ఆదివారం

శక్తీ, ఉత్సాహమూ

(గత వారం తరువాయి)
కానీ, ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పేరు తెలీని చెట్టుకు పుట్టిన ఈ కాయలు ఎందుకూ కొరగానివని అతడికి అనుమానమొచ్చి, నిరాశతో వెనక్కు తిరిగాడు. అప్పుడు, తాను ఆ కాయల్ని ఏ నీళ్లలోనైతే వేశాడో ఆ నీళ్లు రంగు మారి, గోధుమ వనె్నగా తయారవడం చూశాడు. అనుమానంగా ఆ నీళ్లు కాసిని తాగి చూశాడు.

ఎడారిలో ఉమార్

చీట్ల పేక కూడా ఆడే ఆసక్తి లేని కొందరు క్లబ్బు మెంబర్లు, ఒకచోట కూచోనుండడం చూచి, ఉత్కళ్‌రావు, వారి మధ్యకు చేరి, తాను ఇటీవల సేకరించిన కొంత నిరుపయోగ సమాచారాన్ని వారిపై సంధించాడు.
‘‘కాఫీ, మన ప్రాణం తీస్తుందా? లేక పోస్తుందా? అనేకమందికి రోజూ టైము టైముకు ప్రాణం పోస్తున్నట్టు ఉంటుంది.

భగవత్ చర్యలు ప్రశ్నించ సాధ్యమా?

ప్రవక్తగా ఎదగక ముందు, మోజెస్ ఒక గురువు వద్ద శిష్యరికం చేస్తుండేవాడు. గురువు నేర్పిన మొదటి ఆధ్యాత్మిక పాఠం వౌనం పాటించడం. గురుశిష్యులిద్దరూ గ్రామ ప్రాంతాల్లో నడుస్తూ వెళ్తున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం చూసి ఆనందిస్తూ వెళ్తున్న మోజెస్‌కు ఆట్టే ఆలోచనలు లేనందువల్ల, ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. అందువల్ల వౌనంగానే ఉన్నాడు.

ఏ పేరున పిలవాలి?

తమ ప్రథమ సంతానమైన పిల్లవాడికి నామకరణం విషయంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడజొచ్చారు, అంటూ కథ చెప్పుకొస్తాడు డీమెల్లో. ఆవిడేమో తన తండ్రి పేరు పెట్టాలంటూ పట్టుబట్టింది. అతడు తన తండ్రి పేరు, అని వాదిస్తాడు. ఇద్దరూ కలిసి తమ మత గురువు వద్దకు వెళ్లారు.
‘మీ తండ్రి పేరేమిటి?’ అని అడిగాడు గురువు.
‘్భజంగరావు’
‘మరి మీ తండ్రి పేరేమిటి?’ అని రెండోవారిని అడిగాడు.
‘్భజంగరావు’

ద్వైదీభావన తొలగితే...

యూదుల మత గురువైన రబ్బై ఒకరొస్తారని ఆ ఊళ్లోని యూదులంతా ఎదురుచూస్తున్నారు. ఈ సాధు పురుషుడి రాక ఒక అపూర్వ సన్నివేశం కాబట్టి ఆయనకు నివేదించ దలచిన తమ ఆధ్యాత్మిక సందేహాలు మతపరమైన ప్రశ్నలు అన్నిటినీ జాగ్రత్తగా సిద్ధం చేసుకున్నారు.

ప్రార్థన

ఏ విజయం శాశ్వతం?
నెపోలియన్ ఒకసారి ఇలా అన్నాడు: మనపై మనం సాధించుకున్న విజయాలే శాశ్వతమైనవీ, పశ్చాత్తాపానికి దారి తీయనివీని.
పని: ప్రార్థన
లాల్‌బహదూర్ శాస్ర్తీ (నెహ్రూ తర్వాత దేశ ప్రధాని) తన కొడుకులకు ఒకే సలహా చెప్తుండేవాడు: ‘నిజాయితీతో కష్టించి పని చేయండి. కష్టించి చేసిన పని, ప్రార్థనతో సమానం.
ప్రేయర్

ఆత్మజ్ఞానం ఎవరికి సిద్ధిస్తుంది?

‘ఆత్మజ్ఞానం ఇరు తెగల వారికి సిద్ధిస్తుంది’ అన్నాడు శ్రీరామకృష్ణ పరమహంస. ‘ఎవరి మనసు పాండిత్యపు గందరగోళం లోనికి దిగకుండునో లేక ఎరువు తెచ్చుకున్న భావములతో పూడిపోకుండునో’ అని ఒక తెగను పేర్కొంటాడు. నిలవ వేసిన జ్ఞానం, గ్రంథాల నుండి సేకరించిన జ్ఞానం - వీటికి వుండాల్సిన విలువ వీటికున్నది. ఇంటర్‌నెట్‌లో సేకరించిన జ్ఞానం యొక్క విలువను తక్కువ చేసి మాట్లాడగలమా?

సాక్షాత్కారంలో కళల ప్రాధాన్యమెంత?

ప్రొఫెపసర్ సుబ్బరామయ్య శ్రీరమణుల వారిని, కళల ప్రాధాన్యాన్ని గురించి ప్రస్తావిస్తూ ‘ఆత్మజ్ఞాన లబ్ధికై, కవిత్వమూ తదితర లలిత కళలను సాధనాలుగా వాడుకునే వీలుందా?’ అని అడిగాడు. అందుకు రమణులు ‘మనసును కేంద్రీకరించేదేదైనా ఉపయోగిస్తుంది. కానీ ప్రతి కళారాధనలోనూ, ‘ఇక చేసింది చాలు’ అనెడి వేదన వస్తుంది. అప్పుడు దానిని దాటి వెళ్లడం జరుగుతుంది’ అన్నారు.

విద్య - అవిద్య

యముడు నచికేతుడితో: ‘విద్య, సత్యమైన జ్ఞానం. అవిద్య అనేది దోషపూరితమైన జ్ఞానం. రెండూ విరుద్ధమైన ఫలితాలకు దారి తీసె్తై’
దీనిపై వ్యాఖ్యానిస్తూ శ్రీ రజనీష్ ‘అవిద్య అంటే, ప్రేయస్సుకు దారి చూపించే విద్య అన్న మాట. అప్పటికప్పుడు ఇష్టసిద్ధికి ఈ అవిద్య సాధనం. విద్య అనేది శ్రేయస్సుకు మార్గం చూపిస్తుంది. అంతిమ మేలుకిది సాధనం.

ఆధ్యాత్మికతను విక్రయించడమా?

తన ప్రసంగాలు, సంవాదాలు మొదలైనవి వినడానికి వచ్చే వారినుండి గాని, తాను ప్రైవేట్‌గా పబ్లిక్‌గా ఇచ్చే ఇంటర్వ్యూలకు గాని ఏ రకంగానూ డబ్బు వసూలు చేయడానికి వీల్లేదని జిడ్డు కృష్ణమూర్తిగారు ఖరాఖండిగా చెప్తుండేవారు.
‘ఆధ్యాత్మికతను అమ్ముకోవడం కన్నా ఘోరమైన విషయం మరేదైనా ఉంటుందా’’ అని కృష్ణమూర్తిగారు ఏనాటినుండో అంటూ వచ్చారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading