ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (ఏప్రిల్ 15 - మే 14)
సహచరుల, సహోద్యోగుల అనుమానాలు, అపోహలు తొలగించి కార్యోన్ముఖులను చేస్తారు. వృత్తి, వాణిజ్యాలలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఖర్చులను మదింపు చేయడం ద్వారా ఆర్థికంగా మెరుగైన స్థాయికి చేరుకుంటారు. కొత్త పద్ధతులను, పరికరాలను వినియోగించి వ్యవహారాలను వేగవంతం చేస్తారు. సామాజిక, రాజకీయ వ్యవహారాలను కొత్త కోణంలో విశే్లషించి పరిష్కారాలను సూచిస్తారు. 21, 22 తేదీల్లో ప్రోత్సాహకర వాతావరణం ఇంటా బయటా ఉంటుందని చెప్పవచ్చు.

వృషభం (మే 15 - జూన్ 14)
ఇతరుల, ప్రత్యర్థుల ఆలోచనలను పసిగట్టి దీటుగా స్పందిస్తారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించి అందరి ఆకాంక్షలు తీర్చేందుకు తగిన వాతావరణం కల్పిస్తారు. 19, 20 తేదీల్లో అనుకోని పరిణామాలు కొన్ని ఆందోళనకు గురి చేసినా అది తాత్కాలికమే. శ్రేయోభిలాషులతో చర్చించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మాతృవర్గం వారితో విభేదాలు, వియోగం ఏర్పడవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది.

మిథునం (జూన్ 15 - జూలై 14)
వారారంభంలోనే ముఖ్యమైన పనులు పూర్తి చేయడం శ్రేయోదాయకం. ఓపికతో కృషిచేస్తే అన్ని వర్గాల వారినీ మీ బాటలో నడిపించగలుగుతారు. స్ర్తిలు, పిల్లల అభిమతాలు తీర్చి సంతృప్తి పరచగలుగుతారు. అవసరాలకు తగినంత ధనం ఆలస్యంగానైనా మీ చేతికందుతుంది. వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన తరుణమిది. రాబోయే పరిణామాలను ఊహించి విశే్లషిస్తారు.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)
ఒత్తిడులను, సవాళ్లను తట్టుకుని మీ బాధ్యతలను నిర్వహించడంలో కృతకృత్యులవుతారు. ప్రణాళికలను హేతుబద్ధంగా వివరించి సహచరులను ఉత్తేజపరుస్తారు. అనుకోని ఖర్చులు పెరిగి మీ ఆర్థిక నిల్వలు తరుగవచ్చు. కుటుంబ విషయాలలో అధిక సమయం కేటాయించి, సత్వర ప్రగతికి మార్గాంతరాలు వెతుకుతారు. గురు, శుక్రవారాల్లో చర్చలు, సమావేశాలు ఆలోచించి నెరపడం శుభకరం. భాగస్వాముల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. స్వవిషయాలలో మీ అభిమతాలు నెరువేరుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)
సంఖ్యాపరంగా తక్కువే అయినా చెప్పుకోదగ్గ విజయాలు ఈ వారం సాధిస్తారు. 19, 20 తేదీల్లో నూతన పరిచయాలు, ఒప్పందాలు, బాధ్యతలు మిమ్మల్ని కొత్త లోకానికి పరిచయం చేయవచ్చు. వృత్తి వాణిజ్యాలు ఉత్తేజపూరితంగా ఉంటాయనడంలో సందేహం లేదు. నైపుణ్య సాధనలో ఇతరుల కంటే ముందుంటారు. పిల్లల, ఆత్మీయుల వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ వల్ల సోదర వర్గం చైతన్యం పొంది ఆలోచన పరిధిని పెంచుకోగలుగుతారు. విద్యార్థులకీ వారం అన్ని విధాలా సంతృప్తికరంగా సాగుతుంది. క్రీడలలో రాణిస్తారు.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)
అవరోధాలను దాటుకుని ప్రగతి బాటలో పయనించ గలుగుతారు. కుటుంబ వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపి వారికి నూతనోత్తేజాన్ని కలుగజేస్తారు. అధికారుల నుండి ప్రశంసలు, అనుయాయుల నుండి తోడ్పాటు లభించడం మీకు మనోధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇచ్చిపుచ్చుకోడాలు సక్రమంగా సాగుతాయనవచ్చు. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం ఆరోగ్యదాయకం. స్వశక్తితో కృషిచేసి అన్ని విషయాల్లో మీ ప్రాధాన్యతను నిలుపుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)
మీ తేజస్సును, గొప్పతనాన్ని ఓర్వలేక కొంత మంది కుటిలంగా కృషి చేసినా మీకు వచ్చిన కష్టమేమీ లేదు. మంగళ, బుధవారాల్లో అనుకోని పరిణామాలేర్పడినా ఓర్పుతో నెగ్గుకు వస్తారు. స్వార్థపరులను నిలువరించ గలుగుతారు. 22, 23 తేదీల్లో నవీన దృక్పథంతో వ్యవహరించి భవిష్య ప్రణాళికలకు రూపకల్పన చేస్తారు. అనుచర గణం ఆలోచనలతో ఆశించిన మార్పును తీసుకు రాగలుగుతారు. పెద్దల ఆశీర్వాదాలు, అధికారుల తోడ్పాటు, సహోదరుల సహకారం వల్ల వారమంతా ప్రోత్సాహకరంగా గడుస్తుందని చెప్పవచ్చు.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)
సమస్యలు, వాటి ప్రభావాలను గూర్చి సన్నిహితులతో కూలంకషంగా చర్చిస్తారు. మీరు ఆశించిన మార్పులను అనుయాయులతో తీసుకు రాగలుగుతారు. ఇబ్బడిముబ్బడిగా ఖర్చులున్నా ఏదో విధంగా ధనం సమకూర్చుకో గలుగుతారు. క్రయ విక్రయాలలో మధ్యవర్తులను అదుపు చేయడం అవసరం. ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాల పట్ల ఉత్సుకత ప్రదర్శిస్తారు. కర్షకులకు, కార్మికులకు ప్రోత్సాహకర వారమిది. కోర్టు లావాదేవీలలో సంయమనం పాటించండి. కుటుంబ వ్యక్తుల మధ్య సామరస్య వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)
నిర్మాణాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యత నిస్తారు. నూతన పదవులు, గౌరవ పురస్కారాలు అందుకునే సూచనలున్నాయి. గతంలో చేసిన కృషికి తగిన అభివృద్ధి గురు, శుక్రవారాల్లో పొందగలరు. భేదాభిప్రాయాలున్నా సోదర వర్గం నుండి సహాయ సహకారాలందగలవు. రావలసిన డబ్బు అందడంతో ఆర్థిక స్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతంలో ఆరోగ్యంలో మార్పులేర్పడే సూచనలున్నాయి. ఆత్మీయుల కోసం కొన్ని విషయాల్లో త్యాగం చేయక తప్పదు. విందు వినోదాలకై సమయం కేటాయించి ఆనందిస్తారు. విద్వాంసుల పరిచయం ఉల్లాసాన్నిస్తుంది.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
అన్ని వర్గాల వారు మీ ఆలోచనలు, అభిప్రాయాలు ఆచరణ యోగ్యమైనవని గ్రహిస్తారు. అవసరార్థం కొంతకాలంగా మీరు కార్యక్రమాలు నిదానంగా కొనసాగించినా ఈ వారం నుండి వేగం పెంచగలుగుతారు. విద్యా వాణిజ్య రంగాలలో మీ ప్రతిష్ట ద్విగుణీకృతమవుతుంది. తీరిక లేకుండా పని చేయాల్సి వచ్చినా ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయని చెప్పవచ్చు. చిరకాల వాంఛలు, కోరికలు కొన్ని ఆత్మీయుల సాయంతో తీర్చుకుంటారు. ఆదాయం తగినంతగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)
బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసినా మీ కార్యనిర్వహణా సామర్థ్యంతో ఎట్టకేలకు విజయం సాధిస్తారు. ఖర్చులకు తగినంత ఆదాయం లభిస్తుంది. భాగస్వాముల, సన్నిహితుల ప్రవర్తన కొంత అసహనం కలిగించినా అర్థం చేసుకుని ఓర్పు వహించండి. వృత్తి పనివారలకిది పరీక్షా కాలం. క్రయవిక్రయాలు, పెట్టుబడులు ప్రోత్సాహకరంగానే ఉంటాయి. ఆధునిక పరికరాలు, విలాసాలకై చేసే ప్రయత్నాలు ఫలించడానికి కొంత సమయం పట్టవచ్చు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)
వాయిదా పడుతున్న పనులు ఓ కొలిక్కి రావడంతో మీలో చురుకుదనం పెరుగుతుంది. హడావిడి ప్రయాణాలు, అనుకోని బాధ్యతలు మీద పడినా చింతించక సంయమనంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో సాధారణ ఫలితాలున్నా క్రమంగా ప్రగతిని సాధిస్తారు. స్థల సేకరణ, గృహ మార్పులకు అవకాశాలు అధికం. వేడుకలు, శుభకార్యాలలో పాల్గొని ఆత్మీయులతో ఆనందిస్తారు. మీ మనోభావాలను సరళంగా తెలియజేసి అందరి మన్ననలు సాధించే ప్రయత్నం చేస్తారు. క్షేత్రస్థాయిలో మార్పులకు శ్రీకారం చుడతారు.

ఎస్.రవిప్రకాశ్