హైదరాబాద్

లష్కర్ బోనాల ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, జూన్ 23: లష్కర్ బోనాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బోనాల ఉత్సవాల వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించడంతో ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. మంగళవారం బల్దియా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్, అధికారులు ఉజ్జయిని మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లో 30 వరకు చిన్న దేవాలయాలు ఉన్నాయి. బోనాల ఉత్సవాలను ఆర్భాటంగా చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. మహంకాళి ఉజ్జయిని ఆలయ చుట్టూ ఉన్న రహదారులకు మరమ్మతు చేయాలని నిర్ణయించారు. పాట్‌బజర్, మోండా మార్కెట్, శివాజీనగర్, జనరల్ బజార్, సుభాష్‌నగర్ ప్రాంతాల నుంచి దేవాలయానికి వెళ్లే రహదారులను మెరుగుపరిచడం, ప్యాచ్ వర్క్‌లు చేయించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు సిద్ధమవుతున్నారు. రహదారులు వెంట తాత్కాలిక మూత్రశాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. గతంలో తలసాని ఎమ్మెల్యేగా ఉండగా ఈసారి మంత్రి హోదాలో ఉన్నారు. దీంతో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పెట్టారు. ఉత్సవాల నిర్వహణపై సోమవారం మంత్రి తలసాని సమీక్ష నిర్వహించడంతో అధికారులు ఉరుకుపరుగులు పెడుతున్నారు. బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ముఖ్యమంత్రి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఏర్పాట్లపై జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. లష్కర్ ప్రాంతంలోని నల్లపోచమ్మ దేవాలయం, కళాసిగూడ నల్లపోచమ్మ దేవాలయం, సెకండ్ బజార్ ముత్యాలమ్మ దేవాలయం, పాట్‌బజార్ ముత్యాలమ్మ దేవాలయం, ఆర్‌పిరోడ్డులోని పెద్దమ్మ దేవాలయం, కామాక్షి దేవాలయంలో పాటు పరిసరాల్లోని దేవాలయాలను అధికారంలో పరిశీలించారు. గత సంవత్సరం ఉత్సవాలకు కోటి రూపాయలతో ఏర్పాట్లు చేశారు. ఈసారి రెట్టింపు స్థాయిలో నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఆగస్టు 2న బోనాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఆగస్టు 2, 3 తేదీల్లో నిర్వహిస్తారు. నెల రోజుల పాటు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్‌ఎంసి, జలమండలి, పోలీసుశాఖలు ఇప్పటి నుంచే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించాయి. ఉత్సవాల ఏర్పాట్లను తరుచూ పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయించుకున్నారు.
ఎల్లమ్మ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
ఖైరతాబాద్: వచ్చే నెల అట్టహాసంగా జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి అనే అంశంపై చర్చించేందుకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిహెచ్‌యంసి, వాటర్‌వర్క్స్, పోలీస్, ఫైర్, విద్యుత్, దేవాదాయ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రెండవ సారి జరగనున్న ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ఉత్సవాలు రావడంతో తగినంత సమయం లేకపోవడంతో ఉత్సవ ఏర్పాట్లపై దృష్టి సారించడం కష్టసాధ్యమైందని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని కోరారు. జూలై 20, 21, 22 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో భక్తులు ఇబ్బందులకు గురౌతున్నారని, అలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. వచ్చేనెల 21న వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించే అమ్మవారి కల్యాణాన్ని తూర్పు ముఖంగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీని ద్వారా చాలా మంది భక్తులు నేరుగా కల్యాణాన్ని వీక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎల్లమ్మ కల్యాణోత్సవానికి సంబందించిన వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆష్కరించారు. అనంతరం స్థానికులు పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కల్యాణోత్సవాన్ని శాస్త్రోతంగా నిర్వహించాల్సి ఉండగా ఈఓలు మారినప్పుడల్లా వారి ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేయగా వేద పండితుల సూచనల మేరకే వేదికను సిద్ధం చేద్దామని మంత్రి చెప్పారు. నిత్యం పొంగే డ్రైనేజీలు, తాగునీరు లేక దేవాలయానికి రావాలంటేనే భక్తులు జంకుతున్నారని వివరించడంతో నెలరోజుల వ్యవధి ఉన్నందున ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయో గుర్తించి వెనువెంటనే వాటిని సరిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భక్తులకు తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, నీటి కుళాయిలతో పాటు వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. తోపులాటలకు తావులేకుండా బారికేడ్లను అమర్చాలని కోరారు. దేవాలయంలోనికి వచ్చే సమయంలో ఒక ద్వారం గుండా బయటకు వెళ్లే సమయంలో మరొక ద్వారం గుండా వెళ్లడంతో భక్తులు తాము వదిలిన పాదరక్షల కోసం తిరిగి లోనికి ప్రవేశించే ద్వారం వద్దకు రావాల్సిన పరిస్థితి ఉండటంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అమ్మవారి కల్యాణోత్సవంలో భక్తులకు సక్రమంగా ప్రసాదం సైతం అందించలేని దుస్థితి నెలకొంటుందని, ఆలయంలో కొనసాగుతున్న అవినీతితో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారని మండిపడ్డారు. గదులను తీసుకున్న వారి వద్ద నుంచి 1500 రూపాయలు తీసుకోవడంతో పాటు అదనంగా టెంట్ సామాగ్రి కోసం మరో 300 చార్జ్ చేస్తున్నారని చెబుతుండగా ప్రస్తుతం ఏర్పాట్ల గురించే మాట్లాడాలంటూ మంత్రి వారిని అడ్డుకున్నారు. ఈసారి నేచర్‌క్యూర్ ఆసుపత్రి రోడ్డును విఐపిల కోసం ఉపయోగించనున్నట్లు ఎస్సార్‌నగర్ సిఐ రమణ చెప్పారు.