ఆదివారం

విహంగాల విడిది

వణికించే చలిగాలుల్ని కాసేపు తట్టుకుని మనం ముందుకు కదిలితే చాలు.. మనోహరమైన ప్రకృతికి మరిన్ని సోయగాలను తెచ్చే అరుదైన పక్షులు ఎనె్నన్నో.. సూర్యోదయానికి ముందుగా అక్కడికి వెళితే వెలుగు రేకలు విచ్చుకునే వేళ రంగురంగుల పక్షులు మన కళ్లెదుట ఇంద్రధనుస్సులను ఆవిష్కరిస్తాయి. గుజరాత్‌లోని నల్‌సరోవర్ సరస్సు తీరాన చల్లటి వాతావరణంతో పాటు అక్కడి వేలాది పక్షులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

‘శాంతి మంత్రం’ ప్రతిధ్వనించే స్థలం..

రమణీయ దృశ్యాలకు, మానసిక ప్రశాంతతకు నిలయమైన ఆ ప్రాంతానికి ఒక్కసారి వెళితే చాలు ఎవరైనా తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అక్కడి పచ్చదనాన్ని చూస్తే మనసు పరవశించడమే కాదు, మనం ఓ ఆధ్యాత్మిక లోకంలోకి అడుగుపెడతాం. బుద్ధుడు ‘మహాభినిష్క్రమణం’ చేసిన స్థలం కావడంతో ఆ ప్రాంతం ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది.

అనుభూతుల జలపాతం

రమణీయ ప్రకృతిలో- అక్కడ నీటి గలగలలు తప్ప మరో సవ్వడి విన్పించదు.. కొండలపై నుంచి ఉరికే జలపాతాల్ని చూస్తే మనలో ఉత్సాహం కూడా ఉప్పొంగుతుంది.. మనసు పొరల్లో మధురానుభూతుల్ని మిగిల్చే ఈ సోయగాల జలపాతాల్ని చూడాలంటే మనం కేరళలోని ఆథిర్‌పల్లి ప్రాంతాన్ని సందర్శించాల్సిందే.

ఆహా... మండే ఎండల్లో మజా!

గ్రీష్మం ఇంకా రాకముందే వసంతం ప్రారంభంలోనే సూర్యుని ప్రతాపం ఇంత తీవ్రంగా వుంటే మున్ముందు ఈ తాపాన్ని తట్టుకునేదెలా అని జనం భీతిల్లుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా శీతల పానీయాలను సేవిస్తూ, ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు ఏసీలు, కూలర్లు పెట్టుకుని సేదదీరుతున్నారు.

వింతైన ‘జూ’

మీకు నచ్చిన పులి చెంతకు చేరుకుని, సరదాగా దాని పొట్ట భాగాన్ని సున్నితంగా నిమరవచ్చు...
సింహం పక్కనే పోజులిస్తూ నిలబడి, నిర్భయంగా దాని ముక్కును పట్టుకుని వింత అనుభూతి పొందవచ్చు..
‘లంచ్’ సమయంలో వెరైటీగా ఓ ఎలుగుబంటితో కలిసి మీరు భోజనం చేయవచ్చు..

ఎక్కడా లేని అందాలు ‘తెక్కడి’లోనే..!

ప్రశాంతమైన సరస్సులో గజరాజుల జలకాలాటలు.. ఎటు చూసినా ఏపుగా పెరిగిన కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల వృక్షాలు.. దట్టమైన అడవుల్లో చూపరులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే వన్యప్రాణులు.. ఆనందలోకాలకు తీసుకెళ్లే బోటు షికారు.. ఇంద్రధనుస్సులోని వర్ణాలన్నీ ఒకే చోట కలబోసినట్లు కట్టిపడేసే అందాలు..

కమనీయ దృశ్యాల కలబోత- ‘గోకర్ణ’

యాంత్రిక జీవనం నుంచి దూరంగా, నిజమైన మానసిక ప్రశాంతత పొందాలనుకుంటే ‘గోకర్ణ’ ప్రాంతానికి వెళ్లాల్సిందే. దేశంలోని ఇతర సముద్ర తీరాల కన్నా భిన్నంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనల్ని సేద తీరుస్తుంది. ఎత్తయిన కొండల నడుమ ఇక్కడి సుందరమైన తీర ప్రాంతం సందర్శకులను ఒక్కసారి విస్మయ పరుస్తుంది. ఇక్కడికి వస్తే గోవా బీచ్‌ను సందర్శించినంత అనుభూతి కలుగుతుందని పర్యాటకులు సంతృప్తి చెందుతుంటారు.

వనంలో ‘స్వర సమ్మేళనం’!

సంధ్యా సమయాన గగన వీధిలో మెల్లగా కదలాడే నీలి మేఘాలు.. అక్కడ ఎటు చూసినా నిశ్శబ్ద వాతావరణం.. మనల్ని మరో లోకానికి తీసుకుపోయే గంభీర ప్రశాంతత.. పచ్చటి ఆ వనంలోంచి మనం వౌనంగా నడిచి వెళ్తుంటే- వినసొంపైన ‘స్వర సమ్మేళనం’ మనకు అకస్మాత్తుగా వినిపిస్తుంది. అయితే- అక్కడ నాదబ్రహ్మలో, సంగీత కళాకారులో కనిపించరు. వేలాది పక్షులు చేసే కూజితాలు అవి.

ఫీనిక్స్ -- పర్యాటకం

అరిజోనా రాష్ట్ర రాజధాని ఫీనిక్స్ అమెరికాలో జనాభా విషయంలో ఆరో పెద్ద నగరం. 1338 చదరపుమైళ్ల విస్తీర్ణంలోగల దీని జనాభా 14 లక్షల 70వేలు. 1861లో సాల్ట్ రివర్ ఒడ్డున ఇది ఆరంభమైంది. ఫీనిక్స్ నగరవాసులని ఫీనిషియన్స్ అంటారు.
ఇక్కడ చూడదగ్గ కొన్ని పర్యాటక విశేషాలు.

జ్ఞాపకాల మజిలీ మండు

చుట్టూ పచ్చిక బయళ్లు - ఎతె్తైన వింధ్య పర్వత శ్రేణులూ.. లోయలూ.. దక్షిణంగా గలగల పారే నర్మదా నదీజలాలతో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా కళకళలాడుతూండేది. అందుకేనేమో? ‘షాదియాబాద్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అంటే ‘ఆనంద నగరం’ అని అర్థం. అల్లావుద్దీన్ ఖిల్లీ ఏలుబడిలో దేదీప్యమానంగా వెలుగొందిన ‘మండు’ రాజ్యం ఇప్పుడు వెలవెలబోతూ ఆనాటి చరిత్ర కబుర్లను విశదీకరిస్తూంది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading