విజయవాడ

గణతంత్రం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణతంత్రం! గణతంత్రం!
నాటి త్యాగాల గణతంత్రం!
నేటి కుతంత్రాల ‘గుణ’తంత్రం!
పాలకుల స్వార్థానికి చీలిన
తెలుగు రాష్ట్రాల విభజన తంత్రం!
దేశంలో పేరుకున్న నల్లధనం సాకుతో
జరుగుతున్న నేటి ‘గుణ’తంత్రం!
అధికార దాహంతో అందలం కోసం
అర్రులు చాస్తున్న రాజకీయ
పైశాచిక నృత్యాల ‘గుణ’తంత్రం!
విద్యారంగం వ్యాపారమయమై
గ్రహణం పడుతున్న విద్యార్థుల భవిత
మద్యపానం వద్దన్న మహాత్ముని
వాక్కుని సమాధి చేస్తూ
మద్యం ఏరులా పారుతున్న వ్యవస్థలో
నేటి ‘గుణ’తంత్రం!
పంచభూతాలకు ఖరీదుకట్టి
ప్రాణవాయువును మూటగట్టి
అంగట్లో వ్యాపార సరకుగా మార్చిన
కుతంత్రం ఈ ‘గుణ’తంత్రం!
పొరుగునున్న దాయాదుల కుతంత్రాల్ని
మట్టుచెట్టలేక
ఉగ్రవాదపు అరాచకాల్ని
ఉక్కుపాదంతో అణచలేక
గణతంత్రాన్ని ప్రదర్శించలేక
సాగుతున్న ‘గుణ’తంత్రం
నేటి నేతల కుతంత్రాలకు
బలౌతున్నది గణతంత్రం!

- గోలి మధు,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
చరవాణి : 7799782208
**

గణతంత్ర మెరుపులు

సీ. జెండాలెగురవేయుచుండెడి పెద్దల
కనుల గౌరవకాంతి గంతులేయ
ఠీవిగాగ తలెత్తి జీవించు నరులన
గగనంబున పతాకలెగురుచుండ
పాల్గొను బాలల పాటల పోటీల
ఉత్సాహగంగలే ఉరకలెత్త
త్యాగాలొనర్చు నాయక గతస్మృతి ప్రసం
గాలె ఉత్తేజదీపాలు కాగ
బహుళసైన్య విన్యాసాలు పరిఢవిల్ల
శకటహేలలు ప్రగతిని చాటుచుండ
వాడవాడల స్వాతంత్య్ర భారతాన
భవ్యగణతంత్ర వేడుకల్ వరలెమిగుల!
తే.గీ. స్వచ్ఛ్భారత కాంతుల ప్రాభవములు
అల్ల నల్లకుబేరుల ఆటకట్లు
నగదు రహిత లావాదేవి ప్రగతిగతులు
అరయ నేటి రిపబ్లిక్కు మెరుపులవుర!!

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287
**

చిత్తు కాగితాలు

కాలంచెల్లిన క్రియలన్నీ
వెలవెలబోతుంటాయి
నిన్న విలువైనవన్నీ
నేడు చిత్తుకాగితాలవుతుంటాయి
ఏదీ శాశ్వతం కాని బతుకు పోరులో
సామాన్యుడి అడుగెప్పుడూ సర్కస్ ఫీటే
అమాంతం జారిపడ్డ కుబేరుడు
ఏ లొసుగు తాడునో పట్టుకుని
మళ్లీ ఎగబాకుతాడు
మడతలు పెట్టుకుంటూ మళ్లీమళ్లీ చూసుకుంటూ
ఇవాళ్టి ఆకలికి తూకం వేసుకుంటూ
రంగుల కాగితాన్ని దాచుకుంటూ దాచుకుంటూ
కాలాన్ని వెళ్లదీసుకునే దరిద్ర ధీరుల్ని
ఓ కొత్తకోణం మళ్లీ వెక్కిరిస్తోంది
బోసినవ్వుల బాపూ సాక్షిగా
పెద్దనోటు తలపోటును తెప్పిస్తోంది
కట్టల గుట్టలతో కొందరికి సంకట స్థితి
చెత్త బతుకుల్లో చిత్తుకాగితాలు మరికొన్ని
ఆర్థిక వ్యవస్థలో ఇదో మలుపు
హార్దిక అవస్థలో ఇదో అలుపు
నేటికీ రేపటికీ మధ్య ఎన్ని వైరుధ్యాలో
మాటల గారడీలతో
మేటలు వేసుకున్న నల్లధనం
దొడ్డిదారుల్ని వెతుక్కుంటూ
మెల్లగా తెల్లగా మారిపోవటం
మనం చూస్తుంటాం..
చూస్తూనే వుంటాం!

- కటుకోఝ్వల రమేష్,
ఇల్లెందు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా.
చరవాణి : 9949083327
**

కబోర్డ్స్

కబోర్డ్స్ అందానికి ప్రతీకలు
అలంకరణకి మచ్చుతునకలు
ఏదైనా లోపలిని మూసివేసి
పైకి అందాన్ని చూపే
పసందైన కబోర్డులు
మనుషులు కూడా
అంతేకదా
మనసులోని వికారాన్ని రూపంతో దాస్తారు
కుళ్లిన ఆలోచనల్ని
కుట్రలతో దాస్తారు
చిరునవ్వుల వెనుక
క్రూరత్వాన్ని దాస్తారు
సానుభూతి వెనుక
వెటకారాన్ని దాస్తారు
అభినందనల వెనుక
అసూయని దాస్తారు
ఓదార్పు వెనుక వారి
సంతృప్తిని దాస్తారు
అధికారం వెనుక
అవినీతిని దాస్తారు
మంచితనం వెనుక
మాయామర్మాలని దాస్తారు
లోపల ఏముందో తెలియక
పైకి అందంగా కనిపించే కబోర్డులు
మనలో చాలామంది మనుషులు..!

- ఎ.రేవతి
చరవాణి : 7097452344