S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/11/2020 - 01:31

ఢాకా, ఫిబ్రవరి 10: ఐసీసీ నిర్వహించిన అన్ని స్థాయిల్లోని మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరచడం ద్వారా అండర్-19లో తొలిసారిగా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న తమ జట్టు సభ్యులకు ప్రజల సమక్షంలో ఘన సత్కారం చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

02/11/2020 - 01:31

రావల్పిండి, ఫిబ్రవరి 10: బంగ్లాతో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యతను సాధించింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులతో విజయం సాధించి బంగ్లాను చిత్తు చేసింది.
బంగ్లా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఔటైంది. పాకిస్తాన్ పేసర్లు, స్పిన్నర్ల ముందు బంగ్లా ఆటగాళ్లు నిలవలేకపోయారు.

02/11/2020 - 01:30

వౌంట్ మాంగనూయి (న్యూజిలాండ్), ఫిబ్రవరి 10: టీమిండియా తన బ్యాటింగ్ పాటవాన్ని నిరూపించుకుంటుందా? కోహ్లీ సేన భారత ఆశలను ఆరిపోకుండా కాపాడగలుగుతుందా? న్యూజిలాండ్‌తో వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను కోల్పోయిన భారత్ మంగళవారం జరుగనున్న చివరి మ్యాచ్‌లో ఏమేరకు తన శక్తిసామర్థ్యాలను కనబరుస్తుందన్న దానిపైనే యావత్ భారతం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

02/11/2020 - 01:29

పోచెఫ్‌స్ట్రూమ్, ఫిబ్రవరి 10: భారత్ అండర్-19 జట్టుపై వరల్డ్ కప్ మ్యాచ్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్ మితిమీరిన స్థాయిలో ఉత్సవాలు జరుపుకోవడం పట్ల భారత టీమ్ మేనేజర్ అనిల్ పటేల్ మండిపడ్డారు. బంగ్లా వ్యవహారాల శైలిని ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోందని, ఆట చివరి క్షణంలో చోటుచేసుకున్న పరిణామాల పుటేజీని సమీక్షిస్తోందని ఆయన తెలిపాడు.

02/10/2020 - 05:45

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా నష్టపోయన వారిని ఆదుకునేందుకు నిర్వహించిన బుష్ ఫైర్ చారిటీ మ్యాచ్ ఆకట్టుకుంది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ ఎలెవన్ జట్టుపై పాంటింగ్ ఎలెవన్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాంటింగ్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయ 104 పరుగులు చేసిం ది.

02/10/2020 - 05:40

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 9: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా మహిళా జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ బ్యాట్స్‌వుమెన్స్‌లో బెత్ మూనీ (50) అర్ధ సెంచరీకి తోడు రఖేల్ హేన్స్ (24) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 132 పరుగులు చేసింది.

02/10/2020 - 05:50

పోట్చెఫ్‌స్ట్రూమ్, ఫిబ్రవరి 9: చివరి వరకు ఉత్కంఠగా సాగిన అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ పరాజయం పాలైంది. ఆఖర్లో వరుణుడు అడ్డు తగలడంతో బంగ్లాదేశ్ టార్గెట్ 24 బంతుల్లో 1 పరుగు కావడంతో సులువుగా ఛేదించి, తొలిసారి అండర్-19 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైస్వాల్ (88), తిలక్ వర్మ (38) మాత్రమే రాణించారు.

02/10/2020 - 00:47

*చిత్రం... అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

02/09/2020 - 04:16

అక్లాండ్: అంతా అనుకున్నట్లే జరిగింది. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేన, వనే్డల్లో తేలి పోయింది. కీలక ఆటగాళ్ల గాయాలకు తోడు, అనుభవలేమీ యువ క్రి కెటర్ల ఆటతీరుతో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రత్య ర్థి జట్టుకు అప్పగించేసింది. మరోవైపు సొంతగడ్డపై పొట్టి సిరీ స్‌ను కోల్పోయన కివీస్ దానికి ప్రతీకారం తీర్చుకున్నట్ల యంది.

02/09/2020 - 02:20

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 8: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవవర్లలో 5 వికెట్లు కోల్పోయ 173 పరుగులు చేసింది. అష్లే గార్డ్‌నర్ (93) పరుగులతో రాణించింది.

Pages