S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

02/07/2018 - 05:38

ఆఫ్రికా ఖండపు పశ్చిమతీరంలో అపహరణకు గురైన ఇరవై ఇద్దరు భారతీయులకు ఐదురోజుల తరువాత విముక్తి లభించడం ఆనందకరం, ఆశ్చర్యకరం! ఎందుకంటే సముద్ర జలాలలో అపహరణకు గురవుతున్న భారతీయులు, ఇతర దేశాల వారు వారాల తరబడి, నెలల తరబడి బందీలుగా ఉండడం దశాబ్దాలుగా నడుస్తున్న చరిత్ర! ఆధునిక సాంకేతిక సమాచారం విస్తరిస్తున్న కొద్దీ, ఈ సమాచార విజ్ఞాన వ్యవస్థ నాగరిక వ్యవస్థలకు మాత్రమేకాక నేరస్థులకు కూడా వినియోగపడుతోంది.

02/06/2018 - 00:32

మాల్‌దీవుల్లో చెలరేగుతున్న రాజ్యాంగ సంక్షోభం హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా అమలు జరుపుతున్న విస్తరణ వ్యూహంలో భాగం.. మాల్‌దీవుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు, మత వ్ఢ్యౌ నియంతృత్వానికి మధ్య కొనే్నళ్లుగా జరుగుతున్న సంఘర్షణ మరోసారి పరాకాష్ఠకు చేరుకుంది. మాల్‌దీవుల్లో చైనా ప్రభావం పెరుగుతుండడం ఈ సంఘర్షణకు సమాంతరంగా కొనసాగుతున్న విపరిణామ క్రమం!

02/03/2018 - 00:15

అవినీతి చరిత్ర ఇలా పునరావృత్తం అవుతుండడం న్యాయవ్యవస్థకు మాత్రమే కాదు, రాజ్యాంగ వ్యవస్థకూ అప్రతిష్ఠ తెస్తున్న కళంకం.. అవినీతి ఆరోపణలకు గురైన అలహాబాద్ ఉన్నత న్యాయమూర్తి నారాయణ శుక్లా తన పదవికి రాజీనామా చేయకపోవడం ఈ పునరావృత్తి.. గతంలో కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.డి. దినకరన్ పాల్పడిన అక్రమ ప్రక్రియకు నారాయణ శుక్లా పాల్పడుతుండడం ఈ పునరావృత్తి!

02/01/2018 - 23:55

వ్యవసాయం, ఆరోగ్యం, అనుసంధానం, సంక్షేమం- ఇవన్నీ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభకు సమర్పించిన ఆదాయ, వ్యయ ప్రణాళిక-బడ్జెట్-లో ధ్వనించిన ప్రధాన అంశాలు. 2020 నాటికి ‘వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు కావడం లక్ష్యం’గా ప్రభుత్వం అమలు జరుపుతున్న బృహత్ పథకాల వివరాలు 2018-2019 ఆర్థిక సంవత్సరంలో అమలుకానున్న బడ్జెట్‌లో పుష్కలంగా పొందుపరచినట్టు జైట్లీ వివరించారు.

01/31/2018 - 22:00

జమ్ముకశ్మీర్ ప్రభుత్వం విచిత్రమైన న్యాయ ప్రక్రియను ఆరంభించడం ద్వారా భారత జాతీయ రాజ్యాంగ వ్యవస్థను వెక్కిరించింది, కేంద్రప్రభుత్వ సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించింది. విధి నిర్వహణలో కాల్పులు జరిపిన సైనికులపై ‘నేరారోపణ పత్రం’ - ఎఫ్‌ఐఆర్ - దాఖలు చేయడం ఈ విచిత్రమైన న్యాయప్రక్రియ. ఈ ‘న్యాయప్రక్రియ’ను ఆరంభించడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తాను స్వయంగా నేరప్రక్రియకు పాల్పడినట్టయింది!

01/31/2018 - 00:22

నాగాలాండ్ శాసనసభకు ఫిబ్రవరి 27వ తేదీన జరుగుతున్న ఎన్నికలను బహిష్కరించనున్నట్టు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వంటి జాతీయ రాజకీయ పక్షాలు ప్రకటించడం విస్మయకరమైన విపరిణామం.. భారతీయ జనతా పార్టీ నాగాలాండ్ ప్రాంతీయ విభాగానికి చెందిన కొందరు తీసుకున్న ఈ ‘నిర్ణయానికి’’ కేంద్ర నాయకత్వం ఆమోదం కాని ప్రాంతీయ విభాగం అధ్యక్షుని ఆమోదం కాని లేదని ఆ తరువాత వెల్లడి కావడం మరో విచిత్రం..

01/30/2018 - 00:14

సూర్య సమారాధనను ప్రతి సంవత్సరం ఆధికారిక ఉత్సవంగా నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అద్భుతమైన పరిణామం. ప్రకృతి పరిరక్షణకు పర్యావరణ సమతుల్య స్థితికి దోహదకరం, అభినందనీయం. ఇతర ప్రాంతాల ప్రభుత్వాలకు అనుసరణీయం!

01/29/2018 - 01:12

విద్రోహకాండకు ఒకరు బలైపోయారు, దేశద్రోహుల దౌర్జన్యకాండలో మరికొందరు గాయపడ్డారు!! ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ పట్టణంలో శుక్రవారం జరిగిన త్రివర్ణ పతాక - తిరంగా - శోభాయాత్ర రక్తసిక్తం కావడం గణతంత్ర విజయగీతికలో వినిపించిన ఘోరమైన అపశ్రుతి..

01/27/2018 - 00:10

మనదేశానికీ ఆగ్నేయ ఆసియా ప్రాంత దేశాలకూ మధ్య కొనసాగుతున్న సహస్రాబ్దుల స్నేహ సంబంధాలకు సాంస్కృతిక సమానత్వానికి కొత్త్ఢిల్లీలో గురువారం జరిగిన ప్రభుత్వాధినేతల సమావేశం మరో చారిత్రక ప్రతీక! ‘ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య’ - అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఏషియన్ నేషన్స్ - ఆసియాన్ - ఏర్పడిన తరువాత యాబయి ఏళ్లు గడచిపోయాయి.

01/26/2018 - 01:51

మన దేశం శతాబ్దుల ‘దాస్యగ్రహణం’ నుంచి విముక్తమైన తరువాత రచించుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి అరవై ఎనిమిది ఏళ్లు అయింది.. అరవై తొమ్మిదవ ‘గణతంత్ర దినోత్సవం’ అందువల్ల స్మృతుల సమాహారం, సమీక్షా సమయం.. అరవై ఎనిమిది ఏళ్లు సుదీర్ఘ చరిత్ర కలిగిన మన జాతీయ జీవనం అత్యంత తక్కువ సమయం.

Pages