సబ్ ఫీచర్

‘మైండ్‌సెట్’ మారేదెన్నడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటిన ప్రధాని మోదీ కంటే.. తామెందుకు ఓడిపోయాం, ఇక తమ పార్టీల భవిష్యత్తేమిటన్న దానిపై నిజాలు మాట్లాడిన ఒ మర్ అబ్దుల్లా, చిదంబరం, మణిశంకర్ అయ్యర్ వంటి స్థితప్రజ్ఞులను అభినందించాలి. మరో ఐదేళ్ల వరకూ తమ ‘దౌర్భాగ్యం’ ఇలాగే ఉంటుందని ‘ఏడున్నరేళ్లముందే’ ఈ నేతలు కనిపెట్టడం విశేషమే. తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్, దాని తోక పార్టీలకు ఇంకా కర్తవ్యం బోధ పడనట్లుగానే ఉంది. చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తుంచుకుంటుంది. కానీ, మనం పరాజితుల భవిష్యత్తునూ ఆలోచించాలి. ఐదు రాష్ట్రాల ఫలితాల్లో తమ జాతకాలు బయటపడ్డాక కూడా విపక్షాల ‘మైండ్‌సెట్’ మారకపోవడం ఆశ్చర్యకరం. మతం,కులం కార్డుతో గెలిచారన్న పాత విమర్శలనే విపక్షాలు తెరపైకి తీసుకువచ్చాయే తప్ప, తామెందుకు ఓడామోనన్న ఆత్మవిమర్శ వారిలో కాస్తయినా కనిపించడం లేదు. దేశానికి గుండెకాయ వంటి యుపి గద్దెను ‘కమలం’ చేజిక్కించుకోవడం ‘కాంగ్రెస్ అండ్ కో’కు మింగుడుపడకపోవడం సహజమే. కాంగ్రెస్ ఉద్ధారకుడు రాహుల్ గాంధీ పాదమహిమకు, కొత్తగా ఇప్పుడు సోదరి ప్రియాంక వధేరా పాదం కూడా తోడైంది. కోట్ల రూపాయలు పోసి ప్రశాంత్ కిశోర్ అనే మేధావిని అరువు తెచ్చుకున్నా ‘సొమ్ములు పోనాయి’ తప్ప ఫలితం దక్కలేదు. రాహుల్ బాబా పాదమహిమ, యాదవ కుటుంబంలో ముసలం, మోదీ ఇమేజ్, అవినీతిపై సమరం అన్నీ కలసి బిజెపిని గద్దెనెక్కించాయి.
తాజాగా ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాలు, వ్యాసరాజాలు చూస్తే.. తెలుగుమీడియా నయా రాజగురువుగారి ఆగ్రహానికి దహించే శక్తి ఉంటే ఈపాటికి ‘కమలం’ మాడి మసి అయి ఉండేది! యుపి ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాన్ని తక్కువచేసి చూపేందుకు మేధావులు చాలా కష్టపడుతున్నట్లుంది. మోదీ సర్కారు పనితీరు, బిజెపి ఎన్నికల వ్యూహం, ప్రచారకళ వంటివేవీ ప్రస్తావించకుండా కేవలం మతం-కుల సమీకరణల ఆధారంగానే బిజెపి విజయం సాధించిందన్న విశే్లషణలు మీడియా మేధావుల ఆత్మసంతృప్తికి పనికొస్తాయే తప్ప, వాదనకు నిలబడవు. మొదటి నుంచీ.. మోదీ- ఏపికి ప్యాకేజీ-హోదా, పెద్దనోట్ల రద్దు అంశాల్లో నిప్పులు కురిపిస్తున్న ‘తెలుగుమీడియా మార్గదర్శి’- అదే అంశాల్లో తాము నడిపిస్తున్న పార్టీ కేంద్రంపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించే సాహసం చేయబోరు.ప్రస్తుతం ఆంధ్రదేశంలో ‘కుల’పతులు, దళపతులు ఏది చెబితే అది వేదం మరి. ‘్ఢల్లీ నాయుడు’ని పొగుడుతూనే, అదే పార్టీని మాత్రం తెగడటం ఏం మతలబో? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకరు నడిపిస్తే, కొత్త రాష్ట్రంలో ఇప్పుడు మరొకరు నడిపిస్తున్నారు. వీరు చాలరన్నట్లు.. నవ్యాంధ్రలో కొత్తగా కళ్లు తెరిచిన జర్నలిస్టు సంఘాలు, ఆ నాయకులు కూడా పెద్దల పేరు చెప్పి మం త్రులను శాసించే పనిలో ఉ న్నారు. వ్యక్తులు, సంస్థలు మా రాయే తప్ప మిగిలినదంతా ‘సేమ్ టు సేమ్’!
కులం-మతం ఆధారంగానే బిజెపి గెలిచిందన్న వాదనలో అర్థం లేదు. వెస్ట్ అలహాబాద్‌లో 60 శాతం ఉన్న మైనారిటీలు ఏనాడూ హిందూ అభ్యర్థిని గెలిపించిన దాఖలాలు లేవు. అలాంటిది తాజా ఫలితాల్లో బిజెపి అభ్యర్ధి 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారంటే, మైనారిటీల్లో కూడా మార్పు వస్తున్నట్లే కదా? ఈ చిన్నపాటి లాజిక్కును కూ డా అర్థం చేసుకోలేని వారికి ‘విశే్లషకుల’ని పేరు పెట్టడం ఎం దుకో..? మరికొన్ని మీడియా సంస్థలు ‘మణిపూర్ ఉక్కుమహిళ’ ఇరోన్ చాను షర్మిలకు కేవలం 90 ఓట్లే రావడంపై తెగ బాధపడ్డాయి. షర్మిల ఓటమిని వారు ‘ప్రజాస్వామ్యానికి విషాదం’గా అభివర్ణిస్తే, మన పవన్‌కల్యాణ్‌బాబు కూడా చాలా ఫీలయిపోయారు. అమెరికా అ ధ్యక్ష ఎన్నికల ముందు కూడా అక్కడి మీడియా ఏకమై ట్రంప్ గెలవడని కోడై కూసింది. తమిళనాడులో ప్రజాభిమానం ఉన్న పన్నీర్ సెల్వాన్ని కాదని, శశికళ భక్తుడు పళని స్వామికి సిఎంగా అవకాశం ఇవ్వడాన్ని మీడియా సహా అక్కడి సినీనటులంతా విస్మయం వ్యక్తం చేశారు.
అవినీతిపై సమరశంఖం పూ రించిన లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కూడా గత ఎంపీ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు. ఇక్కడ నేతల వ్యక్తిత్వం కంటే ప్రజల నిర్ణయమే ముఖ్యం. అంతా తాము అనుకున్నట్లు, తమ ఆలోచనకు అనుగుణంగా ప్రపంచం నడవాలనుకునే మీడియా ఆసాములు జనం నాడినే చూడాలి తప్ప, వ్యక్తుల ప్రతిభను కాదు. ఇందిర, వాజపేయి, అద్వానీ, ఎన్టీఆర్, వెంకయ్య, చంద్రబాబు వంటి మహామహులూ ఓడిపోతే అది ప్రజాస్వామ్యానికి విషాదమంటే ఎలా? ‘మీడియా మోతుబరుల’ మాటల్ని పార్టీ నాయకత్వాలు వింటాయేమో గానీ, ప్రజలు వినరు కదా?! మళ్లీ బిజెపి విజయాల్లోకి వస్తే.. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా గవర్నర్ల దయ వల్ల- అక్కడ బిజెపి ప్రభుత్వాలే ఏర్పడటం ప్రజాస్వామాన్ని అపహాస్యం చేయడమే. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు- కాంగ్రెస్ గవర్నర్లు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేయడం, మెజారిటీ ఉన్నా ఆ హ్వానించని అప్రజాస్వామ్య ని ర్ణయాలపై గావుకేకలు పె ట్టిన బిజెపి ఇప్పుడు ఆ తానులో ముక్కనేనని ని రూపించుకుంది. తాను జనాకర్షక విధానాలకు వ్యతిరేకమని చెప్పిన దే శ్‌కీ నేతా మోదీజీ- యు పిలో ఆ మాటను అటకెక్కించి, రైతులకు రుణమాఫీ హామీ ఇ చ్చారు. అమెరికాలో డొనాల్డ్ ట్రం పయినా, ఇండియాలో మోదీ అయినా జనం నాడి ప్ర కారం నడుచుకోవాల్సిందే! సిద్ధాంతాల గురించి మాట్లాడేముందు వాటికి కట్టుబడి ఉంటేనే ఇతరులను విమర్శించాలి. లేకపోతే అభాసుపాలు కాకతప్పదు. దీనికి మోదీజీ మినహాయింపేమీ కాదు. ఇప్పుడు ఆయా రా ష్ట్రాల్లో తమ పార్టీ ప్రభుత్వాల ఏర్పాటు కోసం పరితపిస్తున్న వెంకయ్య నా యుడు, 1985లో ఎన్టీఆర్ సర్కారును కూలదోసిన అప్పటి గవర్నర్ రాంలాల్ చర్యపై పోరాడిన విషయాన్ని ప్రస్తావించకుండా ఉండలేం. నాడు ఇద్దరు నా యుళ్లు కలసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, ఎన్టీఆర్‌ను తిరిగి గద్దెనెక్కించడంలో కీలకపాత్ర పోషించిన నాయకులే. ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి రాకముందు వరకూ జరిగిన ప్రభుత్వాల మార్పిళ్లు, కూల్చివేతలు, గవర్నర్ల నిర్ణయాలపై గళమెత్తిన ‘నెల్లూరు నాయుడు’ ఇప్పుడు మెజారిటీ ఉన్న పార్టీని కాదని, తమ పార్టీని ప్రతిష్టించేందుకు చాలా కష్టపడ్డారు. దీని భావమేమి తిరుమలేశా?
గోవా, మణిపూర్‌లో తమ పార్టీని కాదని, గవర్నర్లు బిజెపిని ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ యువరాజు రాహుల్ ఆక్షేపించడమే ఆశ్చర్యం. తన నాయనమ్మ ఇందిర కాలం నుంచీ ఈ ప్రజాస్వామ్య హత్యల పరంపర ప్రారంభమైన వాస్తవాన్ని రాహుల్ బాబు మర్చిపోయినట్లున్నారు. ఎన్నికైన ప్రభుత్వాల పీక నులిమేయడం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటమే వింత. గవర్నర్ల పాత్ర గురించి ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్న వామపక్షాలు- కాంగ్రెస్ హయాంలో అదే గవర్నర్లు పోషించిన అడ్డగోలు పాత్రను మరచిపోవడం విడ్డూరం. కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టులు తమ భుజాన వేసుకుని మోసిన రోజుల్లోనూ ఇలాంటి అరాచకాలు జరిగిన విషయాన్ని విస్మరించడం సరికాదు.
* * *
ఎట్టకేలకు ఏపి ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఈ విషయంలో నెల్లూరు నాయుడు, చిత్తూరు నాయుడుతోపాటు, కేంద్రమంత్రి సుజనా చౌదరి పడిన కష్టానికి ఫలితం దక్కింది. ప్రచారానికి నోచుకోకున్నా మోదీ, జైట్లీ కూడా అభినందనలకు అర్హులే. చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇది పెద్ద ఊరట. బిజెపి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అయితే- సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధ్రీశ్వరి తప్ప ‘నిజాలు చెప్పే నాయకులు’ లేకపోవడం ‘కమలం’ పార్టీ చేసుకున్న దురదృష్టం.
నిజానికి పోలవరం ముంపు గ్రామాల గురించి సోము వీర్రాజు హెచ్చరించి, అప్రమత్తం చేసే వరకూ పాలకులకు దాని ప్రాధాన్యం తెలియలేదు. ఆ తర్వాతనే బాబు ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేసి ముంపు గ్రామాల విలీనం ప్రకటన తర్వాతే సీఎంగా ప్రమాణం చేశారు. కానీ, బిజెపి మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం అదంతా చంద్రబాబు ఘనతేనని కుటుంబసభ్యులపై నిండుసభలో ఒట్టేయడం విస్మయకరం. అంటే దీన్నిబట్టి రాష్ట్రంలో బిజెపి నేతలు తాము సాధించిన విజయాలను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా లేరన్నమాట!
ప్యాకేజీకి చట్టబద్ధత ఇచ్చాక కూడా ఇంకా ‘హోదా’ గురించి మాట్లాడటం అవివేకం. దానివల్ల పొలిటికల్ మైలేజీ వస్తుందనుకుంటే అది భ్రమ. గతంలో హోదానే సంజీవని అన్న బాబు, ఇప్పుడు ప్యాకేజీ గురించి మాట్లాడాన్ని విపక్షనేత వైఎస్ జగన్ తప్పుపట్టడాన్ని ఆక్షేపించలేం. తర్వాత తత్త్వం తెలుసుకున్న బాబు ప్యాకేజీని స్వాగతించారు. జగన్ కూడా ప్యాకేజీలో మరిన్ని అంశాలు చేర్చాలని పోరాడితే బాగుంటుంది. నిజానికి జగన్ పోరాడాల్సింది కేంద్రం పైన కదా? ఇకనైనా జగన్ సరైన అడ్రసును సంప్రదిస్తే మంచిది. *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144