తెలంగాణ

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణలో వేడిగాలులు వీచడం ప్రారంభమైంది. పగటివేళ అత్యధిక ఉష్ణోగ్రతలు 39 నుండి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. పగటివేళ ఎండలో తిరిగే వారు ఇప్పటికే తలనొప్పి తదితర సమస్యలకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పొడివాతావరణం నెలకొని ఉంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూలు, వనపర్తి, సూర్యాపేట తదితర జిల్లాల్లో వాతావరణంలో తేమశాతం బాగా తగ్గింది. దాంతో పగటివేళ ఉక్క ఎక్కువగా పోస్తోంది. హైదరాబాద్‌లోని భారతీయ వాతావరణ కేంద్రం (ఐఎండి) సమాచారం ప్రకారం ఆదిలాబాద్‌లో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 40 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో 39 డిగ్రీల సెల్సిస్ నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిమగ్నమైంది.