ తరువాత చివరకు బృందం సిద్ధమైంది.
మే 30 నుండి వాతావరణంలో ప్రతి కూల పరిస్థితులు నెలకొనప్పటికీ ఎంతో పట్టుదలతో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని, తెలంగాణ పటాన్ని ఆవిష్కరించాలనే దృఢ సంకల్పంతో ఈ బృందం రెండు జట్లుగా విడిపోయి స్టాక్ కాంగ్రి పర్వతం (6140 మీటర్లు), గోలెబ్ కాంగ్రి (5965 మీటర్లు) పర్వతాలను చేరుకున్నారు. మొదటి జట్టులో అడ్వాన్స్ టీం కిరణ్‌కుమార్ నాయకత్వలో ఆర్.రాజేంద్రకుమార్, కె.రాఘవేంద్ర బృందం జూన్ 2న ఉదయం 3 గంటలకు బయలుదేరి ఎంతో ప్రతి కూల పరిస్థితులను, సవాళ్లను ఎదుర్కొని ధైరంగా ముందుకు సాగి మధ్యాహ్నం 12.45 నిమిషాలకు తమ వెంట తీసుకెళ్లిన జాతీయ పతాకం, తెలంగాణ పటాన్ని ఆవిష్కరించి మొదటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకుంది. రెండవ జట్టులో కె.రంగారావు నాయకత్వంలో అలీ అహ్మద్, డా.శివకుమార్‌లాల్‌తో కూడిన జట్టు గోలెబ్ కాంగ్రి సమీపంలో సుమారు 6000 మీటర్ల ఎత్తుగల అన్‌నోన్ పీక్‌ను అధిరోహించి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంది.
ఎంతో సాహసోపేతంగా కొనసాగిన ఈ యాత్రను ముగించుకొని ఢిల్లీకి చేరిన బృందానికి తెలంగాణ రాష్ట్ర సలహాదారు ఎస్.వేణుగోపాలచారి స్వాగతం పలికారు. అంతేకాకుండా తెలంగాణ భవన్‌లో వీరిని ఘనంగా సన్మానించింది. తిరిగి ఈ బృందం జూన్ 15న నగరానికి చేరుకుంది. వీరి రాకను పురస్కరించుకొని రాష్ట్ర మంత్రులు టి. పద్మారావు, రాష్ట్ర యువజన శాఖ సంచాలకుడు అబ్దుల్ అజీమ్, ఉప సంచాలకుడు ఉపేంద్రారెడ్డి పాల్గొని రాష్ట్ర సచివాలయంలో ఘనంగా సన్మానించి రూ. 3.50లక్షల చెక్కును అందజేసి సాహసాన్ని కొనియాడారు.