S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమ్మె విరమించిన పెట్రో ట్యాంకర్ల యజమానులు

హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారులు, పెట్రో ట్యాంకర్ల యజమానుల చర్చలు సోమవారం మధ్యాహ్నం సఫలమయ్యాయి. సమ్మెకు సంబంధించి ఆయిల్‌ ట్యాంకర్ల అధికారులు, పెట్రో ట్యాంకర్ల యజమానులతో చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్లు పెట్రో ట్యాంకర్ల యజమానులు చెప్పారు. అయితే ఆది తాత్కాలికం మాత్రమేనని, రేపు ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపి ప్రకటిస్తామని తెలిపారు.

ప్రత్యూష ప్రియుడికి సుప్రీంలో ఊరట

దిల్లీ: ‘బాలికావధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్‌రాజ్‌సింగ్‌ను ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తన కుమార్తె మరణానికి కారకుడైన రాహల్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వరాదంటూ ప్రత్యూష తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. రాహుల్ గతంలోనే బాంబే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.

రాజ్యసభ ఎన్నికలకు రేపుతెరాస నామినేషన్లు

హైదరాబాద్: రాజ్యసభకు తెలంగాణ నుంచి జరిగే ఎన్నికలకు తెరాస అభ్యర్థులుగా ఎంపికైన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంగళవారం నామినేషన్లు వేస్తారు. మంచి అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారని మంత్రి నాయిని అన్నారు. తమ అభ్యర్థులిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛన ప్రాయమని మరో మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఆవిర్భావ దినోత్సవానికి భారీ సన్నాహాలు

హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో అద్భుతరీతిలో నిర్వహించాలని మంత్రి నాయిని నరసింహారెడ్డి తెరాస కార్యకర్తలను ఆదేశించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు ముఖ్యనేతలతో ఆయన సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. నగరాన్ని విద్యుత్ కాంతులతో నింపాలని, స్వాగత ద్వారాలు, పార్టీ జెండాలతో అంతా గులాబీమయం కావాలని ఆయన అన్నారు. ఆ రోజున తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబాలను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడతామని నాయిని తెలిపారు.

యాగంటి ఈఓపై ఉద్యోగి హత్యాయత్నం

కర్నూలు: యాగంటి ఆలయ ఈఓ ఆదిశేషునాయుడిపై సోమవారం మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి అనే గుమస్తా హత్యాయత్నం చేశాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నందుకు రామకృష్ణారెడ్డికి జీతం నిలిపివేశారు. తనపై ఈఓ కక్ష గట్టారన్న ఆగ్రహంతో ఈఓపై రామకృష్ణారెడ్డి పెట్రోలు పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా మిగతా ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు గండం గడిచింది. పరారైన రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తల్లి, భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

నల్గొండ: డబ్బు కోసం వ్యభిచారం చేయాలంటూ సొంత తల్లి, భర్త వేధించడంతో బిటెక్ చదువుతున్న ఝాన్సీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నకిరేకల్ మండలం నోములలో ఈ ఘోరం జరిగింది. నాలుగు లక్షల రూపాయల బాకీ తీర్చలేనందుకు విజేందర్ రెడ్డి అనే వ్యక్తితో ఝాన్సీకి ఆమె తల్లి పెళ్లి చేసింది. వ్యభిచారం చేయమని తల్లి, భర్త వేధించడంతో తనకు విజేందర్ రెడ్డి నుంచి విడాకులు కావాలని ఝూన్సీ అడిగింది. 20 లక్షలు ఇచ్చి తనతో తెగతెంపులు చేసుకోవాలని లేదంటే వ్యభిచార గృహంలో విక్రయిస్తానని భర్త బెదిరించడంతో ఝూన్సీ ఆత్మహత్యకు పాల్పడింది.

కాంగ్రెస్‌ను వీడేది లేదు: కోమటిరెడ్డి

హైదరాబాద్: కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారని తెరాస తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విమర్శించారు. తాము కాంగ్రెస్‌ను వీడే పరిస్థితి రాదని ఆయన సోమవారం స్పష్టం చేశారు.

వైకాపా ఎమ్మెల్యేలతో బాబు మంతనాలు

విజయవాడ: ఎపి నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలిపే విషయమై టిడిపిలో చేరిన 17 మంది వైకాపా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఇక్కడ మంతనాలు జరుపుతున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో తనకున్న సంఖ్యాబలం మేరకు మూడు రాజ్యసభ స్థానాలను టిడిపి కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. మరో స్థానాన్ని వైకాపా గెలుచుకునే వీలుంది. అయితే, వైకాపాను వీడిన 17 మందితో పాటు ఆ పార్టీ నుంచి మరికొందరు సహాయ పడితే నాలుగోసీటును సైతం గెలుచుకోవచ్చుననే దిశగా టిడిపి నేతలు ఆలోచిస్తున్నారు.

రాజ్యసభకు ప్రముఖుల నామినేషన్లు

దిల్లీ: వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బిహార్‌లో సోమవారం నాడు ఆర్‌జెడి తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, జెడియు నుంచి శరద్ యాదవ్, ఆర్‌జెడి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి నామినేషన్లు వేశారు. పంజాబ్ నుంచి కాంగ్రెస్ నాయకురాలు అంబికాసోనీ నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగే రెండు సీట్లకు అధికార తెరాస పార్టీ ఇప్పటికే డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను ఎంపిక చేసింది. సంఖ్యాబలం లేనందున రాజ్యసభ ఎన్నికలకు తాము దూరంగా ఉంటున్నామని టి.కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

గవర్నర్‌తో నారాయణస్వామి భేటీ

పుదుచ్చేరి: కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా ఎన్నికైన నారాయణ స్వామి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమేనని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని సోమవారం కలిసిన సందర్భంగా తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, డిఎంకె కూటమి మెజారిటీ సీట్లను సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారాయణస్వామి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఇదివరకే ఖరారు చేసింది. సిఎల్‌పి తీర్మానాన్ని, ఎమ్మెల్యేల జాబితాను ఆయన కిరణ్ బేడీకి అందజేశారు. మంత్రివర్గం ఏర్పాటుక ఇక గవర్నర్ నుంచి నారాయణస్వామికి పిలుపురావడం లాంఛనమే.

Pages