సెన్సార్‌లో నీ ఊహల్లోనే ఉంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన తారలు మనోజ్ నందన్, భారతి జంటగా కె.పి.ఆర్ క్రియేషన్స్ పతాకంపై పురందర్ దాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీ ఊహల్లోనే ఉంటా’. షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా సెన్సార్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా పురందరదాస్ మాట్లాడుతూ- ‘రాయలసీమలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ఓ కుర్రాడు తన మిత్రులకు జరిగిన అన్యాయంపై ఏ విధంగా పోరాటం చేశాడనే కథనంతో, ప్రతి సన్నివేశం వైవిధ్యంగా తీర్చిదిద్దిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. అనంతపురం, ధర్మవరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన ఈ చిత్రంలో లవ్, కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని, బెంగళూరు గోపాల్‌ను విలన్‌గా పరిచయం చేస్తున్నామని తెలిపారు. గోపాల్, శ్రావణి, ఆదినారాయణ, మంజునాధ్, హిందునాధ్, నవీన్, మహేందర్, కె.ఆర్.రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రాజ్‌కిరణ్, కెమెరా:ఎస్.కె.ఎమ్.షరీఫ్, ఎడిటింగ్:శివకిరణ్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:పురందర్‌దాస్.కె.