ఆదివారం

వ్యక్తిత్వం ( ఈ వారం కథ)

పట్టుచీర కొందామని షాపింగ్ మాల్ కెళ్ళింది మేఘన.
అడగడమే ఆలస్యం కుప్పలు తెప్పలుగా చీరలు తెచ్చి పడేసాడు సేల్స్‌మేన్.

గంగేచ యమునేచైవ...

‘రోడ్లమీద ఎవరూ తిరగట్లేదు సార్! ఆటోలు కూడా నడవటల్లేదు’ అన్నాడు ఆఫీసు అసిస్టెంట్ రాఘవ తలుపు తీసి లోపలకు చూస్తూ. మంచి ఎండాకాలం. బయట భరించలేని వడగాలి.

పరివర్తన

ఏవో మాటలు వినబడుతున్నాయి. నీరసమో ఏమిటో తెలియడం లేదు. కళ్లు మూతలు పడుతున్నాయి. లేవడానికి ప్రయత్నించినా కుదరడంలేదు. తడుముకుంటున్న చేతులకి మడతమంచం పట్టి తగిలింది.
మాణిక్యం మామ్మ వాళ్ల రైతు రత్తయ్యతో మాట్లాడుతోంది.
‘‘తేగలు సరిగా ఊరలేదేంటి రత్తయ్యా!’’ అంటోంది. ‘‘ఏం ఊరడమమ్మా పంటల్తేడానో, బావి తేడానో అర్ధం కావడంలేదు తల్లీ! మాయదారి కాలం వచ్చి పడింది’’ అంటున్నాడు రత్తయ్య.

గంగోత్రి యాత్రలో మందాకిని గిఫ్ట్

మా దంపతులమూ, నా బాల్య స్నేహితుడు తారానందం దంపతులూ, వాళ్ల ఆరేళ్ల కొడుకూ-అయిదుగురమూ గంగోత్రి యాత్రకు బయల్దేరాం.

నేను నేనుగా... (ఈ వారం కథ)

రయ్‌మని వీస్తోంది గాలి. కిటికీ రెక్కల చప్పుడు టప టపామని. రెండు చినుకులు పడ్డట్టున్నాయి. కిటికీపైనుంచి వాన నీళ్లు పడకుండా లోపలకి బయటనుంచి పైన పెట్టించిన రేకులు, చినుకుల చప్పుడుకి డమడమా నెత్తిమీద బాదుతున్నట్టే వుంది. కళ్లు తెరిచి చూశాను. బాలభానుడి పసిడి కిరణాలు, కిటికీ చువ్వల లోంచి నా మొహన పడుతున్నాయి. వాన పడుతుందేమో అనుకుంటూ, గాలి ఇంతలా వీస్తుంటే వానెట్లా పడుతుంది.

రక్త స్పర్శ

బజారంతా చెట్ల నీడలో నిశ్శబ్దాన్ని కప్పుకుని పడుకుంది. నిస్తేజంగా. భోజనాల వేళ కావడం మూలాన అందరిళ్లూ తలుపులు దగ్గరగా వేసో, పూర్తిగా మూసేసో వున్నాయి. ఆ వూరంతటా వెనకటి పెంకుటిళ్లు ఎక్కువ. దుబ్బలేస్తున్న వీధులూ, ఎక్కడా సిమెంట్ రోడ్లు లెవ్వు. సైడు మురిక్కాలవలు లేక ఇళ్లల్లో నీళ్లు ఇష్టమొచ్చిన చోటల్లా బజారంతా పారుతూ ఉన్నాయి.

హనుమాన్ టీస్టాల్

రోజూ ఆరయ్యేసరికల్లా సీటు కట్టేసి, ఆఫీసు మెట్లు దిగి పోయేవాడ్ని. ఎందుకంటే సీతమ్మధార వెళ్లే బస్సు ఆరున్నరకు జంక్షన్‌కి వస్తుంది. అది పోతే మళ్లీ ఏడున్నరకే. అందుకే అలా చేసేవాడ్ని. జంక్షన్‌కి వచ్చి సిగరెట్ వెలిగిస్తే అది పూర్తయ్యే సరికి బస్సు వచ్చేది. కానీ ఆ రోజు రాత్రి పదిన్నర దాటింది తను ఆఫీసు మెట్లు దిగేసరికి. అది అనివార్య కారణాల వల్ల కాదు. అంతా తన తప్పిదమేనని అనుకున్నాడు కాళీచరణ్.

ప్రాయశ్చిత్తం

అనసూయకు ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది.
ఎన్నో రోజులుగా పేరుకున్న విద్వేషాగ్ని చల్లబడింది. ఆగర్భ శత్రువునెవరినో అంతమొందించినంత ఆనందంగా ఉంది. రేపటినుండి మనశ్శాంతిగా తినబోయే తీపి పదార్థాలు, పాల మీగడలు, పెరుగు ఆవడలు..
ఆహాహా! ఒక్కొక్కటీ కళ్లముందు మెదిలి విందు చేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా తను పడుతున్న మానసిక, శారీరక వేదనకు ఇక ముగింపు వచ్చేసింది.

ఎన్నిక (కథ)

కొన్ని దశాబ్దాల క్రితం విజయనగరం జమీందారు వద్ద రామస్వామి అనే దివాను ఉండేవాడు. వయోధర్మరీత్యా వృద్ధాప్యం దాపురించిన రామస్వామి పనిభారం మోయలేక బాగా అలసిపోతూండేవాడు. ఇది గమనించిన జమీందారు ఒక రోజు రామస్వామిని పిలిచి ‘‘అయ్యా! త్వరలోనే నీకు సహాయకుడిగా ఉండేందుకు ఓ మంచి వ్యక్తిని నియమించదలచాను.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading