బిజినెస్

ఒఎన్‌జిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వరంగ చమురు, సహజ వాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి నికర లాభం భారీగా పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఏకంగా మూడిం తలు ఎగిసి 4,352 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో సంస్థ లాభం కేవలం 1,466 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు అమ్మకాలు ఈసారి 9 శాతం వృద్ధితో 20,014 కోట్ల రూపాయలుగా ఉన్నాయ.
ఐసిఐసిఐ బ్యాంక్
దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 16.4 శాతం క్షీణించి 2,610.83 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 3,122.35 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం మాత్రం ఈసారి 8.95 శాతం పెరిగి 27,875.67 కోట్ల రూపాయలకు చేరింది. పోయినసారి 25,585.14 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం సంస్థ స్పష్టం చేసింది. స్టాండలోన్ ఆధారంగా సంస్థ లాభం ఈసారి 19.1 శాతం పడిపోయ 2,441.82 కోట్ల రూపాయలుగా, నిరుడు 3,018.13 కోట్ల రూపాయలుగా ఉంది. క్రిందటిసారితో పోల్చితే ఆదాయం కూడా 17,562.95 కోట్ల రూపాయల నుంచి 17,556.41 కోట్ల రూపాయలకు దిగజారింది.
బజాజ్ ఆటో
దేశీయ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తృతీయ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 5.67 శాతం దిగజారి 976.82 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,031.17 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా ఈసారి 9 శాతం తగ్గి 5,884.25 కోట్ల రూపాయల నుంచి 5,354.13 కోట్ల రూపాయలకు పడిపోయనట్లు మంగళవారం సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.
జెఎస్‌డబ్ల్యు స్టీల్
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్ డబ్ల్యు స్టీల్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 730 కోట్ల రూపాయలుగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 709 కోట్ల రూపాయల నష్టంగా ఉంది. ఏకీకృత ఆదాయం ఈసారి 15,312.3 కోట్ల రూపాయలుగా, పోయినసారి 9,589.2 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం తెలిపింది.