S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

10/20/2017 - 23:02

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న క్రిమినాశక ఔషధాలను ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ విరివిగా సరఫరా చేస్తుండడం బహిరంగ రహస్యం. ‘కేంద్రీయ క్రిమి నాశక ఔషధ నియంత్రణ నిర్వాహక మండలి’ - సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ అండ్ రిజస్ట్రేషన్ కమిటి - సిఐబిఆర్‌సి - వారి నియమావళిని ఈ విదేశీయ సంస్థలు బాహాటంగా ఉల్లంఘిస్తుండడం వాణిజ్య ప్రపంచీకరణ - గ్లోబలైజేషన్ - మాయాజాలం!

10/18/2017 - 23:42

భారతీయతను పరిమార్చడానికి విరుచుకుపడుతున్న చీకటి మూకలకు, భారతీయతను నిలబెట్టడానికి ఉద్యమిస్తున్న వెలుగుల శరాలకు మధ్య జరుగుతున్న సమరం వర్తమాన వాస్తవం. కాలుష్యపు నరకంపై స్వచ్ఛ్భారత నిర్మాణం కాంతివ్యూహం పోరాడుతున్న సమయమిది. మన దేశపు సరిహద్దుల చుట్టూ అభినవ నరక రక్కసుల దురాక్రమణ వ్యూహం బిగిసిపోతుండడం వెలుగుల పండుగకు విచిత్రమైన నేపథ్యం!

10/18/2017 - 00:14

ఆహారం శుద్ధి పరిశ్రమల - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ-లో విదేశీయుల పెట్టుబడుల ఆర్భాటం అప్రతిహతంగా కొనసాగుతోంది! నవంబర్ నెలలో ఢిల్లీలో ‘ప్రపంచ ఆహారం’ ప్రదర్శనోత్సవాలు జరుగనున్నాయి.

10/17/2017 - 00:00

హఫీజ్ సరుూద్ అనే జిహాదీ హంతకుడు ‘‘బీభత్సకారుడు కాదని’’ పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం నాడు నిర్ధారించడం ఆశ్చర్యకరం కాదు. గతంలో అనేకసార్లు పాకిస్తాన్ ‘పౌర ప్రభుత్వం’ చేసిన ప్రకటనలకు ఇది పునరావృత్తి మాత్రమే! ‘జమాత్ ఉద్ దావా’ - అన్న జిహాదీ ముఠాలోని మొదటి బీభత్సకారుడైన హఫీజ్ సరుూద్ క్రీస్తుశకం 1990లో ‘లష్కర్ ఏ తయ్యబా’ - ఎల్‌ఇటి-అన్న జిహాదీ ముఠాను స్థాపించాడు.

10/16/2017 - 00:57

ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన ఒక విద్యావంతుడు రాజీనామా చేశాడు. ఆ తరువాత ఆయన ఒక కిరాణా కొట్టును పెట్టుకున్నాడు! భాగ్యనగరంలో సంభవించిన పరిణామం ఇది. ఇలాంటి విద్యావంతులు దేశమంతటా ఉన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ బాధ్యతను నిర్వహించడం గౌరవప్రదం. కిరాణా దుకాణాన్ని నియమ నిబంధనలతో నిజాయితీగా నిర్వహించడం కూడ అంతే గౌరవ ప్రదం...

10/14/2017 - 00:39

రంపం పొట్టు సపోటా విత్తనాల పిండి కలపి విష రసాయనాలను చేర్చి ‘కమ్మటి’ వాసనలను వెదజల్లే మసాలా దినుసులను తయారు చేస్తున్నారట! చక్కెర మరికొన్ని రసాయనాలు కలిసిన కల్తీ ద్రావకాన్ని స్వచ్ఛమైన పుట్టతేనెగా చెలామణి చేస్తున్నారట! తాజాగా తేనెపట్టును దులిపి ఈ ‘తేనె’ను సేకరించినట్టు జనాన్ని ఈ ‘కల్తీ’ కామందులు నమ్మించడం దశాబ్దులుగా కొనసాగుతున్న వంచన క్రమంలో భాగం!

10/13/2017 - 00:46

‘కాబ్’ అన్నది కేవలం ఆంగ్లభాషకు చెందిన మాట కాదు, అమెరికా నాగరికతను మననెత్తిన రుద్దుతున్న ‘ప్రపంచీకరణ’ పరిభాషలో ‘క్యాబ్’ భాగం! ‘కార్’, ‘టాక్సీ’ అన్న ఆంగ్ల పదజాలాన్ని ‘క్యాబ్’ మింగివేయడం మన దేశపు ‘సమాచార సాంకేతిక రంగం’ - ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ- ఐటి- అమెరికాతో జట్టుకట్టిన ఫలితం!

10/11/2017 - 22:04

ప్రపంచానికి విత్తనాలను సమకూర్చగల స్థాయికి కర్నూలు జిల్లా ఎదగగలదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశ్వాసం వ్యక్తం చేయడం ముదావహం. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తనాల భాండాగారంగా తీర్చిదిద్దనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండేండ్లకు పూర్వమే ప్రకటించి ఉన్నారు. ఈ రెండేండ్లలో వందల ఎకరాలలో శ్రేష్ఠమైన విత్తనాలు ఉత్పత్తి అయి ఉండవచ్చు!

10/11/2017 - 00:32

గుజరాత్‌లోని గోద్రా రైలుస్టేషన్ సమీపంలో యాబయి తొమ్మిదిమంది హిందువులను సజీవ దహనం చేసి చంపిన జిహాదీ బీభత్సకారులకు గుజరాత్ హైకోర్టు సోమవారం శిక్షలను ఖరారు చేయడంతో ఈ విషాదం మరోసారి స్ఫురణకు వచ్చింది! పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’ హంతకులు 1947 నుంచి కొనసాగిస్తున్న బీభత్సకాండలో గోద్రా దగ్ధకాండ భాగం.

10/09/2017 - 22:59

రహదారులు క్రుంగిపోతుండడం గురించి జనానికి ఆశ్చర్యం కలగడంలేదు. రహదారులు ఏర్పడుతున్నది క్రుంగిపోవడానికి మాత్రమేనన్నది జనానికి అర్ధమైన ‘ప్రగతి’ స్వరూపం. హైదరాబాద్‌లో ప్రధానమైన రహదారులు ఎక్కడో అక్కడ లోపలికి విరిగిపోయి పెద్ద పెద్ద గుంతలు, గోతులు ఏర్పడడం ‘ప్రతీక’ మాత్రమే!

Pages