S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/08/2017 - 00:18

అక్రమంగా మనదేశంలోకి చొరబడిన చొరబడుతున్న ‘రోహింగ్యా’ ముస్లింలను భారతీయ పౌరులుగా నమోదు చేయిస్తున్న దేశ విద్రోహపు ముఠాలు వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్నాయట! దేశ ప్రజలను ఆందోళనకు గురిచేయగల ఈ ‘సమాచారం’ గురువారం దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జరిపిన సమీక్షకు నేపథ్యం!

12/06/2017 - 21:54

ఐమాకు ‘ఎగ్జామ్స్’... ఐ మాకు ‘ఎగ్జామ్స్’... అని ఇల్లంతా తిరిగి గంతులేస్తోంది నాలుగేళ్ల పాప! ఇంకా ఒకటవ తరగతికి కూడా రాని ఆ పాపకు ‘ఎగ్జామ్స్’ అంటే అవగాహన కూడా ఉన్నట్లు లేదు.. ఆ చిట్టిపాపకు తెలిసిందల్లా ఒక్కటే... ‘ఎగ్జామ్’ - ‘పరీక్షలు’ - అయిపోగానే ‘హాలీడేస్’ వస్తాయన్నది! హాలీడేస్ - సెలవులు - వస్తే స్కూల్‌కు - కానె్వంట్‌కు - వెళ్లనక్కర లేదు.

12/06/2017 - 00:54

అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ ఎంపిక కావడం సంస్ధాగత ప్రజాస్వామ్య వైఫల్యానికి మరో చారిత్రక నిదర్శనం, కుటుంబ వారసత్వ రాజకీయ ద్యూతక్రీడ మరింత విస్తరించిపోతోందనడానికి సరికొత్త ప్రమాణం! ఈ ‘క్రీడ’, ఈ వారసత్వ చరిత్ర మోతీలాల్ నెహ్రూతో మొదలైంది. కాంగ్రెస్ మహా సంస్థ, స్వాతంత్య్ర ఉద్యమ సంస్థ ఒక ప్రముఖ కుటుంబానికి ‘బందీ’ కావడానికి 1920వ దశకంలోనే ప్రాతిపదిక ఏర్పడింది!

12/04/2017 - 23:52

గోసంతతి పరిరక్షణకు దోహదం చేయగల ఉత్తరువును కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఉపసంహరించుకొనడం అంతుపట్టని వ్యవహారం. గత మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తరువును జారీ చేసినప్పుడు దేశ ప్రజలు సంతోషించారు! గోవధను సంపూర్ణంగా నిషేధిస్తూ పార్లమెంటు సమగ్రమైన చట్టం చేయగలదన్న విశ్వాసం బలపడింది.

12/04/2017 - 00:17

సర్వమత సమానత్వం గురించి మన దేశానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా పాఠాలు చెప్పడానికి యత్నించడం విచిత్రమైన పరిణామం. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్య రచించిన ఒక పాటలోని సారాంశం ఈ సందర్భంగా స్ఫురించడం సహజం. చీకటి ఉన్న చోట దీపం వెలిగించాలి కాని సూర్యుని వెలుగులు సభతీరి ఉన్నచోట కాగడా వెలిగించినందువల్ల ఫలమేమిటన్నది అన్నమయ్య గీతంలోని సారాంశం!

12/02/2017 - 00:32

జిల్లా స్థాయిలో ‘రహదారి భద్రత మండలి’ని ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం దశాబ్దులుగా కొనసాగుతున్న భద్రతావైఫల్యానికి నిదర్శనం! ఇంతవరకు ఇలాంటి ‘భద్రతామండలి’ అనేక రాష్ట్రాలలోను జిల్లాలలోను ఏర్పడలేదన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం వల్ల బయటపడిన వైపరీత్యం.

12/01/2017 - 01:07

కశ్మీర్‌లో భద్రతాదళాలపై రాళ్లు రువ్విన దేశద్రోహులకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చారిత్రక పునరావృత్తికి మరో నిదర్శనం. పాకిస్తాన్‌లో జిహాదీ మూకలు సరికొత్త బలాన్ని పుంజుకోవడం ఈ విచిత్ర పునరావృత్తికి వికృత నేపథ్యం. గతంలో, మన్‌మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో, ఇలా కశ్మీర్ లోయలో రాళ్లు రువ్విన ముష్కరులను పెద్ద సంఖ్యలో విడుదల చేయడం చరిత్ర.

11/29/2017 - 23:29

జాతి చైతన్యం, వికాసం, అభ్యున్నతి మహిళా సాధికారతపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచ జనాభాలో సగం ఉన్నా సమాన హక్కుల కోసం పాటుపడాల్సిన దయనీయ పరిస్థితి నుంచి మహిళ బయటపడినప్పుడే పూర్తి శక్తితో, యుక్తితో, స్వీయ ఆలోచనతో సాధికారతను సంతరించుకోగలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ నాటి మహిళ వేరు..

11/28/2017 - 23:08

సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి చెప్పినదానిని ప్రధానమంత్రి సమర్థించాడు! అందువల్ల రాజ్యాంగ ‘విభాగాల’ మధ్య అధికార పరిధికి సంబంధించిన విభేదాలు లేవన్నది న్యాయశాస్త్ర దినోత్సవ వేదికపై జరిగిన ప్రసంగాల ప్రధాన సారాంశం! ‘‘విభేదాలు లేవన్నదాని గురించి’’ విభిన్న విశే్లషణలు వెలువడుతుండడం అందువల్ల అంతుపట్టని వ్యవహారం!

11/27/2017 - 23:52

భాగ్యనగర వాసుల జీవన ప్రస్థానగతి ‘మెట్రో రైలు’ ప్రారంభంతో మరింత వేగాన్ని పుంజుకొంటోంది! ‘వేగం’ ఆధునిక జీవన స్వభావం... అన్నది జరుగుతున్న ప్రచారం! నిజానికి ‘చలనం’ సృష్టిగతమైన స్వభావం, క్షిప్ర చలనం - వేగవంతమైన ప్రయాణం - గ్రహాల భ్రమణాన్ని పరిభ్రమణాన్ని ప్రచోదనం చేస్తున్న సనాతన -శాశ్వత- శక్తి! గంటకు వెయ్యి మైళ్ల - పదహారు వందల కిలోమీటర్ల - వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది.

Pages