S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/13/2020 - 06:59

నడియాడ్: రంజీట్రోఫీలో భాగం గా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్ లో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో ఆంధ్రా జట్టు 177 పరుగులకే కుప్ప కూలింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా జట్టులో కరణ్ షిండే (49), బోడపాటి సుమంత్ (40), ప్రశాంత్ కుమార్ (30) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు సాధించారు.

02/13/2020 - 06:59

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రంజీ ట్రోఫీలో భాగంగా బుధవారం నాడి క్కడ విదర్భతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తన మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయ 239 పరుగు లు చేసింది. అంతకుముందు టాస్ ఓ డి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హై దరాబాద్ జట్టులో ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (5), అక్షాంత్ రెడ్డి (6) నిరాశ పరచగా, మూడో స్థానంలో వచ్చిన రాహుల్ బుద్ది (52) అర్ధ సెంచ రీతో ఆకట్టుకున్నాడు.

02/12/2020 - 00:41

*చిత్రం...టీమిండియాను మంగళవారం జరిగిన చివరి, మూడో వనే్డలో ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు

02/11/2020 - 23:24

ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ జోరును కొనసాగించారు. హామిల్టన్ వనే్డలో 348 పరుగులు
ఛేజించారు. భారత్‌పై వనే్డల్లో కివీస్‌కు అదే అత్యధిక లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో 297 పరుగుల లక్ష్యాన్ని చేరింది. అంతకు ముందు, 2014లో 279 పరుగులు సాధించి విజయభేరి మోగించింది.

02/11/2020 - 23:21

వౌంట్ మాంగనుయ్, ఫిబ్రవరి 11: భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 40, మాయాంక్ అగర్వాల్ బీ కేల్ జమీసన్ 1, విరాట్ కోహ్లీ సీ కేల్ జమీసన్ బీ హమీష్ బెనెట్ 9, శ్రేయాస్ అయ్యర్ సీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బీ జేమ్స్ నీషమ్ 62, లోకేష్ రాహుల్ సీ కేల్ జమీసన్ బీ హమీష్ బెనెట్ 112, మనీష్ పాండే సీ సీ మిచెల్ సాంట్నర్ బీ హమీష్ బెనెట్ 42, రవీంద్ర జడేజా 8 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ సీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బీ హమీష్ బెనెట

02/11/2020 - 23:19

వౌంట్ మాంగనుయ్, ఫిబ్రవరి 11: భారత మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు ఉదారంగా పరుగులు సమర్పించుకున్నాడు. కొంతకాలం జట్టుకు దూరమై, తిరిగి వచ్చిన తర్వాత అతను తాజా మ్యాచ్‌తో కలిపి ఆరు వనే్డ మ్యాచ్‌లు ఆడాడు. ఓవర్‌కు అతను సగటున వరుసగా 6.88, 6.60, 8.60, 8.89, 6.00, 9.22 పరుగులిచ్చాడు. మొత్తం మీద ఆరు మ్యాచ్‌ల్లో 51 ఓవర్లు బౌల్ చేసి, సగటున 7.58 పరుగులిచ్చాడు.

02/11/2020 - 23:16

జింబాబ్వే ఆటగాడు డగ్లస్ మరిలియర్ సరసన కివీస్ బ్యాట్స్‌మన్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ చోటు సంపాదించాడు. భారత్‌పై వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యంత తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మరిలియర్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. కాగా, ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్‌ది అగ్రస్థానం.

02/11/2020 - 23:12

రావల్పిండి, ఫిబ్రవరి 11: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని పాకిస్తాన్ ఇన్నింగ్స్ 44 పరుగుల తేడాతో గెల్చుకుంది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థిపై పాక్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 82.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలాటైంది. మహమ్మద్ మిథున్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నజ్ముల్ హొస్సేన్ షాంటో 44 పరుగులు చేశాడు.

02/11/2020 - 04:57

ఢాకా: తన సోదరి అకాల మరణం ఎంతగానో వేధిస్తున్నా ఆ ఆవేదనను పంటి బిగువన పెట్టుకుని క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పాడు బంగ్లాదేశ్ అండర్-19 కెప్టెన్ అక్బర్ అలీ. భారత్‌తో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో తమ జట్టు విజయం సాధించడంలో సమర్ధవంతమైన పాత్రను పోషించిన అలీ పాత్రను పలువురు క్రీడా పండితులు అభినందించారు.

02/11/2020 - 01:34

పోచెఫ్‌స్ట్రూమ్, ఫిబ్రవరి 10: అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ మండిపడ్డాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించిన బంగ్లా ఆటగాళ్లు మితిమీరిన స్థాయిలో ప్రవర్తించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది.

Pages