S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

తిప్పర్తి, మే 30: మండలంలోని మామిడాల గ్రామంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై నిర్మల(27)అనే మహిళ దుర్మరణం చెందింది. నిర్మల ఇంటి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా ఇంటికి ఎర్తింగ్ కావడంవల్ల మెట్లు ఎక్కుతున్న నిర్మలకు మెట్ల సీకుల ద్వారా విద్యుత్ షాక్ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్‌తో ఎర్త్ అవుతుందన్న సమస్యను అధికారులకు విన్నవించినప్పటికి పట్టించుకోలేదని చివరకు నిర్మల ప్రాణాలు పోయాయంటూ ఆగ్రహించిన గ్రామస్తులు సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.

వైస్ ఎంపిపి తీరుపై సర్పంచ్‌ల ఆగ్రహం

కల్వకుర్తి, మే 30: కల్వకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపిపి గిరి పర్వతాలు తీరుపై వివిధ గ్రామాల సర్పంచ్ లు సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు జిల్లెల రాములు ఆధ్వర్యంలో అగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి రామేశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించారు, దీంతో సర్పంచ్‌లు, వైస్ ఎంపిపిల మద్య సమావేశం రసాభసాగా మారింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు.

రామన్‌పాడు బ్యాక్‌వాటర్‌లో పడి యువకుడు మృతి

కొత్తకోట, మే 30: మండల పరిదిలోని రామన్‌పాడు బ్యాక్‌వాటర్‌లో పడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రామన్‌పాడు గ్రామానికి చెందిన బోయ కురుమన్న (28) అనే యువకుడు రామన్‌పాడు డ్యాంలోని బ్యాక్ వాటర్ వద్ద గొర్రెలను మేపుటకు తీసువెళ్లగా అక్కడ ఉన్న పశువుల కాపరి తన పశువులను అవతలి వైపు దాటించాలని సాయం అడుగుగా కురుమన్న పవులను దాటించే ప్రయత్నంలో పక్కనే వున్న పెద్ద గుంతలో పడి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతునికి భర్య మహేశ్వరి, కుమారుడు, కుతూరు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఎంపిపి గుంత వౌనిక, ఎంపిటిసి కృష్ణయ్య, సర్పంచ్ నారయణ రెడ్డిలు పరమర్శించారు.

ఫ్రభుత్వ బడి పేద విద్యార్థుల గుడి

కల్వకుర్తి, మే 30: పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలని,అంకిత బావంతో పని చేస్తే విద్య అందరికి సమానమని, ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించాలని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని అక్షరవనంలో నిర్వహిస్తున్న లీటిల్ లీడర్స్, లీటిల్ టీచర్, సమ్మర్ క్యాంప్‌లను బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు,బిజెపి శాసనసభ ప్లోర్ లీగర్ కిషన్‌రెడ్డి సందర్శించారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములు కండి

మహబూబ్‌నగర్, మే 30: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో అందరు బాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని రాష్ట్రం ఏర్పడ్డక ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆమలు చేస్తున్నామని 21 మంది ఆమరవీరుల కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించడం జరుగుతుందని జాతీయ పతకావిష్కరణ, సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

అధికారులు ఇవాళ ఉంటారు.. రేపు వెళ్లిపోతారు..

మహబూబ్‌నగర్, మే 30: అధికారులు ఇవాళ్ల ఉంటారు...రేపు వెళ్లిపోతారు. ఇక్కడ ఉండేది మనమే అన్న సంగతి మర్చిపోవద్దని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబందించి జడ్పిటిసిలు, ఎంపిపిలకు జడ్పి సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు హజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర అవతరణ దినోత్సవానికి గురించి చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.

పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలి: ఎస్పీ

ఇటిక్యాల, మే 30: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్‌పి రేమా రాజేశ్వరి అన్నారు. సోమవారం మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో పుష్కరఘాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే కృష్ణాపుష్కరాలను పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా రోడ్లను, ఘాట్ల గురించి డిఎస్‌పి బాలకోటిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సూచనలిచ్చిందని అన్నారు.

టిడిపి, కాంగ్రెస్ నేతలే కారణం

మహబూబ్‌నగర్, మే 30: జిల్లా వెనుకబాటుతనానికి కాంగ్రెస్, టిడిపి నాయకులే కారకులని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించకుండా కేవలం రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి పబ్బం గడుపుకుని జిల్లా ప్రజలను సర్వనాశనం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ చైర్మన్ గెస్ట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు కాంగ్రెస్, టిడిపి నేతలపై విరుచుకుపడ్డారు.

మళ్ళీ రేగిన శ్మశాన వివాదం

నాగాయలంక, మే 30: నాగాయలంకలోగల శ్మశాన స్థల విషయంలో సరిహద్దులో గల రేమాలవారిపాలెం గ్రామస్థులు కొనసాగిస్తున్న ఆందోళన కార్యక్రమం మళ్ళీ మొదలవటంతో అధికారుల జోక్యం అనివార్యమైంది. గతంలో ఈ విషయమై బందరు ఆర్డీవో పి సాయిబాబు శ్మశాన స్థలాన్ని సందర్శించి ఇటు పంచాయతీ అధికారులను, అటు రేమాలవారిపాలెం గ్రామస్థుల మధ్య చర్చలు జరిపి నాగాయలంక పంచాయతీ పరిధిలోని ఎకరం 64 సెంట్ల శ్మశాన స్థలం ఇదే పంచాయతీకి చెందుతుందని స్పష్టం చేశారు.

చైనా బృందంతో పర్యవేక్షణలో మంచినీటి అవసరాలకు ప్రణాళికలు

మచిలీపట్నం, మే 30: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) పరిధిలో భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని మంచినీటి అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించేందుకు చైనా బృందం ముందుకు వచ్చింది. త్వరలో బందరు పోర్టు నిర్మాణంతో పాటు ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుండటంతో జనాభా కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. రానున్న కాలంలో సుమారు 20 నుండి 20 లక్షల వరకు జనాభా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని మంచినీటి అవసరాలు తీర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చైనా బృందాన్ని ఆహ్వానించింది.

Pages