S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

05/17/2016 - 06:51

పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను హిందువులపై భయంకరమైన దాడులు జరుగుతుండడం ఆశ్చర్యకరం కాదు. ఈ రెండు దేశాలలోని అవశేష హిందువులను నిశే్శషంగా నిర్మూలించడం జిహాదీల లక్ష్యం. బంగ్లాదేశ్‌లో శనివారం ఒక వృద్ధ బౌద్ధ సన్యాసిని జిహాదీలు హత్య చేయడం ఆగని హిందూ వ్యతిరేక బీభత్సకాండకు మరో నిదర్శనం.

05/16/2016 - 05:16

ఎన్నికల సమయంలో ‘వోటుకింత’ అని ముట్టచెప్పడం దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులందరూ పాటిస్తున్న ‘ప్రజాస్వామ్య’ సంప్రదాయం. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసన సభలను ఎన్నుకొనడానికి జరిగిన జరుగుతున్న ప్రచార ప్రహసనంలోకూడ ఈ ‘సంప్రదాయాన్ని’ అధికాధిక అభ్యర్థులు చిత్తశుద్ధితో నిలబెట్టినట్టు వినికిడి. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిపోయింది.

05/14/2016 - 00:23

సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరో ఆరుమంది నిందితులు నిర్దోషులని జాతీయ నేరపరిశోధక మండలి-నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ-నిర్ధారించడం న్యాయానికి లభించిన ఊరట. ఈ ఊరట ఎనిమిదేళ్ల తర్వాత లభించడం ఘోరమైన విలంబనానికి నిదర్శనం. 2008లో మహారాష్టల్రోని మాలేగావ్ ప్రాంతంలో జరిగిన బీభత్సఘటనలో సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ను ఇరికించినట్టు నేషనల్ ఇనె్వస్టిగేటింగ్ ఏజెన్సీ-ఎన్‌ఐఎ- వారు శుక్రవారం చేసిన నిర్ధారణ వల్ల ధ్రువపడింది.

05/12/2016 - 23:39

ఒక రాష్ట్రంలో విధించిన రాష్టప్రతి పాలనను కేవలం రెండు గంటల పాటు తొలగించడం విచిత్రమైన రాజ్యాంగ పరిణామం. మే 10న ఉత్తరఖండ్‌లో ఇలా తొలగించడం సర్వోన్నత న్యాయస్థానం మేనెల ఆరవ తేదీన ఇచ్చిన తీర్పు ఫలితం విచిత్రంకావచ్చు గాక, వినూతన ప్రజాస్వామ్యపు సంప్రదాయాలు అంకురిస్తుండడం నిరంతర రాజ్యాంగపు పరిణామ ప్రగతికి చిహ్నం.

05/12/2016 - 08:15

నల్లడబ్బును నిరోధించడానికి వీలుగా మారిషస్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం పన్ను ఎగవేతదారుల పాలిట మరో అంకుశం. మనదేశంలో ఈ ఒప్పందం కుదుర్చుకొనడానికి అనేక ఏళ్లపాటు తటపటాయించిన మారిషస్ చివరికి అంగీకరించడం మన ప్రభుత్వం సాధించిన దౌత్యవిజయం. రెండుసార్లు పన్ను చెల్లించడాన్ని నిరోధించడానికి వీలైన ఒప్పందాలను మన ప్రభుత్వం అనేక దేశాలతో కుదుర్చుకొని ఉంది.

05/11/2016 - 02:46

ఎన్ని మలుపులు..ఇంకెన్ని మెరుపులో..!దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ వ్యవహారం సృష్టించినంత రాజకీయ, రాజ్యాంగ ఉత్కంఠను ఏ రాష్ట్రం సృష్టించలేదనడం అతిశయోక్తి కాదు.

05/09/2016 - 23:43

ప్రవాస భారతీయులపై, భారతీయ సంతతి ప్రజలపై వివిధ దేశాలలో భయంకరమైన దాడులు జరుగుతుండడం నడుస్తున్న వైపరీత్యం. ఇస్లాం ఏకమత రాజ్య వ్యవస్థలున్న దేశాలలో అన్యమతాల నిర్మూలనలో భాగంగా భారతీయులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు, హత్య చేస్తున్నారు.

05/09/2016 - 07:20

నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ ఓలీ మన దేశానికి వ్యతిరేకంగా మరోసారి అబద్ధపు ఆరోపణలు సంధించడం ఆశ్చర్యకరం కాదు. గత అక్టోబర్‌లో నేపాల్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నాటినుంచి ఈ నేపాల్ సమీకృత మార్క్సిస్టు లెనినిస్ట్ కమ్యూనిస్ట్‌పార్టీ-సిపిఎన్‌యుఎమ్‌ఎల్ మన దేశానికి వ్యతిరేకంగా మంటలు కక్కుతూనే ఉన్నాడు.

05/07/2016 - 06:26

ముంబయి హైకోర్టు శుక్రవారం చెప్పిన విచిత్రమైన తీర్పువల్ల గోసంతతికి ఏర్పడి ఉన్న ప్రమాదం యధాతథంగా కొనసాగనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గోవధ నిషేధపు చట్టం రాజ్యాంగ బద్ధమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని 48వ అధికరణ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది. ఆవులను, దూడలను పాడిపశువులను వధించడాన్ని నిరోధించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నది ఈ అధికరణం నిర్దేశిస్తున్న మార్గదర్శక సూత్రం.

05/06/2016 - 00:49

కేంద్ర ప్రభుత్వం వారు చెప్పిందే పదే పదే చెబుతున్నారు, అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలు విన్నదే వింటున్నారు. రెండేళ్లుగా జరిగిపోతున్న ప్రహసనం. అందువల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థికంగా ప్రత్యేకమైన హోదా లభించడం లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టీకరణ నిజానికి పునరుద్ఘాటన మాత్రమే!

Pages