రాష్ట్రీయం

జోనల్ రద్దు లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22:జోనల్ విధానం రాజ్యాంగ సవరణతో ముడివడిన అంశం కావడంతో దీనిని రద్దు చేయడం ఇప్పట్లో సాధ్యిం కాదనే నిర్ణయానికి ప్రభు త్వం వచ్చినట్టు తెలుస్తోంది. జోనల్ వ్యవస్థ రద్దు అంత సులువు కాకపోవడంతో మరికొంత కాలం ప్రస్తుత విధానానే్న కొనసాగించడం ఉత్తమమని రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో ప్రస్తుత జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరపాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. జోనల్ విధానాన్ని రద్దు చేయకుండా స్టేట్, డిస్ట్రిక్ట్ కేడర్‌గా పోస్టులు విభజించి నోటిఫికేషన్ జారీ చేయడం సాధ్యం కాదని టిఎస్‌పిఎస్‌సి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. వ్యవసాయ అధికారుల నియామకాలను సవాల్ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా ఈ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సందర్భంగా టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ ఘంటా చక్రపాణి సిఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జోనల్ విధానం రద్దు అంశం చర్చకు రాగా దీనిని రద్దు చేయడం భారీ ప్రక్రియతో కూడుకుందని, అప్పటివరకు ఆగాలంటే ఉద్యోగ నియామకాలన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో ప్రస్తుత (జోనల్) విధానాన్ని కొనసాగించడమే ఉత్తమమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. జోనల్ విధానాన్ని రద్దు చేయాలంటే మొదట ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలలో తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ తీర్మానంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి రాజ్యాంగపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని హోంశాఖ నిర్థారణకు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత హోంశాఖ ఈ తీర్మానాన్ని ఆమోదించాలని పార్లమెంట్‌కు నివేదిస్తుంది. రాజ్యాంగంలోని 371డి ప్రకారం ఏర్పడిన జోనల్ వ్యవస్థ రద్దుకు పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం అవుతుంది. పూర్తిస్థాయిలో మెజార్టీతో రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఆమోదించిన పిమ్మట చివరగా రాష్టప్రతి ఆమోదానికి పంపిస్తుంది. రాష్టప్రతి ఉత్తర్వులతో ఏర్పడిన జోనల్ వ్యవస్థ తిరిగి రాష్టప్రతి ఉత్తర్వులతోనే రద్దు కావాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణ శాసనసభ, అటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండు రాష్ట్రాలు జోనల్ వ్యవస్థ రద్దుకు తీర్మానం చేస్తాయా అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగకుండా జోనల్ వ్యవస్థ గతంలో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక జోనల్ వ్యవస్థతో పని లేదని సిఎం భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయబోతున్నట్టు కూడా ఆయన ఇటీవల ప్రకటించారు. అయితే ఈ ప్రకటన అనంతరం జోనల్ వ్యవస్థ రద్దు అంత సులువు కాదని న్యాయ నిపుణులు సలహా ఇచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల పాటు కొనసాగుతుందని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పటివరకూ తెలంగాణలో... ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో జరిగే నియామకాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులకు కూడా పోటీ పడే అవకాశం ఉన్నప్పుడు జోనల్ వ్యవస్థ రద్దుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్మానం చేయడానికి ముందుకు రాకపోవచ్చన్న మరో వాదన ఉంది. ఈ నేపథ్యంలో జోనల్ వ్యవస్థ రద్దు ఇప్పట్లో సాధ్యపడేది కాదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీంతో ఉద్యోగాల భర్తీని ప్రస్తుత జోనల్ విధానం ప్రకారమే కొనసాగించాలని టిఎస్‌పిఎస్‌సికి ప్రభుత్వం వౌఖికంగా సూచించినట్టు సమాచారం.