నెల్లూరు

పెట్టుపోతలు కథ మనసును తాకింది ( స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపులో ప్రచురించిన పెట్టుపోతలు కథ చాలా బాగుంది. అసలు పెట్టుపోతలు అంటే మన సంప్రదాయాలను గౌరవించడం. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా జరిగితే మన బంధువులను మనకున్నంతలో గౌరవించడం మన సంప్రదాయం. కానీ వచ్చిన తమకు ఇవి కావాలి, ఈ స్థాయిలో మర్యాదలు వుండాలని ఆశించడం సబబు కాదు. అవతల వారి స్థితిగతులను కూడా అర్ధం చేసుకుని మసలుకోవాలి. వాళ్లకు ఉంటే ఎంతైనా పెట్టొచ్చు కానీ అవతలివాళ్ల పరిస్థితి కూడా తెలుసుకుంటే శుభకార్యానికి అర్ధం వుంటుంది. కథను చదివిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడతామంటే ఫోన్ నెంబరు కలవలేదు. ఒక నెంబరు మిస్సయ్యింది. అందుకే స్పందన తెలియజేస్తున్నాను. పెట్టుపోతలు కథ మొదటి నుంచి చివరి వరకు ఎంతో గొప్పగా మలిచారు.
- అయినాబత్తుల శ్యామల, వింజమూరు
- ఘనశ్యాం ఆచారి, మేదరమెట్ల
- శశికళ ఆరుద్ర, సన్నిధివీధి, కాళహస్తి

నీతి సుధ శతకం కాదు జీవనమార్గ నిర్దేశం
గతవారం మెరుపులో లోకోక్తులు అందించిన నీతిసుధ శతకం అన్న శీర్షికతో రాసిన పుస్తక సమీక్ష బాగుంది. రచయిత పప్పు బాలు గారు ఆణిముత్యాల్లాంటి పదాలతో గొప్ప భావాలు చొప్పించే ప్రయత్నమే నీతిసుధ పుస్తకం ఉద్దేశం. రచయిత తాను చెప్పదలచుకున్న భావాన్ని గొప్ప పదాలతో రాసిన నీతిసుధ పుస్తకంలోని కొన్ని వాక్యాలను పాఠకులకు వివరించేలా పుస్తక సమీక్ష చేసిన గౌతమి గారు అభినందనీయులు. నిజంగా ఆ పుస్తకంలో బాలు గారు ఎలాంటి వాక్యాలు పొందుపర్చారో తెలియదు గానీ సమీక్షలో రాసిన కొన్ని వాక్యాలు మనసును తాకాయి. గొప్ప పుస్తకాన్ని రాసిన రచయిత పప్పు బాలు గారికి, అందులోని విషయాలను మాకు అందించిన సమీక్షకురాలు గౌతమి గారికి ధన్యవాదములు.
- హేమచంద్ర, కావలి
**

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net