ఆదివారం

చాటు ప్రదేశం

ఓ కంచె వెనుక దాగున్న ఆ కాటేజ్‌ని, తోటలో పని చేసే ఓ ముసలావిడని స్వీనీ చూసాడు. ఆ కాటేజీ దాదాపు శిథిలావస్థకి చేరుకుంది. ఆ ముసలావిడ నడుం వంచి చెట్ల పండుటాకుల్ని తెంపి బుట్టలో వేస్తోంది. ఆమె రెడ్ ఇండియన్ సంతతికి చెందిందని ఆవిడ ముఖ కవళికలని బట్టి అతనికి అనిపించింది.

గూడుపుఠాణీ -- మల్లాది మిరియాలు

కెనడీ ఆ ఇంటి పేషియోలోకి వచ్చేసరికి ఫోమ్ పరుపు మీద నిద్రపోయే ఓ యువతి, హేంగింగ్ సోఫాల కూర్చున్న ఓ యువకుడు కనిపించారు.
‘‘మిస్టర్ ఫెలిక్స్?’’ కెనడీ ప్రశ్నించాడు.
ముందుకి రాబోతున్న కెనడీతో అతను చెప్పాడు
‘‘అక్కడే ఆగు. నిన్ను చూడాలి.’’
ఆమె కళ్లు తెరవలేదు. ఫెలిక్స్ అతన్ని పరిశీలనగా చూసి అడిగాడు.
‘‘నీ బరువెంత మిస్టర్ కెనడీ?’’
‘‘సుమారు నూట డెబ్బై పౌన్లు.’’

దైవ సహాయం

జైలునుంచి విడుదలయ్యాక మాస్ బాప్టిస్ట్ చర్చిలో కీన్‌ని కలిసాడు.వారిద్దరికీ జైలులో శిక్ష అనుభవించేప్పుడే పరిచయం. మాస్ ప్రశ్నకు జవాబు చెప్తూ కీన్ వివరించాడు.
‘‘సిక్స్‌టీ ఎజెకియల్ బాప్టిస్ట్ చర్చిని మా తాతయ్య స్థాపించాడు. జీవించి ఉన్నంత కాలం మా నాన్న దానికి పాస్టర్‌గా పనిచేశాడు. తర్వాత నన్ను పాస్టర్‌గా ఉండమని భక్తులు కోరారు’’
‘‘నీ నేర చరిత్ర గురించి తెలిసాక కూడానా?’’మాస్ అడిగాడు.

దయగల హత్య

జాన్ జాన్సన్ తన భార్యను హత్య చేయడం తప్పదనే నిర్ణయానికి వచ్చాడు. అది కూడా ఆమె మీద ప్రేమతో! ఆమెనించి విడిపోయేందుకు విడాకుల ప్రసక్తే లేదు అనుకున్నాడు. విడిపోవడానికి తగ్గ కారణం ఒక్కటీ లేదు. మేరీ ప్రేమగా, దయగా ప్రవర్తించే అందగత్తె. వారి వైవాహిక జీవితంలో ఒక్కసారి కూడా ఆమె అతనిమీద అలగలేదు. గొణగలేదు. రుచికరమైన వంట చేస్తుంది. బ్రిడ్జ్ ఆటని సమర్థవంతంగా ఆడుతుంది.

ఏడో ప్రయాణీకురాలు -- మల్లాది మిరియాలు

ఆ శనివారం ఉదయం రేడియోలో స్పెషల్ బులెటిన్‌ని ఫ్రెడ్ నెచెల్ విన్నాడు. కూలిన ఓ ప్రైవేట్ విమానం గురించి చెప్తూ అందులోని ప్రయాణీకులంతా మరణించారని చెప్పారు. ఐతే ఎంత మందో, వారి పేర్లేమిటో చెప్పలేదు.
నెచెల్‌కి వారిలో తన భార్య కూడా ఉండచ్చని అనిపించింది. సమాచారం తెలుసుకోడానికి నెచెల్ లాస్ ఏంజెలెస్‌లోని డైలీ న్యూస్ దినపత్రిక నంబర్‌కి వెంటనే ఫోన్ చేశాడు.

(ఆత్మ) హత్య

హాక్లే బిల్డింగ్‌లో కాక్ టెయిల్‌ని సర్వ్ చేసే లాంజ్‌లో డేల్ బజ్లీ ఓ గ్లాస్‌లోని కాక్‌టెయిల్‌ని తాగుతూ అతన్ని చూసాడు. తెలిసిన మొహం కనిపించడంతో పరిశీలనగా చూస్తే, అతను పూర్వం తనతో కాలేజీలో చదివిన ఫిలిప్ కర్టెండన్‌గా గుర్తించాడు. ఫిలిప్ ఐదేళ్ల క్రితం కంటే లావయ్యాడు. అతను హాక్లే బిల్డింగ్‌లోకి ఎందుకు వచ్చాడో డేల్‌కి అర్థం కాలేదు. సరిగ్గా ఆ సమయంలో డేల్‌ని చూసి ఫిలిప్ ఆశ్చర్యపోయాడు.

ఓడిపోయాడు

మార్టిన్ క్రోనిస్టర్‌కి పిస్తోలుని పేల్చడం అంటే చిన్నప్పటి నించే భయం ఏర్పడింది. అతని ఐదేళ్ల వయసులో మార్టిన్ తండ్రి దగ్గరుండి మార్టిన్ చేత పిస్తోలుని కాల్పించాడు. ఆ కోల్ట్ పాయింట్ త్రీ ఎయిట్ పిస్తోలు చేసిన శబ్దానికి మార్టిన్ ఎంత భయపడ్డాడు అంటే, పిస్తోలు పేల్చాలంటేనే భయం అతని మనసులో నిలిచిపోయింది.

హైజాకింగ్

బోయింగ్ 727 జెట్ విమానం భూమికి ఇరవై ఎనిమిది వేల అడుగుల ఎత్తున టెనె్నస్సీ రివర్ వేలీ మీద ఎగురుతూండగా కాక్‌పిట్‌లో ఇంటర్‌కమ్ లైట్ వెలిగింది. పైలెట్ బటన్ నొక్కగానే కంగారుగా వినిపించింది.

గేంబ్లర్స్ క్లబ్

ఓ చలికాలం ఉదయం ప్రైవేట్ డిటెక్టివ్ ఎల్లరీ క్వీన్‌కి గేంబ్లర్స్ క్లబ్ గురించి తెలిసింది. ఆ ఉదయం న్యూయార్క్‌లోని 87వ వీధిలో గల క్వీన్ ఇంటిముందు ఆగిన కారులోంచి ముగ్గురు దిగి అతని డోర్ బెల్ నొక్కారు. తలుపు తెరిచిన క్వీన్ వారు వచ్చిన అతి పొడవైన కారుని చూసి, వాళ్ళు బాగా ధనవంతులని గ్రహించాడు.
‘‘హలో మిస్టర్ క్వీన్, నా పేరు ఛార్లెస్. వీరు నా మిత్రులు లెవిస్, గోర్‌మేన్’’

తోడు దొంగలు

ఛార్లెస్ లోవీ అచేతనంగా ఉన్న తన భార్య వంక చూశాడు. ఆమె ముక్కు దగ్గర వేలుంచాడు. గాలి తగల్లేదు. ఆమె మెడ చుట్టూ తోపు రంగు సిల్క్ స్కార్ఫ్, ఎర్రటి పువ్వులా కనిపిస్తూ బిగించబడి ఉంది. అతను ఫ్రెంచ్ డోర్స్‌ని కొద్దిగా తెరిచి టెర్రస్ మీదకి వెళ్లాడు. టెర్రస్‌లో రెయిలింగ్ దగ్గర పూల కుండీల వరస ఉంది. ఓ కుండీని తీసుకుని గాజు తలుపు మీదకి విసిరాడు. శబ్దం చేస్తూ తలుపు పగిలి గాజు పెంకులు గదిలో నేల మీద పడ్డాయి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading