S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/05/2019 - 05:11

బ్యాంకాక్, ఆగస్టు 4: థాయ్‌లాం డ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో ప్రపంచ చాంపియన్లు అయన చైనా షట్లర్లు లీ జున్ హూ-యు చెన్ జోడీని సాత్విక్ సాయరాజ్-చిరాగ్ శెట్టి మట్టికరిపించారు. ఆధ్యంతం హోరా హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జోడీ 21-19, 18-21, 21-18 తేడాతో విజయం సాధించింది.

08/05/2019 - 05:08

హంగేరియా గ్రాండ్ ప్రిక్స్ ఫార్మూలా 2 చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తర్వాత ప్రేమా రేసింగ్స్ జర్మన్ డ్రైవర్ మిక్ షుమాకర్. ఏడు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించిన ప్రముఖ ఫార్మూలా 1 డ్రైవర్ మైఖేల్ షుమాకర్ తనయుడు మిక్ కూడా ఫార్మూలా రేస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.

08/05/2019 - 05:06

బర్మింగ్‌హామ్ వేదికగా యాషెస్ సిరీస్ మొదటి టెస్టు నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (142). మొదటి ఇన్నింగ్స్‌లోనూ స్మిత్ (144) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో భాగంగా ఆసీస్ ఆతిథ్య జట్టయన ఇంగ్లాండ్ ముందు 488 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

08/04/2019 - 03:49

ఒక టీ-20 ఇంటర్నేషనల్‌లో భారత బౌలర్లు ఆరుగురు కనీసం ఒక వికెట్ కూల్చడం ఇది మూడోసారి. 2016లో మీర్పూర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై, 2018లో దర్బన్ మైదానంలో దక్షిణాఫ్రికాపై ఆరుగురు భారత బౌలర్లు బౌలింగ్ చేసి, ప్రతి ఒక్కరూ కనీసం ఒక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
*

08/04/2019 - 03:46

తండ్రి సాధించిన పతకాన్ని మెడలో వేసుకొని మురిసిపోతున్న ఇవానా. పాన్ అమెరికన్ గేమ్స్ పురుషుల డైవింగ్ సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్ డైవింగ్‌లో మెక్సికో స్విమ్మర్ ఇవాన్ గార్సియా స్వర్ణ పతకం సాధించాడు. పతకాన్ని స్వీకరించిన తర్వాత, కూతురు ఇవానా మెడలో మెడల్‌ను వేసి పొంగిపోయాడు. ఆమె కూడా తానే పతకాన్ని సాధించినట్టు ఫొటోలకు ఫోజులిచ్చింది.

08/04/2019 - 03:45

ఎడ్జిబాస్టన్, ఆగస్టు 3: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టు మ్యాచ్, మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్ రొరీ బర్న్స్ అద్భుతమైన పోరాటపటిమను కనబరచి, సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్‌కు ఈ ఆధిక్యం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 80.4 ఓవర్లు పొరాడి, 284 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

08/04/2019 - 03:43

ఆసన్షన్ (పరాగ్వే), ఆగస్టు 3: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లోనెల్ మెస్సీపై వేటు పడింది. ఇటీవల అతను చేసిన అవినీతి ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య (కానె్మబొల్) మూడు నెలల సస్పెన్షన్ వేటు వేసింది. అంతేగాక, 50 వేల డాలర్ల జరిమానా విధించింది.

08/04/2019 - 03:42

కలావో (పెరూ)లోని మిగుల్ గ్రావూ కొలీజియంలో జరిగిన లిమా పాన్ అమెరికన్ గేమ్స్ మహిళల మిడిల్ వెయిట్ (69-75 కిలోలు) ఫైట్‌లో ప్రత్యర్థి నవోమీ గ్రాహం (అమెరికా)ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న కొలంబియా బాక్సర్ జెస్సికా కాసెడో. న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా ఆమెను విజేతగా ప్రకటించారు.

08/04/2019 - 03:39

కరాచీ, ఆగస్టు 3: సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌కు ఈసారి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెంట్రల్ కాంట్రాక్టు దక్కడం అనుమానంగానే ఉంది. అతనితోపాటు జునైద్ ఖాన్, మహమ్మద్ హఫీజ్‌కు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి పీసీబీ ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కకపోవచ్చని సమాచారం. నిజానికి పీసీబీ ప్రధాన కార్లాయంలో పాలక మండలి సమావేశం గురువారం జరిగింది.

08/04/2019 - 03:39

సిడ్నీ, ఆగస్టు 3: టెస్టు మ్యాచ్‌ల్లో, ప్రత్యేకించి యాషెస్ సిరీస్‌లో న్యూట్రల్ అంపైర్లను నియమించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, వారి సేవలు అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు.

Pages