S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/25/2019 - 04:35

మెల్‌బోర్న్: ఈ ఏడాది టీమిండి యా కెప్టెన్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో ఈ సంవత్సరం అత్యధి క పరుగులు చేసిన ఆటగాడిగా, టెస్టులు, వనే్డ బ్యాట్స్‌మెన్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన కోహ్లీ, తాజాగా మరో ఘనత అందుకున్నాడు. క్రికె ట్ ఆస్ట్రేలియా (సీఏ), విజ్డన్ ప్రకటించిన ఈ దశాబ్ద పు అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

12/24/2019 - 22:59

మెల్‌బోర్న్, డిసెంబర్ 24: ఈసారి ఐపీఎల్‌లో తప్పకుం డా మంచి ప్రదర్శన చే స్తానని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో అందరికంటే అత్యధికంగా రూ.15.5 కోట్లకు కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కమిన్స్‌తో పాటు ఆస్ట్రేలియాకే చెందిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 10.75 కోట్లకు దక్కించుకుంది.

12/24/2019 - 22:58

'చిత్రం...మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేను మంగళవారం తన నివాసంలో కలిసిన భారత మాజీ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్

12/24/2019 - 22:56

దుబాయి, డిసెంబర్ 24: భారత కెప్టెన్, రన్ మిషన్ విరాట్‌కోహ్లీ టెస్టుల్లో తన టాప్ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 928 రేటింగ్ పాయంట్లతో మొదటిస్థానంలో కొనసాగు తుండగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 17 పాయింట్ల వ్యత్యాసం ఉంది.

12/24/2019 - 05:08

దుబాయ్: ఐసీసీ సోమవారం తాజాగా ప్రకటించిన వనే్డ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచారు. వెస్టిండీస్‌తో ఆదివారం కటక్‌లో జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 2-1తో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ తమ తమ స్థానాలను పదిలపరచుకున్నారు.

12/24/2019 - 05:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: శ్రీలంకతో వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ 20, ఆస్ట్రేలియాతో జరిగే వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడే టీమిండియా జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మళ్లీ ఆడనున్నారు. అయితే, టీ 20, వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. అదేవిధంగా శ్రీలంకతో జరిగే టీ-20 సిరీస్‌కు పేసర్ మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు.

12/24/2019 - 04:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సౌరవ్ గంగూలీ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆటతీరును ప్రశంసాపూర్వకంగా అభినందించాడు. వెస్టిండీస్‌తో కటక్‌లో ఆదివారం జరిగిన ఆఖరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్ కీలక మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయం సాధించడంలో జడేజా పోషించిన పాత్ర ఎంతో మెచ్చుకోదగినదని గంగూలీ పేర్కొన్నాడు.

12/24/2019 - 04:57

కటక్, డిసెంబర్ 23: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన సత్తా ఏమిటో తనకు తాను మాత్రమే నిరూపించుకుంటానని, తానేమిటో ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదని టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు.

12/23/2019 - 23:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: టీమిండియాకు రెండుసార్లు వరల్డ్ కప్‌లను అందించిన మాజీ కెప్టెన్ ఎం.ఎస్.్ధనీ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టి సోమవారం నాటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘకాలంలో ఈ రాంచీ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ ధోనీ ఇటు జట్టు సారథిగా, అటు బ్యాట్స్‌మన్‌గా, మరోపక్క వికెట్ కీపర్‌గా కీలక పాత్రలను పోషించి, ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు.

12/23/2019 - 23:55

కటక్, డిసెంబర్ 23: ఈ ఏడాది మొత్తం బ్యాటింగ్‌లో చాలా సంతృప్తి మిగిలిందని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతంలో కంటే 2019లో తాను ఆడిన ఆటతో ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

Pages