S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

06/07/2018 - 00:03

బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు వేరు పురుగుల వలె, చీడ పురుగుల వలె వ్యవసాయాన్ని భోంచేస్తుండడం ‘గావ్ బంద్’- గ్రామాల మూసివేత- ఆందోళనకు నేపథ్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరను పెంచాలని, రైతులు చెల్లించాల్సిన రుణాలను రద్దు చేయాలని, లీటరు పాలకు యాబయి రూపాయల చొప్పున పశుపోషకులకు చెల్లించాలని, చెరకు రైతులకు చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు బకాయిలను చెల్లించాలని ఈ ఆందోళనకారులు కోరుతున్నారు.

06/05/2018 - 23:59

రోహింగియా అక్రమ ప్రవేశకులు తమ ‘శిబిరాల’ పరిధి నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరం వ్రాయడం సముచితమైన పరిణామం. బర్మాలో తమపై దాడులు జరుగుతున్నాయన్న సాకుతో వేల సంఖ్యలో మన దేశంలోకి వచ్చిపడిన ‘రోహింగియా’లు మన అంతర్గత భద్రతను దెబ్బతీస్తుండడం కేంద్ర ప్రభుత్వం ఇలా ‘ఉత్తరం’ వ్రాయడానికి దారితీసిన విపరిణామం.

06/04/2018 - 23:40

ఉడుతలు ఉత్సాహంగా చెట్లెక్కి ఊగుతుండడం పర్యావరణం పదిలంగా ఉందన్నదానికి ఓ నిదర్శనం. పిచ్చుకల కిలకిల ధ్వనులు ప్రభాత సమయంలో వినిపించకపోవడం పొగచూరిపోతున్న ప్రకృతికి నిదర్శనం. ప్లాస్టిక్ కాలుష్యం విస్తరించిపోతున్న నగర జీవన స్వరూప స్వభావాలు ఇవీ! పండ్లు లేని, వాసనలేని పువ్వుల చెట్లు నగరాలలో వీధుల పక్కన మహాపథాల మధ్యలోని ‘హరిత ద్వీపాల’-గ్రీన్ ఐలాండ్స్-లోను పెరుగుతున్నాయి. ఆకుపచ్చదనం విస్తరించడం హర్షణీయం.

06/02/2018 - 02:13

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌనె్సలింగ్ సందడి ప్రారంభం కాగా, మరోవైపు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ‘సీట్ల జాతర’కు యథావిధిగా తెరలేచింది. ఎంసెట్ కన్వీనర్ కోటాలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకముందే ‘మేనేజ్‌మెంట్ కోటా’ పేరిట సీట్లను ప్రైవేటు కాలేజీలు అమ్మకానికి పెట్టాయన్న వార్తలు వ్యాపించాయి.

05/31/2018 - 23:58

ప్రభుత్వం వారు మళ్లీ ‘ఒక్క కొత్త పైస’ నాణెమును ముద్రించగలరన్నది జనానికి కలుగుతున్న భావం. ఇది ‘భ్రాంతి’ కావచ్చు. కానీ ప్రభుత్వరంగంలోని చమురు సంస్థలు బుధవారం ఇంధన తైలం ధరలను ఒక పైసా తగ్గించడం మాత్రం భ్రాంతి కాదు. వంద రూపాయల పెట్రోలు పోయించుకున్న ‘పాతకాలం మనుషులు’ కొందరు ఒకటిన్నర పైసలను వెనక్కి ఇమ్మని వ్యాపారులను అడుగుతున్నారట!

05/31/2018 - 01:50

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేసియాలో జరిపిన రెండు రోజుల పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య సహస్రాబ్దులుగా నెలకొని ఉన్న సాంస్కృతిక సమానత్వం మరోసారి ప్రబలంగా ప్రస్ఫుటించింది. బుధవారం సాయంకాలం ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరిగిన ‘్భరతీయ సంతతి’ మహాసభలో ప్రసంగించిన మోదీ ఈ సాంస్కృతిక సమానత్వాన్ని సమగ్రంగా సమీక్షించడం ఉభయ దేశాల సాన్నిహిత్యానికి అద్దం.. ఈ సాన్నిహిత్యం భౌగోళికమైనది.

05/29/2018 - 23:38

తమిళనాడులోని తూత్తుకుడిలో నెలకొని ఉండిన ‘స్టెరిలైట్’ రాగి లోహపు కర్మాగారం మూతపడడం ప్రతీక మాత్రమే. కాలుష్య వలయాలను సృష్టించి ఊపిరి ఆడకుండా నిరోధిస్తున్న కేంద్రీకృత పారిశ్రామిక పద్ధతికి వ్యతిరేకంగా దేశ ప్రజలు ఉద్యమిస్తుండడం వర్తమాన వాస్తవం. పరిశ్రమలను, ఆర్థిక ప్రగతిని వికేంద్రీకరించడం భారతీయ జీవన పద్ధతి. అనాదిగా ‘స్వయం సమృద్ధ గ్రామాలు’ భారత మహాప్రవాహపు జలబిందువులు!

05/29/2018 - 00:10

జమ్మూ కశ్మీర్ ఉత్తర ప్రాంతంలో విస్తరించి ఉన్న ‘గిల్గిత్ బాల్టీస్థాన్’ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం పట్ల మన ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలుపడం సహజం! జమ్మూ కశ్మీర్‌లోని కొంత భాగాన్నైనా శాశ్వతంగా తమ అక్రమ అధీనంలో ఉంచుకోవాలన్న పాకిస్తాన్ పన్నాగంలో తథాకథిత ‘గిల్గిత్ బాల్టీస్థాన్’ రాష్ట్రం భాగం.. 1947లో అఖండ భారత విభజన తరువాత ఏర్పడిన పాకిస్తాన్‌లో నాలుగు రాష్ట్రాలు-ప్రావెనె్సస్- ఉన్నాయి.

05/27/2018 - 00:11

క్షిణ సముద్రం వద్ద చైనా ఆయుధాలతో మోహరించింది. జపాన్‌ను ధ్వంసం చేయాలని చూస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్‌ఒసి) వద్ద నిరంతరం కాల్పులు జరుపుతోంది, జిహాదీ ఉగ్రవాద శిబిరాలను పోషిస్తోంది. ఇజ్రాయిల్ గాజాలో పాలస్తీనా పౌరులను హతమార్చింది. అమెరికా సిరియాపై మారణాయుధాలు ప్రయోగించింది. ఇక ఇండియా సంగతేమిటి? ఇక్కడ రాజకీయ నాయకులు తమ దేశపు ఆస్తులను తామే తగలబెట్టుకుంటారు.

05/25/2018 - 23:54

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్‌తో జూన్ 12వ తేదీన తాను జరుప తలపెట్టిన సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దుచేసుకొనడం ఆశ్చర్యకరం కాదు. ‘ప్రపంచీకరణ’ వల్ల తమ వాణిజ్య ప్రయోజనాలకు జరుగుతున్న విఘాతాన్ని సహించలేని అమెరికా అధ్యక్షుడు కల్లుతాగిన కోతి వలె చిందులు తొక్కుతుండడం ఏడాదికి పైగా నడుస్తున్న అంతర్జాతీయ ప్రదర్శన.

Pages