మెదక్

కలిసికట్టుగా అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, ఫిబ్రవరి 4: గ్రామాలకు మంజూరైన అభివృద్ధి నిధుల వినియోగానికి ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు సూచించారు. మనోహరాబాద్ శివారులో గల రామాయపల్లి శివారులో గల అతిధి గృహంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా అభివృద్ధి పనులు చేయాలని కోరారు. తూప్రాన్, మనోహరాబాద్‌కు ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ భవనాల మంజూరు, తూప్రాన్ బస్టాండ్‌కు 65 లక్షలతో రైతు బజారు, గ్రామ పంచాయతీ భవనం, స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాలూకా ఇన్‌చార్జి బూంరెడ్డి, జాయింట్ కలెక్టర్ హన్మంతరావు, నేతలు ఎలక్షన్‌రెడ్డి, శ్రీనివాస్, శేఖర్‌గౌడ్, శ్రీశైలంగౌడ్, సుమన విజయభాస్కర్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.