హైదరాబాద్

కార్పొరేటర్లు వర్సెస్ సినీ స్టార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ప్రస్తుతం నగరంలో ఎటు చూసినా స్వచ్ఛ కార్యక్రమాల సందడే నెలకొంది. వచ్చే నెల 2 నుంచి మూడురోజుల పాటు నగరంలో జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకును దక్కించుకునేందుకు జిహెచ్‌ఎంసి గత కొద్ది నెలలుగా పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా నగరవాసుల్లో కూడా స్వచ్ఛ స్పూర్తిని నింపేందుకు గాను వచ్చే నెల 5వ తేదీ ఎల్బీ స్టేడియంలో ‘స్వచ్ఛ హైదరాబాద్ క్రికెట్ ట్రోఫీ’ నిర్వహించేందుకు సిద్దమైంది. గ్రేటర్ కార్పొరేటర్లు, సినీ తారలు వేర్వేరు జట్లుగా క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. అంతేగాక, హైదరాబాద్ నగర పాలక మండలి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లు, సినీ తారలతో కలిసి క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం అభినందనీయం అని మేయర్ వ్యాఖ్యానించారు. ఈ ట్రోఫీలో కార్పొరేటర్ల పురుషుల జట్టుకు రాంనగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాసరెడ్డి, అలాగే మహిళల జట్టుకు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వార విజయలక్ష్మి కెప్టెన్లుగా వ్యవహారించనున్నట్లు మేయర్ వెల్లడించారు. ఇక సినీ తారలకు సంబంధించి మహిళల జట్టుకు నటి సంజన, పురుషుల టీంకు నటుడు శ్రీకాంత్ కెప్టెన్లుగా వ్యవహారించనున్నట్లు మేయర్ వెల్లడించారు.