ఆంధ్రప్రదేశ్‌

‘దారులు’ కలిసిన వేళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: కలహాలు మరిచి వివిధ అంశాల్లో కలిసి పనిచేస్తున్న ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు, ఈసారి రహదారుల కోసం చేతులు కలుపనున్నాయి. అమరావతి- హైదరాబాద్ అనుసంధానిస్తూ ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేపై కేంద్రం గతంలో ఇచ్చిన హామీ వాస్తవ రూపం దాల్చేందుకు రెండు ప్రభుత్వాలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్, అమరావతిలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. విభజన చట్టంలో ఉన్న దీనిపై మూడేళ్లు కావస్తున్నా, రెండు ప్రభుత్వాలు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. రాజధాని అమరావతిని వివిధ ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాయలసీమ నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దాదాపు 26 వేల కోట్ల రూపాయలతో మలుపులు లేకుండా నిర్మించేందుకు ఎలైన్‌మెంట్‌ను ఇటీవలే ఖరారు చేసింది. రాజధాని అమరావతిలో ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణ డిజైన్లను కూడా ఖరారు చేసింది. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ చూపడం గమనార్హం. రాష్ట్ర విభజన చట్టం హామీల్లో ఉన్నప్పటికీ, హైదరాబాద్ నుంచి అమరావతికి ఆరులైన్ల రహదారిని వేగంగా నిర్మించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ రహదారి నిర్మాణంపై నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రభుత్వం నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తోంది. విభజన హామీలో ఉండటం, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన రహదారి కావడంతో త్వరగా నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలు కలిసి లేఖ రాయాలని నిర్ణయించినట్లు సమాచారం.