S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రా లకు నష్టమా?

నవంబర్ 8వ తేదీ రాత్రి భారత ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనల ఉప్పెన సునామిగా మారింది. నగదు మార్పిడి ఒక పెద్ద సమస్యగా , బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలతో అంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్న నగదు మార్చుకోవాలన్నా, బ్యాంకుల్లో ఉన్న నగదు ఉపసంహరించుకోవాలన్నా చాంతాడంత క్యూలలో జనం నిల్చుని సిగపట్లు పడుతున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు ఎదురుకాకముందే నష్టనివారణ చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణ, కేరళ, పశ్చిమబంగా రాష్ట్రాలు నోట్ల రద్దుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పుడే ఏం చెప్పలేం

నోట్ల రద్దుతో ఏ రంగంపై ఎలాంటి ప్రభావం పడబోతుందో, ఏ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పటికి ఇప్పుడే చెప్పలేం. ఏ ఆర్థిక వేత్త కూడా వంద శాతం ఇలానే జరుగుతుంది అని చెప్పలేరు. ఏ మంచి పని చేయాలన్నా వంద శాతం మంచే జరుగుతుంది అని చెప్పలేం. ప్రభావం ఏ విధంగానైనా ఉండవచ్చు. దొంగ సొమ్ము, నల్ల ధనం దేశానికి, సమాజానికి మంచిది కాదు. దేశంలో నల్లధనం బాగా పేరుకు పోయింది, దాన్ని తొలగించాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. నల్లధనం నిర్మూలించేందుకు పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల దొంగ కరెన్సీని నిర్వీర్యం చేయగలిగారు. దీని తక్షణ ప్రభావం కనిపిస్తోంది. కాశ్మీర్‌లో ఇంత కాలం జరిగిన దాడుల సంఘటనలు హఠాత్తుగా నిలిచిపోయాయి.

-త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి

ప్రజల్లో అవగాహన కల్పించాలి

వెయ్య, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికార పార్టీకి చెందినవారు ఈ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కేంద్ర నిర్ణయంపై పూర్తి అవగాహన కల్పించాలి. ఐటి శాఖ దాడిచేస్తుందనో, పేదలు, మధ్యతరగతి ప్రజల వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వం లాగివేసుకుంటుందనో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులు తమ పంటలపై వచ్చిన ఆదాయంపై, భూములు విక్రయించగా వచ్చిన ఆదాయంపై ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రైతుల ఆదాయం 2.50 లక్షలకు పరిమితం ఏమీ కాదు.

- కె. నర్సింహమూర్తి ఆర్థిక నిపుణులు

ఎన్డీఏ అడ్రస్ ఇక గల్లంతే

పెద్ద నోట్ల రద్దు పేరిట పేద, మధ్య తరగతి ప్రజలను మానసికంగా, శారీరకంగా హింసించారు. దీని పర్యావసానం వచ్చే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అనుభవించక తప్పదు. అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేద ప్రజల అకౌంట్లలో లక్షల రూపాయలు వేస్తామని ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ గొప్పగా ప్రకటించారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీనికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటు రూపేణా శిక్ష విధిస్తారు. పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లధనం ఎలా అరికడతారో ఎవరికీ అర్థం కావడం లేదు. పోనీ అదే నిజం అనుకున్నా, రెండు వేల రూపాయల నోటును చలామణికి తీసుకువచ్చారు.

- సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ

అనాలోచిత చర్య

ముందు చూపు లేకుండా, సంస్కరణలు తేకుండా పెద్ద నోట్లను రద్దు చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో మట్టికరిపిస్తారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక అంతిమకాలం దాపురించింది. అధికార గర్వంతో దేశంలోని ప్రజలను ఇబ్బందుల పాలు చేశారు. నల్లధనాన్ని అరికట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ పెద్దనోట్ల రద్దుకు ముందు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? ఎందుకు ఈ పరిస్థితి నెలకొన్నది?

- మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపి, అధికార ప్రతినిధి, ఎఐసిసి

గ్రామీణ జీవితం అస్తవ్యస్తం

నల్లధనం నిర్మూలనకు, జమలేని సొమ్మును నిరోధించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ జీవితం అస్తవ్యవస్తమైంది. కొత్తలో పెద్దనోట్ల రద్దును ఆహ్వానించిన వర్గాలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశంలో 75 శాతం మంది వ్యవసాయం మీధ ఆధరాపడి జీవిస్తుంటారు. వీరిలో చాలా మందికి అకౌంట్లు లేవు. ఒకవేళ ఉన్నా, వాటిల్లో కష్టార్జితం ఉంటుంది. చిన్న, మధ్య రైతులు, రైతు కూలీలు, కులవృత్తులు, చిన్న వ్యాపారులు, చిన్న బ్రోకర్లు, చేబదులు ఇచ్చే చిన్న వర్గాలు కేంద్రం నిర్ణయంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామాలు కళతప్పాయి. హైదరాబాద్‌లో ఎటిఎంలు పనిచేస్తే సరిపోతుందా?

- విశే్వశ్వరరెడ్డి, వైకాపా శాసనసభాపక్ష ఉపనేత

బడా బాబులకు సిరా చుక్కలు లేవా?

పాత నోట్లను మార్చుకోవడానికి వెళ్లిన సామాన్య ప్రజలపై బ్యాంకులు సిరా చుక్కలు పెట్టినట్టుగా బడా బాబులకు ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్నకు కేంద్ర జవాబు చెప్పాలి. నోట్ల రద్దుకు నల్లధనాన్ని అరికట్టడమే కారణం అయితే సామాన్య ప్రజలను మాత్రమే కేంద్రం దొంగలుగా ఎందుకు చూస్తోందో సమాధానం చెప్పాలి. ప్రజలు తమ కష్టారితాన్ని కూడా సొంత అవసరాలకు వాడుకునే అవకాశం లేకుండా నియంత్రించడం పౌరుని ప్రాథమిక హక్కును హరించడమే అవుతుంది. రద్దు చేసిన నోట్లను మార్పిడి చేసుకోవడానికి వెళ్లిన ప్రజలకు బ్యాంకులు సిరా చుక్క పెట్టినప్పడు బడా బాబులు ఎంత మంది సిరా చుక్కలు పెట్టించుకున్నారో ఒక్కరైనా కనిపించలేదా?

- డాక్టర్ చెరుకు సుధాకర్, కన్వీనర్ తెలంగాణ ఉద్యమ వేదిక సామాజిక విశే్లషకులు

సమర్థనీయమే కానీ..

పెద్దనోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. కానీ ముందస్తు చర్యలేమీ తీసుకోకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేయడం, నకిలీ కరెన్సీని అరికట్టగలగడమే. పెద్దనోట్ల రద్దుకు ముందే ప్రత్యామ్నాయంగా ఎటిఎం, బ్యాంకుల్లో సరిపడు కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకొని పాత కరెన్సీ రద్దు ప్రకటన చేస్తే బాగుండేది. బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రధాని తీసుకున్న నిర్ణయంతో నల్లధనం బయటకు వస్తుందే తప్పా.. అవినీతి తగ్గదు. 20 లక్షల కోట్ల భారత కరెన్సీలో 400 కోట్ల నల్లధనం ఒక లెక్క కాదు.

-పాండురంగారావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, లోక్‌సత్తా

వ్యాపారులకు కష్టం.. సర్కారుకు నష్టం

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందికి గురికాకుండా చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలకోసం పనిచేయాల్సినవే. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ, ఈ నిర్ణయం వెలువడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. దేశంలోని అన్ని బ్యాంకుల్లో కొత్త కరెన్సీ, చిల్లర డబ్బును అవసరమైన మేరకు అందుబాటులో ఉంచడానికి బృహత్తర ప్రణాళికను రూపొందించుకుని అమలు చేస్తే ఎవరికీ ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు ఎదురవుతున్న ఇక్కట్లు ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని కుదేలు చేస్తోంది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం.

- ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ కిరాణ వర్తకుల సంఘం

అరబిక్ పాటతో గల్ఫ్

చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా గల్ఫ్ వలసల నేపథ్యంలో పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై ఎక్కలి రవీంద్రబాబు, ఎం.రమణికుమారి నిర్మిస్తున్న చిత్రం ‘గల్ఫ్’. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలియజేస్తూ- ‘ఇలాంటి నేపథ్యంలో తెలుగులో సినిమా రాలేదు. అనేక గల్ఫ్ వలసల జీవితాల యధార్థ గాథలను పరిశీలించి, పరిశోధించి ఈ స్క్రిప్ట్‌ను తయారుచేశాం. ఫిలింసిటీ, హైదరాబాద్ పరిసరాలు, గల్ఫ్ దేశంలో చిత్రీకరణ జరిపాం. తెలుగులో తొలిసారిగా అరబిక్ సాంగ్‌ను ఉపయోగించాం.

Pages