తెలంగాణ

ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: కాంట్రాక్టర్లకు మేలు చేయటం కోసమే రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల రీ-డిజైన్ చేపట్టారని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ విమర్శించారు. ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులని ముద్ర వేస్తున్నారని ఆయన అన్నారు.
జవాబ్‌దో-హిసాబ్ దో పేరిట ఆదివారం నగరంలో జరిగిన ఓ ప్రజా కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను తొలగించారని ఆయన విమర్శించారు. ధర్నా చౌక్‌ను తొలగించినట్లే, సోమాజిగుడా ప్రెస్ క్లబ్‌లో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మీడియా ముందుకు వస్తే, వారినీ అడ్డుకుంటుందేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఒక వ్యవసాయ విధానం ప్రకటించేలా జెఎసి పూర్తిగా ప్రభుత్వంపై వత్తిడి తెస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో లక్ష ఎకరాల భూ సేకరణ జరుగుతున్నదని, ఇది 2013 చట్టం ప్రకారమే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే నచ్చడం లేదని కోదండరామ్ అన్నారు.
ఎమర్జెన్సీ కాలం కంటే..
ఇలాఉండగా స్వరాజ్ అభియాన్ జాతీయ అధ్యక్షుడు ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలం కంటే ఎక్కువగా అణచి వేస్తున్నారని ఆయన విమర్శించారు. అసలు ధర్నాలను ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమతం చేసి, ధర్నాచౌక్ అనడమే హక్కులను హరించినట్లు అవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ధర్నా చౌక్‌ను నగర శివారుకు తరలించడం సమంజసం కాదని ఆయన తెలిపారు. హిట్లర్ కూడా ఇలా చేయలేదని అన్నారు. దేశంలో అవినీతికి అంతులేకుండా పోయిందన్నారు. మంత్రిపై అవినీతి ఆరోపణలు నమోదు చేయాలంటే సదరు మంత్రి అనుమతి తీసుకోవాలన్న నిబంధన తేవడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ అవినీతి ‘కాగ్’ నివేదికతో బహిర్గతమైందని ఆయన తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు. యూపిలో యోగి ఆదిత్యానాథ్ సిఎం కావడం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. వందలాది మంది ముస్లింల హత్యకు కారకుడైన యోగి సిఎం కావడం దురదృష్టకరమని ప్రశాంత్ భూషణ్ అన్నారు.