S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

03/29/2016 - 23:52

ఇదీ మన సినిమా..ఇదీ మన సత్తా అని ప్రతి తెలుగువాడు తనివితీరా ఆస్వాదించాల్సిన తరుణమిది. ఆరున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమాకు ఎండమావిగా మారిన జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఆలస్యంగానైనా సరైన సినిమాకే దక్కింది. అదీ తెలుగు దర్శకత్వ ప్రతిభకు, తెలుగు ఆలోచనా పదునుకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిన బాహుబలికే స్వర్ణకమలం లభించడం మరింత ఆనందదాయకం.

03/29/2016 - 02:07

రాష్టప్రతి పాలన విధించడంవల్ల ఉత్తరఖండ్‌లో కొనసాగుతున్న అవకాశ వాద రాజకీయ కాండ పరిసమాప్తి కావడం లేదన్నది స్పష్టం! ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్టప్రతి పాలన విధించడానికి దోహదం చేసిన ప్రహసనం ఎవరిది న్యాయమన్నది కూడ జటిలమైన ప్రశ్న! న్యాయాన్యాయాలను నిర్ధారించడానికి సర్వోన్నత న్యాయస్థానం వారి ప్రమేయం అనివార్యమన్నది కూడ మరింత స్పష్టమైపోయింది.

03/28/2016 - 02:11

మన గూఢచారిని తమ దేశంలో పసికట్టి పట్టుకుని నిర్బంధించినట్టు శుక్రవారం పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించడం అసలు సమస్యనుండి దృష్టిని మళ్లించడంలో భాగం. పాకిస్తాన్ ప్రభుత్వం నిరంతరం మన దేశంలోకి జిహాదీ ఉగ్రవాద హంతకులను ఉసికొల్పుతుండడం అసలు సమస్య!

03/26/2016 - 00:32

భారతీయ జనతాపార్టీతో కలిసి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-పిడిపి-అధినేత ముఫ్తి మెహబూబా అంగీకరించడం గొప్ప చారిత్రక ఘటనగా అభివర్ణితమవుతోంది. వాస్తవానికి ఇది చారిత్రక పునరావృత్తి. గత ఏడాది మార్చిలో ఇదివరకే భాజపా, పిడిపిల కూటమి జమ్మూకశ్మీర్‌లో అధికార పీఠాన్ని అధిరోహించింది. మెహబూబా ముఫ్తి తండ్రి ముఫ్తి మహమ్మద్ సరుూద్ అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు.

03/25/2016 - 00:10

తాగడానికి మంచినీరు దొరకనివారి సంఖ్య ప్రపంచంలోకెల్లా మనదేశంలోనే అత్యధికంగా ఉందన్న నిర్ధారణ ప్రగతిని వెక్కిరిస్తున్న పరిణామం. దప్పికొన్న వానికి నెయ్యిని ఇచ్చి తాగమని చెప్పినట్టుగా మన ప్రగతి కొనసాగుతోందనడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. వౌలిక అవసరమైన మంచినీరు దొరకని వారు ఏడున్నరకోట్లమంది ఉన్న దేశంలో సర్వజన-అన్ ఇన్‌క్లూజివ్- భాగస్వామ్య ప్రగతి’ అనే మాటలు నీటి మూటలు మాత్రమే.

03/24/2016 - 07:25

ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్య-ఐఎస్‌ఐఎస్-జిహాదీ ముఠాకు చెందిన హంతకులు బ్రెస్సెల్స్‌లో మంగళవారం సాగించిన భయంకర బీభత్సకాండ అంతర్జాతీయ నిఘా వైఫల్యానికి మరో నిదర్శనం. బ్రెస్సెల్స్ నగరం బెల్జియం దేశానికి రాజధాని మాత్రమే కాదు, ఐరోపా సమాఖ్యకు కేంద్రస్థానం కూడ..అంతకుమించి అంతర్జాతీయ రక్షణ దళంగా వ్యవహరిస్తున్న ఉత్తర అట్లాంటిక్ సైనిక సమాఖ్య-నాటో-కు సైతం బ్రెస్సెల్స్ ప్రధాన స్థావరం.

03/23/2016 - 00:30

జమ్మూకశ్మీర్ రెండున్నర నెలలుగా పాలనా రాహిత్యస్థితి నెలకొని ఉండడం మరో ప్రత్యేకత. జమ్మూకశ్మీర్‌కు భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం ప్రకారం లభించిన ప్రత్యేక ప్రతిపత్తి స్థానిక రాజకీయ కుటుంబాల ప్రత్యేక ప్రతిపత్తిగా పరిణితి చెందడం దశాబ్దుల ప్రహసనం. షేక్ అబ్దుల్లా కుటుంబం ‘నేషనల్ కాన్ఫరెన్స్’పేరుతో కశ్మీర్‌ను నియంత్రించడానికి ప్రయత్నించడం ఈ చరిత్ర.

03/22/2016 - 00:34

ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కఠినమైన ఉత్తరువులు కథ మళ్లీ మొదటి వచ్చిందనడానికి నిదర్శనం, గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలవారు, తిరుమల తిరుపతి దేవస్థానాలవంటి ధార్మిక సంస్థలు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించాయి, నియంత్రించాయి! ఆయా ఉత్తరువులు ప్రభుత్వాలకే గుర్తులేకపోవడం కథ మొదటికి వచ్చిందనడానికి వర్తమాన సాక్ష్యం!

03/21/2016 - 00:41

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగింది..తపాలా కార్యాలయంలోను సార్వజనిక భవిష్య నిధి-పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-పిపిఎఫ్-లోను చిన్నమొత్తాలను దాచుకునే వారికి చెల్లిస్తున్న వడ్డీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కొండను తవ్వి ఎలుకను పట్టాలన్న మహదాకాంక్షకు అద్దం!

03/18/2016 - 23:40

రహదారుల ఆధునీకరణకు, విస్తృతీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్ పథకాలను ఆవిష్కరిస్తుండడానికి అతుకుల గతుకుల హడలెత్తిస్తున్న ప్రమాణాలు ప్రధాన నేపథ్యం. దేశమంతటా విస్తరించి ఉన్న క్షిప్రగమన పథాల-ఎక్స్‌ప్రెస్‌హైవేస్-మాత్రమే ఈ గతుకులకు మినహాయింపు. బహుదూరపు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే లక్ష్యంతో భారత జాతీయ రాజపథ నిర్వహణ అధికార మండలి వారు ఇప్పుడు మరో పథకాన్ని ఆవిష్కరించడం హర్షణీయం.

Pages