తెలంగాణ

పిల్లల్ని వేధిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ రాష్ట్రంలో బాలబాలికలపై లైంగిక దాడులకు పాల్పడే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. దేశంలోనే మొదటి సారిగా ఈ స్కీంను అమలు చేసిన ఘనత తెలంగాణ మహిళా శిశుసంక్షేమ శాఖకే దక్కుతోంది. 2016-17లో రాష్ట్రం మొత్తం మీద 933 మంది బాలబాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. తప్పిపోయిన పిల్లలు 2321 ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 944 మందిని శిశు సదనాలలో ఉంచారు. మిగిలిన 1377మంది బాలలను వారి కుటుంబాలకు అప్పగించారు. ఆపరేషన్ మస్కాన్-2, ఆపరేషన్ స్మైల్-3 కింద 6318మంది పిల్లలను వెట్టి నుంచి విముక్తి చేయించి తల్లితండ్రులకు అప్పగించారు. బాలబాలికల దత్తత ప్రక్రియలో ఎటువంటి స్కాంలకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 136 మంది పిల్లలను దేశంలో, 26 మంది పిల్లలను విదేశాలకు దత్తత ఇచ్చారు. పునరావాస ఆర్థిక సహాయం కింద 1.63 కోట్లను ఖర్చుపెట్టారు. మహిళల అక్రమ రవాణా, వరకట్న హత్యలు, లైంగిక హింసలకు బలైన 422 మంది బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 16476 ఫిర్యాదులు గృహ హింసకు సంబంధించి ఇందులో 2681 కేసులను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించారు. 11,682 కేసుల్లో గృహహింస నిరోధక చట్టాల కింద నివేదికలను అందించారు. 85 కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలో పది జిల్లాల్లో, జిల్లా కేంద్ర ఆస్పత్రి ప్రాంగణంలో సఖి కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో హింసకు గురైన నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లలను ఆదునేందుకు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు.
మహిళా శిశు సంక్షేమ శాఖకు వచ్చే ఏడాది బడ్జెట్ రూ.1680.27 కోట్ల నిధులు కేటాయించారు. ఇందు లో సమగ్ర శిశు పథకం కింద కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూ.854.61కోట్లను కేటాయించారు. పౌష్టికాహారానికి రూ. 360.03కోట్లు, ఆరోగ్య లక్ష్మికి రూ.285కోట్లు, మహిళా భద్రత, రక్షణకు రూ.8.74కోట్లు, సమగ్ర శిశు సంఱక్షణ పథకం కింద రూ.17.28 కోట్లు, సబల స్కీం కింద రూ.30 కోట్లు, అంగన్ వాడీ సెంటర్ల నిర్మాణానికి రూ.45.72కోట్లు, సంరక్షణ, పిల్లల సేవలకు రూ.15.58కోట్లు, బాలికా సంరక్షణ పథకం కింద రూ.10కోట్లు, తెలంగాణ మహిళా సహకార అభివృద్ధికి రూ.12.05కోట్లను కేటాయించారు.