S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/20/2019 - 06:02

మలేసియా, డిసెంబర్ 19: పాకిస్తాన్‌తో మలేసియా వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళా జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 185 పరుగులు చేసింది. ఓపెనర్లు అమీ ఎల్లెన్ జోన్స్ (89), డానియెల్లీ వ్యాట్ (55) అర్ధ సెంచరీలతో రాణించారు.

12/20/2019 - 06:00

కరాచీ, డిసెంబర్ 19: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ తడబడింది. లంక బౌలర్లు లహీరు కుమార, లసిత్ ఎంబుల్డినియా ధాటికి తొలి రోజే కుప్పకూలింది. అంతకుముం దు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాట్స్‌మెన్లలో బాబర్ అజాం (60), అసద్ షాఫీఖ్ (63) అర్ధ సెంచరీలతో రాణించగా, అబిద్ అలీ (38) ఫర్వాలేదనిపించాడు.

12/20/2019 - 01:05

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో అత్యధికంగా 15.50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్. అతనిని కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. గ్లేన్ మాక్స్‌కు 10.75 కోట్లు, క్రిస్ మోరిస్‌కు 10 కోట్ల రూపాయలు లభించాయి. భారత ఆటగాళ్లలో పీయూష్ చావ్లాకు 6.5 కోట్ల రూపాయలు దక్కాయి.

12/19/2019 - 05:19

విశాఖపట్నం: విశాఖ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండో వనే్డలో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ సెంచరీలకు తోడు కుల్దీప్, షమీ నిప్పులు చెరిగే బంతులతో రాణించడంతో టీమిండియా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ఓపెనర్లు మొదట నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

12/19/2019 - 01:28

విశాఖపట్నం, డిసెంబర్ 18: ఈ ఏడాది అత్యధికంగా 77 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన తన రికార్డులను తానే అధిగమించాడు. 2019 లో రోహిత్ 77 సిక్సర్లు కొట్టగా, 2018లో (74), 2017లో 65 సిక్సర్లు సాధించి, వరుసగా మూడేళ్లు మొదటి స్థానం లో నిలిచాడు. ఈ ఏడాది రోహిత్ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (60) ఉన్నాడు.

12/19/2019 - 01:26

విశాఖపట్నం, డిసెంబర్ 18: వనే్డ క్రికెట్ చరిత్రల్లో టీమిండి యా ఓపెనర్ రోహి త్ శర్మ మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకు న్నాడు. ఎనిమిది సార్లు 150 పరుగులకు పైగా స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

12/19/2019 - 00:36

*చిత్రాలు.. ..వెస్టిండీస్‌తో బుధవారం విశాఖపట్నంలో జరిగిన రెండో వనే్డలో శతకాలతో చెలరేగిన టీమిండియా
ఓపెనర్లు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ. *హ్యాట్రిక్ వీరుడు కుల్దీప్ యాదవ్

12/18/2019 - 00:01

విశాఖపట్నం (స్పోర్ట్స్) : టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవడం మంచిదని, అయితే తుది నిర్ణయం మేనేజ్‌మెంట్‌దేనని భారత్ జట్టు బౌలర్ దీపక్ చాహర్ అన్నాడు. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన చాహార్ విలేఖరులతో మాట్లాడుతూ గాయాల కారణంగా తాను చాలాసార్లు భారత్ జట్టులో స్థానం చేజార్చుకున్నానన్నాడు.

12/17/2019 - 23:58

విశాఖపట్నం (స్పోర్ట్స్) డిసెంబర్ 17: వెస్టీండీస్ తరఫున మీడియాతో మాట్లాడిన ఓపెనింగ్ బ్యాట్స్‌మేన్ షై హోప్, వైజాగ్ వనే్డలో కూడా గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకుంటామన్నాడు. అన్ని మ్యాచ్‌ల్లోను బ్యాటింగ్‌లో రాణిస్తున్నామని అలాగే ఈ మ్యాచ్‌లో కూడా తమ సత్తా చూపుతామన్నాడు. బౌలింగ్‌లో మరింత రాణించి భారత్‌ను కట్టడి చేయడానికి శ్రమిస్తామన్నాడు.
*చిత్రం... ఓపెనింగ్ బ్యాట్స్‌మేన్ షై హోప్

12/17/2019 - 23:56

దుబాయ, డిసెంబర్ 17: టీమిండి యా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన గౌరవం అందు కుంది. ఈ ఏడాది ఐసీసీ వనే్డ, టీ20 జట్లలో చోటు సంపాదించింది. మం ధానతో పాటు జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండే వనే్డ జట్టులో చోటు సంపాదించారు. ఆల్ రౌం డర్ దీప్తి శర్మకు టీ20 జట్టులో చోటు దక్కింది. టీమిండి యా తరఫు న మంధాన 51 వనే్డలు, 66 టీ20లు ఆడింది. మొత్తం 3476 పరుగులు చేసింది.

Pages