S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/04/2019 - 03:45

ఎడ్జిబాస్టన్, ఆగస్టు 3: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టు మ్యాచ్, మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్ రొరీ బర్న్స్ అద్భుతమైన పోరాటపటిమను కనబరచి, సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్‌కు ఈ ఆధిక్యం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 80.4 ఓవర్లు పొరాడి, 284 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

08/04/2019 - 03:43

ఆసన్షన్ (పరాగ్వే), ఆగస్టు 3: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లోనెల్ మెస్సీపై వేటు పడింది. ఇటీవల అతను చేసిన అవినీతి ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య (కానె్మబొల్) మూడు నెలల సస్పెన్షన్ వేటు వేసింది. అంతేగాక, 50 వేల డాలర్ల జరిమానా విధించింది.

08/04/2019 - 03:42

కలావో (పెరూ)లోని మిగుల్ గ్రావూ కొలీజియంలో జరిగిన లిమా పాన్ అమెరికన్ గేమ్స్ మహిళల మిడిల్ వెయిట్ (69-75 కిలోలు) ఫైట్‌లో ప్రత్యర్థి నవోమీ గ్రాహం (అమెరికా)ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న కొలంబియా బాక్సర్ జెస్సికా కాసెడో. న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా ఆమెను విజేతగా ప్రకటించారు.

08/04/2019 - 03:39

కరాచీ, ఆగస్టు 3: సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌కు ఈసారి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెంట్రల్ కాంట్రాక్టు దక్కడం అనుమానంగానే ఉంది. అతనితోపాటు జునైద్ ఖాన్, మహమ్మద్ హఫీజ్‌కు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి పీసీబీ ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కకపోవచ్చని సమాచారం. నిజానికి పీసీబీ ప్రధాన కార్లాయంలో పాలక మండలి సమావేశం గురువారం జరిగింది.

08/04/2019 - 03:39

సిడ్నీ, ఆగస్టు 3: టెస్టు మ్యాచ్‌ల్లో, ప్రత్యేకించి యాషెస్ సిరీస్‌లో న్యూట్రల్ అంపైర్లను నియమించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, వారి సేవలు అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు.

08/02/2019 - 22:01

లాడేర్హిల్, ఆగస్టు 2: ప్రపంచకప్ తర్వాత టీమిండియా నేడు వెస్టిండీస్‌తో మొదటి సిరీస్ లో తలపడనుంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో భారత్ కరేబియన్లపై పైచేయ సాధించాలని భావిస్తోంది. మెగా టోర్నీలో సెమీస్‌తోనే ఇంటిబాట పట్టిన కోహ్లీసేన స్వదేశంలో పలు విమర్మలు ఎదు ర్కొంది. దీంతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో దూరం పెరగ డంతో కోహ్లీకి విండీస్‌తో సిరీస్ సవాల్‌గా మారింది.

08/02/2019 - 22:00

బర్మింగ్‌హామ్, ఆగస్టు 2: యాషెస్ మొదటి టెస్టులో సెంచరీ సాధించి, జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్మిత్ తనకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మద్దతు లభించిందని, అదొక్కటే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. శతకం తర్వాత అభిమానులు చప్పట్లు కొడుతుంటే వెన్నులో వణుకు పుట్టిందన్నాడు.

08/02/2019 - 21:58

కోల్‌కతా, ఆగస్టు 2: తను ఎప్పటికైనా భారత జట్టు కోచ్ అవుతానని టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఓవైపు భారత క్రికెట్ ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌ల నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

08/02/2019 - 21:57

కర్నాటకలో జరిగిన తొలి మహిళా టీ20 లీగ్ (కర్నాటక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్)లో నర్మద జటు నుంచి రక్షిత, యుమున జట్టు నుంచి బ్రిందా, సింధూ జట్టు నుంచి దివ్య, కావేరి జట్టునుంచి అదితి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వీరు పాల్గొన్నారు. ఆగస్టు 4 నుంచి 8 మధ్య ఈ లీగ్ ప్రారంభం కానుంది.

08/02/2019 - 21:55

రష్యాలోని కస్పిస్క్‌లో జరుగుతున్న ఉమఖనోవ్ మెమోరియల్ అంతర్జాతీయ బాక్సింగ్ 2019 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌లో ప్రవేశించిన 2018 కామనె్వల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత గౌరవ్ సొలంకి

Pages