S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు

సంగారెడ్డి టౌన్, మే 30: తెలంగాణ రాష్ట్రం సాధించి జూన్ 2 నాటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుండగా, రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్న కార్మికులు కనీస వేతనాల జీవోలను ఇప్పటి వరకు సవరించకుండా ప్రభుత్వం వివక్షకు గురి చేస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు సోమవారం ఎజెసి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 52 రంగాల కనీస వేతనాల జీవోల కాలపరిమితి ముగిసి అనేక సంవత్సరాలు గడుస్తున్నాయన్నారు.

హమాలీల ధర్నా

నల్లగొండ టౌన్, మే 30: తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతు సివిల్ సఫ్లయ్ హమాలీ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి మాట్లాడుతు గత ఆరు రోజులుగా హమాలీలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీలకు కూలి పెంచాలని, ప్రమాద బీమా, ఈఎస్‌ఐ వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా పిదప డిఆర్‌వో రవినాయక్‌కు డిమాండ్ల వినతి పత్రం అందించారు.

108 కలశాలతో అభిషేకం

మిర్యాలగూడ, మే 30: పట్టణంలోని అతి ప్రాచీన కాలం నుండి కొలువై ఉన్న శ్రీ్భక్తాంజనేయస్వామి దేవాలయంలో వైశాఖ బహుళపంచమి శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకోని ఈనెల 31వరకు ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం నాడు శ్రీ ఆంజనేయస్వామికి 108కలశములతో అభిషేకాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ జయంతి ఉత్సవాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. కాగా ఈనెల 31న మంగళవారం ఉదయం 6గంటలకు ఆలయంలో లక్ష నాగవళ్లదళార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

యాదాద్రిలో 3వరోజుకు చేరిన వరుణయాగం

యాదగిరిగుట్ట,మే 30:వర్షాలు సమృద్దిగా కురువాలని కోరుతూ యాదాద్రిలో చేపట్టిన వరుణ యాగం సోమవారం నాటికి మూడవరోజుకి చేరుకుంది. ఈ సందర్బంగా వర్షపాశుపత రుద్రాభిషేకములు,జప,పారాయణములు,విరాటపర్వ పారాయణములు, స్థాపిత దేవతాపూజలు,తత్త ద్దేవతాహవనములు, శ్రీరుద్రక్రమార్చన, శ్రీరుద్రస్వాహాకారములు, అర్చనలు,మహానివేదనలు, నీరాజన మంత్రపుష్పము కార్యక్రమాలు నిర్వహించారు.

ఆవిర్భావ దినోత్సవానికి సాగర్‌లో ఏర్పాట్లు

నాగార్జునసాగర్, మే 30: జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లకై సాగర్‌లోని కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. గత 3రోజుల నుండే తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ విజయవిహార్ అతిధిగృహాన్ని, ఎంట్రన్స్‌ను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. దీంతోపాటు సాగర్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్ని రంగులతో అలంకరిస్తున్నారు. ఈసందర్భంగా టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గం మొత్తంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఎవరు ముందు...!

నల్లగొండ, మే 30: సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావులు టిఆర్‌ఎస్‌లో చేరుతారాన్న ప్రచారం ప్రస్తుతం నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. వీరిలో వెంకట్‌రెడ్డి జూన్ 6న టిఆర్‌ఎస్‌లో చేరుతారంటు బలమైన ప్రచారం సాగుతుండగా ఆయన కంటే ముందుగానే గుత్తా, భాస్కర్‌రావులు టిఆర్‌ఎస్‌లో చేరుతారంటు మరో ప్రచారం సాగుతుంది.

10న సూర్యాపేటలో బిజెపి బహిరంగసభ

నల్లగొండ, మే 30: తెలంగాణలో 2019ఎన్నికల నాటికి బిజెపి బలోపేతం దిశగా ఆ పార్టీ అధినాయకత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా జూన్ 10న సూర్యాపేటలో బిజెపి బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ బహిరంగ సభకు హాజరుకానుండటంతో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జిల్లా కమల దళం అవసరమైన సన్నాహాలు సాగిస్తుంది. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయాలు, చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మే 26నుండి జూన్ 15వరకు ఆ పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘అభివృద్ధి పథంలో భారత్’ కార్యక్రమం నిర్వహిస్తుంది.

బాబుకు కోవర్టుగా పనిచేస్తున్న కెసిఆర్

కోదాడ, మే 30: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కోవర్టుగా పనిచేస్తున్నారని ఎమ్మార్పీయస్ వ్యవస్ధాపక అద్యక్షులు మంద కృష్ణ ద్వజమెత్తారు. విజయవాడ ప్రెస్‌మీట్‌కు వెళుతున్న తనను ఎపి పోలీసులు మార్గమధ్యం ఇంబ్రహీంపట్నం దగ్గర అడ్డుకొని ఎపి సరిహద్దులో వున్న కోదాడ శివారులో వదిలివెళ్లారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం కోదాడలో మంద కృష్ణ విలేఖరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ కంచుకోట నల్లగొండ

యాదగిరిగిగుట్ట రూరల్, మే 30: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ప్రజల బాధలకు చలించి యూపిఏ ప్రభుత్వంలోని పార్టీలను ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తన పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిందని ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న కెసిఆర్ అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినట్లుగా ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు.

కృష్ణా నదిలో మునిగి వ్యక్తి మృతి

పెద్దఅడిశర్లపల్లి, మే 30: మండలంలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలో బాణాలకుంట వద్ధ కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి బంగిన్ ప్రకాశ్‌రావు(30) దుర్మరణం చెందాడు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా వెల్లండి మండలం జూపల్లి గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు. అతను ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఉంటున్నాడని అదివారం పెద్దవూర మండలంలోని పులిచెర్ల సమీపంలోగల బాస్మాన్‌బావి వద్ధ బంధువుల ఇంట్లో శుభకార్యంకు హాజరయ్యేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. విందు అనంతరం కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయాడు.

Pages