జాతీయ వార్తలు

ఇద్దరు జవాన్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిన్‌సుకియా (అసోం), జనవరి 22: అసోం-అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని జైరాంపూర్ వద్ద జవాన్ల కాన్వాయ్‌పై మిలిటెంట్లు ఆదివారం జరిపిన మెరుపు దాడిలో అసోం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు సైనికులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడ్డ మిలిటెంట్ల కోసం తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టామని అసోం డిజిపి ముఖేష్ సహాయ్ వెల్లడించారు. ఈ మిలిటెంట్లు శాంతి చర్చలను వ్యతిరేకిస్తున్న ఉల్ఫా వర్గానికి చెందినవారుగా భావిస్తున్నట్లు, అలాగే కప్లాన్ సారథ్యంలోని ఎన్‌ఎస్‌సిఎన్ మిలిటెంట్లు కూడా ఇందులో పాల్గొని ఉండవచ్చునని డిజిపి తెలిపారు. ఈ మెరుపు దాడిలో 15 నుంచి 20 మంది మిలిటెంట్లు పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని తిన్‌సుకియా ఎస్‌పి మహంతా తెలిపారు. అసోం రైఫిల్స్ జవాన్లు కూడా ఎదురుదాడి జరిపి ఇద్దరు మిలిటెంట్లను హతమార్చారని ఆయన వివరించారు. సమీప ప్రాంతాలన్నింటినీ మూసేసి మిలిటెంట్లకోసం విస్తృతంగా గాలిస్తున్నామని తెలిపారు. దాడికి పాల్పడిన తర్వాత మిలిటెంట్లు అసోం రైఫిల్స్ నుంచి భారీఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని ఎత్తుకుపోయినట్లుగా తెలుస్తోంది.

చిత్రం..మిలిటెంట్లు దాడి చేసిన ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించిన దృశ్యం