Others

ఒక్క సినిమా చాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లి పెదాలమీద మెత్తటి నవ్వు. విశాలమైన కళ్లులో స్పష్టమైన భావం. అందాన్ని కరిగించి అజంతా శిల్పానికి పూతపూస్తే -కీర్తి సురేష్‌లా ఉంటుంది. టాలీవుడ్‌కు కావాల్సింది అలాంటి అందమే. అందుకే -మొదటి సినిమాతోనే ఆమె అందానికి గులామైపోయింది. గత ఏడాది ఆరంభంలో పరిశ్రమలోకి అడుగుపెట్టి ‘నేను శైలజ’ అని ప్రకటించుకుంది. ఆమె ఆహార్యానికి అదిరిపోయిన మూవీ మేకర్లు -వరుస సినిమాల్లో బుక్ చేస్తున్నారు. ఆమె అందానికి మురిసిపోయిన ప్రేక్షకులు -స్టార్ ఇమేజ్ ఇచ్చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్‌కు జోడీగా -సైలెంట్ పాత్ర చేసినా కీర్తికి మాత్రం పెద్ద కిరీటమే దక్కింది. అంటే తెలుగు పరిశ్రమకు పెద్దగా పరిచయంలేని కీర్తి -ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్లకు పోటీగా మారింది. హీరోయిన్‌గా నిలదొక్కుకోడానికి ఎక్స్‌పోజింగ్ ఓ ప్రామాణిక క్వాలిఫికేషన్‌గా మారిన చిత్రసీమలో -అలాంటి అవకాశం ఇవ్వకుండా చిర్నవ్వుతో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. కీర్తిసురేష్‌కి ‘నేను శైలజ’ పెద్ద లక్కీ. కొద్దిరోజుల్లో విడుదలవుతున్న ‘నేను లోకల్’తో కీర్తికి మరింత పాపులార్టీ కీర్తి దక్కే అవకాశం ఉందంటున్నారు.
సక్సెస్‌నే పేరుగా మార్చుకుని ప్రరిశ్రమలోకి అడుగుపెట్టిన పెళ్లిచూపుల కుర్రాడు -విజయ్ దేవరకొండ. హీరోగా నిలదొక్కుకోడానికి చాలాకాలంగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా -‘పెళ్లిచూపులు’తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. పెద్ద బ్యానర్లు, బడా నిర్మాతలు సైతం అతని డేట్స్‌కి ట్రై చేస్తున్నారంటే ‘లక్కు’ఇచ్చిన కిక్కు కాకపోతే ఇంకేంటి? సహజంగా హీరోలు చూపించే ఓవరాక్షన్‌కు దూరంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడిగా ప్రదర్శించిన సహజ నటనే -విజయ్‌ని దేవరకొండమీద నిలబెట్టింది. ప్రేక్షకులకు కొత్తదనం పరిచయం చేస్తూ, హీరో అంటే ఇలా ఉంటే సరిపోతుందా? అనిపించుకున్నాడు విజయ్. ప్రస్తుతం ద్వారక చిత్రం షూటింగ్‌లో బిజీగావున్న విజయ్ దేవరకొండ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే, ఏడాదిన్నర పాటు అతని డైరీ ఖాళీ లేదన్న మాట.
మలయాళంలో ‘ప్రేమమ్’తో మెరిపించి మురిపించిన అనుపమా పరమేశ్వరన్‌కు తెలుగులో నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆలో చాన్స్ దొరికింది. లక్ ఉంటే -సెకెండ్ హీరోయిన్ స్టేటస్ కూడా స్టార్ లెవెల్‌కు మారుతుందని నిరూపించుకుంది. టాప్ రేంజ్‌లోవున్న సమంతకు సవాల్ విసిరే పల్లెటూరి విలనీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది అనుపమ. ఆ ఒక్క సినిమాతో ‘యస్’ అనిపించుకున్న అనుపమ, కొత్త ఏడాదిలో పండగ సినిమాగా వచ్చిన ‘శతమానంభవతి’ చిత్రంతో -పెద్ద హీరోయిన్లకు పోటీగా మారింది. ప్రస్తుతం అనుపమే -టాలీవుడ్‌లో హాటీ క్రేజ్. ఆమె టాలెంట్‌కు ఫిదా అయిపోయిన మూవీమేకర్లు వరుస అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్టులో చాన్స్ కొట్టేసింది. పెద్ద ప్రాజెక్టులో చాన్స్ దక్కడంతో -ఇప్పుడు అందరూ అనుపమ జపం చేస్తున్నారు.
ఎంతకాదన్నా సౌత్ సినిమాల్లో మలయాళ భామలదే హవా. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ మలయాళ భామలే వరుస చాన్స్‌లు అందుకుంటారనడంలో సందేహం లేదు. గత ఏడాది నానితో ‘జెంటిల్‌మెన్’లో కెమిస్ట్రీ పండించిన జెంటిల్ ఉమెన్ నివేద థామస్. తొలి చిత్రంతోనే హండ్రెడ్ పర్సెంట్ మార్కులు కొట్టేసిన నివేదకు -క్రేజీ చాన్స్‌లు క్యూగట్టాయి. జెంటిల్‌మెన్ సక్సెస్‌లో మేజర్ రోల్ నివేదదే. అందం, అభినయం కలబోసిన మలయాళ కుట్టికి -అంతకుముందు రెండు మూడు సినిమాలున్నా జెంటిల్‌మెన్‌తోనే ఒవర్‌నైట్ స్టార్ అయ్యింది. అటు మలయాళంలోనూ రెస్ట్‌లెస్‌గా పెర్ఫార్మెన్స్ ఇస్తున్న నివేద -ప్రస్తుతం నానితోను, మరో ప్రాజెక్టులో రవితేజతోను కెమిస్ట్రీ పండించేందుకు రెడీ అవుతోందట. ఎంత లక్కున్నా -ఓవర్‌నైట్ స్టార్ కావడం వెనుక ఒకింత కృషి, పట్టుదల ఉంటాయన్న విషయాన్ని మాత్రం ఎవ్వరూ కాదనలేరు. -శ్రీ

సినిమా రంగంలో రాణింపు ఆషామాషీ కాదు. అయితే -హీరో, హీరోయిన్, విలన్, డైరెక్టర్, టెక్నీషియన్... ఇలా ఏ క్రాఫ్ట్‌లోకి అడుగుపెట్టినా అక్కడ ఓ వెలుగు వెలిగిపోవాలనే అనుకుంటారు. కానీ చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కొందరు కొనే్నళ్లపాటు నిద్రలేని రాత్రులు గడిపినా, ఎంత కష్టపడినా రాని బ్రేక్ -ఇంకొందరికి ఒక్క సినిమాతోనే వచ్చి పడుతుంది. అలాంటివాళ్లకు ‘నీది లక్కు బాసూ’ అన్న టాగ్ లైన్ తగిలిస్తారు. ఒక’ట్రెండు
సినిమాలతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నవాళ్లను ‘ఓవర్‌నైట్ స్టార్లు’గానూ ప్రస్తావిస్తారు.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ చాలామందినే ఓవర్‌నైట్ స్టార్లు చేసేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, నివేదా థామస్, అనుపమా పరమేశ్వరన్‌లాంటి వాళ్లను నిజంగానే ‘ఓవర్‌నైట్ స్టార్లు’గా వెలిగిపోతున్నారు.