రాజమండ్రి

మళ్లీ మన వొడిలోకే చేరు.. (చిన్నకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్లో సమోసాలు కొనుక్కుంటూ మా పెట్టెలోకి వచ్చిన మూడేళ్ల కుర్రాడిని చూసి ఉలిక్కిపడ్డాను. వాడు అచ్చు స్వాతి బాబులా వున్నాడు. మూడు దశాబ్దాల క్రితం విజయవాడలో ఉండగా మా పక్కింట్లో ఆంధ్రా బ్యాంకులో పనిచేసే ఆనందరావు దంపతులకి ఒక్క బాబు. వాడు స్వాతి నక్షత్రంలో పుట్టేడని వాడికి ఆ పేరు పెట్టమని చెప్పాం. వాళ్లు మా ఇంట్లో వున్నంతకాలం ఎక్కువగా నా దగ్గరే ఉండేవాడు. తరువాత వారికి ఇద్దరు కవల ఆడపిల్లలు కలిగారు. పిల్లలని తీసుకుని కాశీ వెళ్లినప్పుడు అక్కడ స్వాతిబాబు మరణించాడు. పడవలో గంగానది మధ్యకి వెళ్లిన స్వాతిబాబుని గంగలో వదిలేసి వచ్చామని ఆమని గారు వెక్కివెక్కి ఏడవడం, వాడి గురించి నేను బెంగపడి మంచం పట్టడం, కొన్నాళ్లకి వాళ్లు బదిలీ అయి నెల్లూరు వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఆల్బం తీసి చూసినప్పుడల్లా స్వాతిబాబుని ఎత్తుకుని దిగిన ఫొటో చూసి బాధపడేదాన్ని. ఆమని గారు ఎలా వున్నారో? తరచూ చూడటం వల్ల స్వాతిబాబు రూపం నాకు గుర్తుండిపోయింది. అచ్చు అలాగే ఉన్నాడు ఈ పిల్లాడు!
‘స్వాతీ.. ఇలా రారా!’ అంటూ ఒకామె మా పెట్టెలోకి వచ్చింది. ఆమెను చూసి నేను గుర్తుపట్టాను. ‘ఆమనీ’.. పిలిచాను చిన్నగా.
నా వంక ఆశ్చర్యంగా చూస్తూ ‘మా అమ్మ పేరు ఆమని’ అన్నది.
‘నువ్వు ఆనందరావుగారి అమ్మాయివా?’ అడిగాను.
‘అవునండీ! మీకు మా అమ్మా, నాన్న తెలుసా?’ అంది.
‘బాగా తెలుసు. మీరు పుట్టింది మా ఇంట్లోనే. నీ పేరు పద్మినా? లలితనా?’ అని అడిగాను.
‘మా అందరి గురించి చెప్పేస్తున్నారు. అమ్మకి మీరు బాగా దగ్గరి ఫ్రెండ్ అన్నమాట. పక్క పెట్టెలో మా అమ్మగారు వున్నారు, పిలుచుకొస్తాను’ అంటూ వెళ్లి ఆమనిని తీసుకొచ్చింది.
ఇద్దరి కళ్ల వెంటా ఆనందబాష్పాలు.
‘స్నేహబంధమూ.. ఎంత మధురమూ!..’ అన్నాను ఆశ్చర్యంగా!
‘అవును ఆల్బంలో వాడి ఫొటోలు వచ్చినప్పుడల్లా చూసేవారు. అన్నయ్య రూపు వాళ్ల మనసులో.. వాడు లేకున్నా మేనమామ పోలికలో వీడు.. ఇదే మరి. మమతానురాగాలు స్వాగతాలు పాడ అంటే. మళ్లీ తనవాళ్ల మధ్యలోకి వాడు’ కన్నీళ్లతో చెప్పింది ఆమని.

- వేమూరి అనూరాధ, విజయవాడ.
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- వేమూరి అనూరాధ, విజయవాడ.