గ్రహబలం
మార్చి 10 నుండి 16 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
ఇతరుల కోసం మీరు తలపెట్టిన వ్యవహారాలు సులభంగానే ముగుస్తాయి. స్వ విషయాల్లో ఇబ్బందులు, ఆలస్యం తప్పకపోవచ్చు. రచనలు, విద్యా వినోద కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం గతం కంటే మెరుగ్గానే ఉంటుంది. చిరాకు, అశాంతి తగ్గి కుటుంబ వాతావరణం ఉల్లాసాన్నిచ్చేదిగా ఉంటుందనవచ్చు. ఆధునిక పరికరాలు అమరుతాయి.



