Others

గోళ్ళు కాదు.. వేళ్ళ కిరీటాలు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెయిల్ ఆర్ట్ చాలా పురాతన పద్ధతుల్లో ఒకటి. ఫ్యాషనబుల్‌గా మార్కెట్‌లోకి నెయిల్ ఆర్ట్ లేటెస్ట్ ట్రెండ్‌గా వచ్చేసింది. ఉంగరాలకంటే గోళ్ళపై ఆర్టే అందాన్నిస్తుంది. అంతేకాదు, ఈ నెయిల్ ఆర్ట్ సందర్భాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. గోళ్ళకు నెయిల్ పాలిష్ అనేది ఒకప్పుడు ఫ్యాషనే కానీ ఇప్పుడు నెయిల్ ఆర్ట్ మాత్రమే కనిపిస్తోంది. గోళ్ళపై వెరైటీ డిజైన్స్, చెమ్కిలు, స్టోన్స్‌తో వర్క్ చేయడం అనేది ఒక ఆర్ట్. చీర కట్టుకున్నా జీన్స్ వేసుకున్నా ఈ నెయిల్ ఆర్ట్ సూట్ అవుతుంది. అంతేకాదు ఈ నెయిల్ ఆర్ట్‌లో డిఫరెంట్ డిజైన్స్ వున్నాయి. మన మూడ్‌ని బట్టి మరియు మన టేస్ట్‌ని బట్టి నెయిల్ ఆర్ట్ వివిధ పద్ధతుల్లో వేసుకోవచ్చు. మన దేశంలో వేసుకునే గోళ్ళ రంగుకు జస్ట్ మోడర్న్ లుక్- నెయిల్ ఆర్ట్!
నెయిల్ ఆర్ట్‌లో వాడే నెయిల్ పాలిష్‌లో ఎసెంటోస్ ఎధిల్ లాక్టేట్, టేరస్తాలిక్ ఆసిడ్ వంటి అనేక రకాల రసాయనాలుంటాయి. గోళ్ళు నెయిల్ పాలిష్‌లోని పిగ్మెంట్‌ను గ్రహిస్తాయి కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నపుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకూడదు. దీనివల్ల గోళ్ళపై మరకలు పడతాయి. ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఆహారంలో కాల్షియం విటమిన్, జింక్ సప్లిమెంట్స్ తీసుకుంటే గోళ్ళు ఆరోగ్యంగా వుంటాయి. కఠినమైన నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడకూడదు. గోళ్ళు పొడిబారిపోతాయి. ఒక గోళ్ల రంగుని వేసుకుంటే రెండు మూడు షేడ్‌లు కనిపించేలా ‘కలర్ షిఫ్టింగ్ మల్టీక్రోమ్’ నెయిల్ పాలిష్‌లు వస్తున్నాయి. ఈ రంగుల్ని వేసుకుంటే ఒకే గోరు మీద రెండు రకాల గోళ్ల రంగును కళాత్మకంగా వేసినట్లే కనిపిస్తుంది. అంతేకాదు, కాంతి పడినపుడు ఇది ప్రకాశవంతంగా మెరవడంతోపాటు, రంగుల్లోని తేడా మరింత బాగా కనిపిస్తుంది.
పాలిష్ వేసుకున్న గోళ్లను ఐస్‌క్యూబ్స్ కరిగించిన చల్లని నీళ్లలో ముంచేయండి.. వేసుకున్న రంగు చిటికెలో ఆరిపోతుంది. నెయిల్ ఆర్ట్ వేసుకునేముందు క్యూటికల్స్‌మీద నూనె రాయండి. పెయింట్ పక్కకు ఒలికినా తేలికగా తుడిచేయవచ్చు. నెయిల్ కలర్ కొట్టొచ్చినట్లు కనిపించాలంటే తెల్ల నెయిల్ పాలిష్ బేస్ కోట్‌గా వేయాలి. మెరుపుల నెయిల్ పాలిష్ వదిలించుకోవడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. ఆ పని చిటికెలో అయిపోవాలంటే ఫెల్ట్ క్లాత్‌తో మెరుపులపై రుద్దాలి.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి