తెలంగాణ

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌడిపల్లి, జూన్ 23: హైదరాబాద్‌కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగల ముఠా సభ్యుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అనే వ్యక్తి 45 దొంగతనాలకు పాల్పడి ఐదేళ్లపాటు జైలు శిక్షను అనుభవించి 2009 సంవత్సరంలో జైలు నుండి బయటకు వచ్చాడు. మహ్మద్ షఫీ, మహ్మద్ ముజాహిద్ పాషా, మీర్జా షోయబ్ బేగ్, మిర్జాఇర్ఫాన్ బేగ్‌లతో ఒక దొంగల ముఠాగా ఏర్పర్పుచుకొని కిడ్నాపులు, దొంగతనాలు, హత్యలకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని కత్తులతో బెదిరించి వేగనార్ కారును అపరించారు. అదే కారులో తిరుగుతూ బోయినిపల్లికి చెందిన పాత ఇనుప సామాగ్రి వ్యాపారం చేసే రామ్‌పాల్ అగర్వాల్‌కు నాచారంనకు చెందిన ఒక డిసిఎం వ్యానును దొంగిలించి అమ్ముతామని చెప్పి మెదక్ జిల్లా ఇస్నాపూర్ వద్దకు పిలిపించుకున్నారు. డిసిఎం వ్యానును కొనుక్కోమని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో 30 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన అందుకు ఒప్పుకోకపోవడంతో చితకబాది పటాన్‌చెరు ఔటర్ రింగురోడ్డు వద్ద వదిలి వెళ్ళిపోయారు. డిసిఎం వ్యాను డ్రైవర్‌ను జహీరాబాద్ శివారులో హత్య చేసి చెరువులో పడేసారు. అనంతరం వారి దృష్టి మెదక్ జిల్లాపై పడింది. కౌడిపల్లి గ్రామశివారులో గల హెచ్‌పి గ్యాస్ గోదాం వద్ద ఓ వ్యక్తిని కొట్టి అతని వద్దనుండి బజాజ్ డిస్కవర్ బైకును ఎత్తుకెళ్లిపోయారు. మంగళవారం ఉదయం కౌడిపల్లి ఎస్.ఐ సైదేశ్వర్, సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఐదుగురు వ్యక్తులు బైకులపై వెళ్తుండగా అనుమానం వచ్చి నిందితులను పట్టుకొని కౌడిపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు వచ్చి వారిని రిమాండ్‌కు పంపుతామని తెలిపారు. ఆయనతో పాటు ఎస్.ఐ సైదేశ్వర్, సిబ్బంది ఉపేందర్, శాంతకుమార్, శేఖర్, దత్తు, లక్ష్మణ్‌ను వెంకటేశ్వర్లు అభినందించారు. వీరికి రివార్డుల కోసం జిల్లా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని తెలిపారు.