విజయవాడ

శ్రీమతికి ప్రేమలేఖ! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటింట్లో పనంతా పూర్తిచేసుకొని, దేవుని పూజ చేసుకొని కాస్త ప్రశాంతంగా బటయపడింది విశాలాక్షి. కొడుకు ఆఫీసుకు వెళ్లాడు. కోడలికి పురిటి కోసం తాను బెంగుళూరు వచ్చి వుంది. ఆర్నెల్లు గడిచినా తిరిగి ఇంటికి పంపటం లేదు. చిన్నపిల్లాడితో పనులు చేసుకోవటం కష్టమని ఇక్కడే వుండమంటున్నారు. అక్కడాయన వేళకి తింటున్నారో, లేదో? వంట చేసుకోవటం రాదు. మనసెందుకో దిగులుగా అనిపించింది. భర్తను చూడాలనుంది. ఇంత వయసొచ్చాక పిల్లల ముందు 3నా భర్త దగ్గరికి వెళ్తాన2ని ఎలా చెప్పగలదు. ఈ వయసులో ఇద్దరూ ఒకేచోట ఉండాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రయాణం వాయిదా వేస్తున్నారు. ఎన్నిసార్లు తనని బాధపెట్టినా సహించింది. ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తే కొడుకు దగ్గరికి వెళ్లిపోతానని బెదిరించేది. ఆపూట మనసంతా భర్త జ్ఞాపకాలతో గడిపింది.
కోడలు గదిలో పిల్లవాణ్ని నిద్రపుచ్చుతోంది. 3విశాలాక్షి గారికి పోస్ట్..2 అనగానే తలుపులు తీసుకొని బయటికొచ్చింది. 3ఈరోజుల్లో ఉత్తరాలు రాసేదెవరు? తెల్లవారిన దగ్గర నుంచి సెన్‌ఫోన్లలో మాట్లాడలేక విసుగొస్తున్నదం2టూ పోస్ట్‌మాన్ అందించిన కవరు తీసుకుంది. తలుపులు వేసి సోఫాలో కూర్చొని కవరు చింపింది విశాలాక్షి, ఉత్తరం ఎవరు రాసివుంటారా? అని ఆలోచిస్తూ..!
లోపల తొంగిచూస్తే.. తననే సంబోధిస్తూ రాసిన ఉత్తరమది.
3సహచరీ..! ఏమిటిలా ఉత్తరం రాశానని ఆశ్చర్యంగా వుందా? ఇవాళ 3ప్రేమికుల రోజు2. పెళ్లికాని వారికి మాత్రమే కాదు, పెళ్లియిన దంపతులకు కూడా ప్రేమికుల రోజే! పెళ్లయినా కొత్తలో మనం ప్రేమించుకోలేదా? ఏమిటీ ముసలాయనకి ప్రేమికుల రోజేమిటి అంటావా? వయసు మళ్లినా ప్రేమ ఎప్పటికీ నిత్యనూతనమే! నిత్య యవ్వనంలా వుంటుంది. వారం రోజులుగా ఫోన్ చేసి మాట్లాడలేదని అలిగావా? నాకు తెలుసులే. ఒక్కరోజైనా నువ్వు నాతో మాట్లాడనిదే వుండగలవా? ఎలా వున్నావో? రెక్కలు కట్టుకొచ్చి నీముందు వాలాలని వుంది. కోడలి పురిటి పనులకని వెళ్లి ఆర్నెల్లు గడిచిపోయాయి. నేనిక్కడ ఒంటరిగా వుండలేక పోతున్నాను. నీ మెడలో మూడుముళ్లు వేసినప్పటి నుంచీ నువ్వే నాలోకం. నీతో కలిసి వేసిన అడుగులు ఏడుజన్మల బంధమన్నావు. పెళ్లిపీటల మీదు నీవు తల వంచి కూర్చునప్పుడు నీ మీద నేను మల్లెపూవు విసిరితే ఉలిక్కిపడి చూశావు. ఆ చూపుల్లో బేలతనం బాగా నచ్చింది. తొలిరాత్రి మన అనుభూతులకు గురుతుగా వారసత్వాన్ని అందించావు. ఎపుడైనా కోపమొచ్చి నిన్ను కసురుకుంటే కన్నీళ్లు పెట్టుకొని అలిగేదానివి. నిన్ను బుజ్జగించటానికి ఎంత సమయమైనా ఓదార్పుతో వుండేవాడిని. రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే నాకోసం భోజనం కూడా చేయకుండా కూర్చునేదానివి. ఇంటెడు చాకిరీ చేసి అలసిపోయి వుంటే నా సుఖం కోసం మరింత బాధపెట్టినా నా కోరికలు తీర్చావు. అమ్మలాగ ఆదరించి, ఆలిగా అనురాగం పంచి, ప్రేమగా ప్రియురాలిగా లాలించి, అన్నీ నీవుగా నా సర్వస్వమయ్యావు. ఈ ఆరు నెలల ఎడబాబు నాకెంత బాధగా వుందో? నిన్ను చూడాలని నా మనసు తపించిపోతోంది. ఉదయం నిద్ర లేవగానే పెరట్లోకెళితే రాలిపడిన మల్లెలు, జాజులు నన్ను వెక్కిరిస్తున్నాయి. ముద్దబంతి ముఖం చాటేసింది. రాత్రి పున్నమి చంద్రుడు ఏమన్నాడో తెలుసా? 3తోడులేని ఒంటరి బతుక్కి వెనె్నల అవసరమా!2.. అంటూ దెప్పిపొడిచాడు. నీ గురించి చెట్టు, పుట్ట, కొండ, కోన, సెలయేరులన్నీ చెబుతాయి. మందారం చెట్టు కింద మనం చెప్పుకున్న ఊసులన్నీ నేనెప్పటికీ మర్చిపోలేను. నీతోడుంటే చాలు నాకెంత గుండె ధైర్యమో? నీవందించిన ప్రేమ ఎంత మధురమో? నీ ముద్దుమాటలు వినాలని, నిన్ను చూడాలని మనసు తహతహ లాడుతోంది. నువ్వు దూరంగా వెళితే నేను బతగ్గలనా? నిద్ర పట్టని ఒంటరి రాత్రుల్ని అడుగు చెపుతాయి. నా హృదయ వేదన నీకు అర్థమైందనుకుంటాను. నిస్సత్తువైన ఈ దేహానికి నువ్వు రీచార్జి కావాలి. నా జీవితంలో వెలుగులు నింపిన నా దేవతవు. ప్రేమంటే వార్ధక్యంలో భార్యభర్తలు ఒకరికొకరు ఆలంబనగా దగ్గరవ్వాలి. కోరికల్ని ఎప్పుడో నియంత్రించగలిగాం. క్షణాలు యుగాలుగా గడిచిపోతున్నాయి నీకోసం ఎదురుచూపులతో..! ఇట్లు, నా ప్రాణసఖి సహచరికి.. నీ ప్రియవల్లభుడు!
ఉత్తరమంతా చదువుకున్న విశాలాక్షి పట్టలేని ఆనందంతో భర్త కోసం పరితపించిపోయింది. ప్రేమకు వయసుతో తారతమ్యాలు లేవు. ఒకరి కోసం మరొకరు జీవించటంలోనే అసలైన ప్రేమ వుంటుంది. ఆ ఉత్తరాన్ని హృయదానికి హత్తుకొని ఆనందబాష్పాలు రాల్చింది. చీర కొంగుచాటున పెట్టుకొని ఆ ఉత్తరంలోని ప్రేమ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తెల్లవారగానే ప్రయాణమైంది. ప్రేమికుల దినోత్సవం మళ్లీ ఇద్దరినీ అరవైలో ఇరవయ్యో వసంతం కురిపించింది. అప్పుడే విరిసిన మల్లెపూవులా సిగ్గుపడుతూ ఇంట్లోకి అడుగుపెట్టింది విశాలాక్షి.

- తాటికోల పద్మావతి,
గుంటూరు.
చరవాణి : 9441753376