S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

04/01/2017 - 01:50

దేశంలో అత్యధిక స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావడానికి రైతన్నల ఆర్తనాదం విచిత్రమైన నేపథ్యం! ఉత్పత్తులు పెరిగి ధరలు పడిపోయినప్పుడు దళారీలు దోచుకుంటున్నారు. ఉత్పత్తులు తగ్గి ధరలు పెరిగినప్పుడు కూడ దళారీలు దోచుకుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- మారీచ మృగం సృష్టించిన మాయాజాలం ఇది.

03/30/2017 - 23:16

జమ్మూ కశ్మీర్‌లో 2008లో మొదలైన ‘సీమాంతర వాణిజ్యం’ సీమాంతర బీభత్సకాండ మరింత విస్తరించడానికి దోహదం చేయడం ధ్రువపడిన వాస్తవం! ఈ వాస్తవం ఇప్పుడు మరోసారి ధ్రువపడింది.

03/30/2017 - 07:20

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యం. దాదాపు 130 కోట్లు దాటిన భారత జనాభాలో మానసిక వత్తిళ్లతో, జన్మతః వచ్చిన లోపాలతో నిస్సారమైన జీవితాలను కొనసాగిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు!

03/29/2017 - 00:30

నేరచరితులు రాజకీయాల్లోకి చొరబడి పోతుండ డం వల్ల సంభవిస్తున్న విష పరిణామాలకు ఇవి సరికొత్త సాక్ష్యాలు. ‘ఎయిర్ ఇండియా’ సంస్థకు చెం దిన ప్రధాన విధి నిర్వాహకుడి- డ్యూటీ మేనేజర్-ను వారం రోజుల క్రితం ‘శివసేన’ రాజకీయ పక్షానికి చెం దిన రవీంద్ర గయిక్వాడ్ అనే నేత కొట్టడం మొదటి వైపరీత్యం! ఇలా కొట్టిన గయిక్వాడ్ మామూలు రాజకీయ వేత్త కాడు.

03/28/2017 - 00:24

వసంత వేళల ప్రశాంత సుందర
నిశాంత దృశ్యం నెలకొంటున్నది..
రసాల పల్లవ పరిమళ సీమల
మరో ‘వత్సరము’ ఉదయిస్తున్నది!

03/27/2017 - 00:13

విద్యావంతులు కాని వారు విద్యావంతులుగా ‘ము ద్ర’లు వేసుకుంటుండడం వాణిజ్య విద్యా సంస్థలు-కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్- పుట్టలుగా గుట్టలుగా పెరిగిపోవడం వల్ల సంభవించిన విపరిణామం. ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్-వల్ల ఈ విపరిణామం మరింతగా ప్రభావితం చేస్తోంది!

03/25/2017 - 01:07

తెలంగాణలో మత ప్రాతిపదికపై ఇస్లాం మతస్థులకు ‘ఆరక్షణ’- రిజర్వేషన్-లను కల్పించరాదని కోరుతూ భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ ఉద్యమించడం ప్రజా హృదయానికి, జనాభీష్టానికి అద్దం! ఈ ఉద్యమాన్ని అప్రజాస్వామిక పద్ధతిలో అణచివేయడానికి యత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ఠను మూటకట్టుకుంటోంది.

03/24/2017 - 00:56

బ్రిటన్ రాజధాని లండన్‌లో పార్లమెంట్ భవనం సమీపంలో ఒక ఉగ్రవాది సృష్టించిన బీభత్సకాండ ప్రతీక మాత్రమే. బుధవారం నాడు కారును పైశాచిక వేగంతో దురుసుగా నడిపిన ఈ ఉగ్రవాది ముగ్గురిని హత్య చేయగలగడం నిరంతర నిర్నిద్రులైన స్కాట్‌లాండ్ యార్డ్-లండన్ పోలీసులకు దిగ్భ్రాంతిని కలిగించిన ఘటన.

03/23/2017 - 05:48

మన దేశంలోని ‘ప్రభుత్వేతర సంస్థలు’-నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్-ఎన్‌జిఓలు-లో అధిక శాతం విదేశాల నుంచి నిధులను స్వీకరిస్తున్నాయి. ఈ విదేశీయ నిధులను సేవా కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజల సంక్షేమం కోసం, ప్రగతి కోసం విదేశీ నిధులను ఖర్చు చేస్తున్నాయట ‘ఎన్‌జిఓ’లు.. కానీ ఈ స్వ చ్ఛందం ముసుగులో అనేక ‘ఎన్‌జిఓ’లు అక్రమ కలాపాలకు పాల్పడుతున్నాయన్నది దశాబ్దులుగా ధ్రువపడిన వాస్తవం!

03/22/2017 - 00:53

అయోధ్య రామజన్మభూమి దేవాలయ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం వారు సలహా ఇవ్వడం ఆలస్యంగానైనా సంభవించిన శుభ పరిణామం. ఈ వి వాదం దాదాపు ఏడేళ్లుగా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. అంతకుపూర్వం దశాబ్దుల పాటు ఈ వివాదం అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం పరిశీలనకు గురి అయింది.

Pages