శ్రీకాకుళం

ఇంటి పన్ను వసూలులో జిల్లాను ప్రథమంగా నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: మండల అభివృద్ధి అధికారులు ఇంటిపన్ను వసూలు లక్ష్యాన్ని శతశాతం సాధించి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మినృసింహం తెలిపారు. మంగళవారం మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటి పన్ను వసూలు, ఉపాధి హామీ, స్వచ్చ్భారత్- స్వచ్చాంధ్రప్రదేశ్, మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. మార్చి 31వతేదీ నాటికి లక్ష్యాలను సాధించి జిల్లాను ప్రగతిపథంలో నడిపించే బాధ్యత ఎండిఓలదేనన్నారు. స్వచ్చ్భారత్ - స్వచ్చాంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రతీ మండలంలోనూ బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన గ్రామాలను నిర్మించాలన్నారు. మరుగుదొడ్లను నిర్మించడంతోపాటు వాటిని వాడుకునేందుకు ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్ స్తంభాలను, వీధి దీపాల వివరాలు జియోటాగింగ్ వివరాలను మార్చి 1వ తేదీ నుండి 10వతేదీలోగా పంచాయతీ సెక్రటరీలు సేకరించాలన్నారు. వీటి పర్యవేక్షణ నిమిత్తం మండలంలో ఎంపిడిఓ, ఇఓపిఆర్‌డి, పంచాయతీ సెక్రటరీలు మండల టీం కింద జిల్లాలో జెసి,ముఖ్య ప్రణాళికా అధికారి జిల్లా కమిటీలుగా ఏర్పాటు కావాలన్నారు. ఉపాధిహామీ ఇబ్బందులను మెయిల్ ద్వారా పంపితే పరిష్కరిస్తామన్నారు. వేసవి దృష్ట్యా మంచినీటిని ఏర్పాటు, టార్పాలిన్లు లేదా పాకలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వాటి చెల్లింపుల వివరాలపై సమీక్షించారు. సిసిరోడ్ల నిర్మాణం, గ్రామపంచాయతీ భవనాలు, అంగనవాడీ భవనాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం, శ్మశానవాటికల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి ఉపాధిహామీ లక్ష్యాలను సాధించాలన్నారు. వేసవి ఎద్దడి ఎదుర్కోవడానికి కావలసిన కార్యాచరణ ప్రణాళికలను గ్రామీణ మంచినీటి సరఫరా అధికారులు తయారుచేయాలన్నారు. సుజలధార పథకం ద్వారా ఉద్దానం ప్రాంతంలోని 7గ్రామాలకు మంచినీటిని అందించడానికి ఎన్టీఆర్ ట్రస్టు ముందుకు వచ్చిందన్నారు. యూనిట్ ప్రారంభించడానికి స్థలాన్ని సేకరించాలన్నారు. సాలిడ్ వేస్టు మేనేజ్‌మెంటు ప్రక్రియకోసం డంపింగ్ చేయడానికి స్థలాన్ని గుర్తించాలన్నారు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. మండలప్రగతి ఎండిఓలతోనే ముడిపడి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి జి.కోటేశ్వరరావు, జిల్లా గ్రామీణ అభివృద్ది పథకసంచాలకుడు డా.జి.సి. కిశోర్‌కుమార్, ఎలక్ట్రికల్ ఎస్‌ఇడి సత్యన్నారాయణ, శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారి రామ్‌ప్రసాద్, హాజరయ్యారు.