S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/21/2020 - 23:11

'చిత్రం... *జమ్మూలో జరిగిన ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిసిన యువ క్రీడాకారులు

01/21/2020 - 23:06

వెస్ట్ బెంగాల్, జనవరి 21: రంజీట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పరాజయం మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన బెంగాల్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లను కోల్పోయ 635 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మనోజ్ తివారీ (303, నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేయగా, మజూందార్ (59), శ్రీవాత్స్ గో స్వామి (95), అర్నాబ్ నందీ (65, నాటౌట్), షెబాజ్ అమ్మద్ (49) రాణించారు.

01/21/2020 - 04:37

బెంగళూరు: గడచిన ఏడాది న్యూజీలాండ్‌లో అద్భుత ఆటతీరుతో విజయాలను కైవసం చేసుకోవడంతోబాటు తాజాగా బలమైన ఆస్ట్రేలియా జట్టుపై సిరీస్ విజయంతో భారత జట్టు ఆత్మవిశ్వాసం మరింత బలపడింది. ఈక్రమంలో ఈనెల 24 నుంచి జరిగే న్యూజీలాండ్ పర్యటనకు రెట్టించిన ఆత్మ విశ్వాసంతో సంసిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో బ్లాక్ క్యాప్స్‌ను కోహ్లీ సేన వత్తిడికి గురచేయడం ఖాయమని క్రీడా పండితులు భావిస్తున్నారు.

01/21/2020 - 04:34

దుబాయ్, జనవరి 20: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్‌డే బ్యాటింగ్ విభాగం ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాలను నిలుపుకున్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో ఫాస్ట్‌బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ సోమవారం నాడిక్కడ విడుదలయ్యాయి.

01/21/2020 - 04:31

బస్సెటెర్రె (సెయింట్ కిడ్స్ అండ్ నెవిస్), జనవరి 20: ఓపెనర్ లెండీ సిమ్మన్స్ సిక్సర్లతో విరుచుకుపడడంతో ఐర్లాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 10 సిక్సర్లు బాదిన సిమ్మన్స్ 90 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. లెండీ సిమ్మన్స్ స్వయంగా వెస్టిండీస్ జట్టు కోచ్ పిల్ సిమ్మన్స్‌కు మేనల్లుడు.

01/21/2020 - 04:29

మెల్బోర్న్, జనవరి 20: ‘యువత నాలుగు గోడల మధ్య బందీలై స్నేహితులతో కాలం వృథాచేస్తే జీవితాలను పాడుచేసుకున్నట్లే’నని తాజాగా అంతర్జాతీయ టెన్నిస్ రంగంనుంచి తప్పుకుంటున్న మాజీ ప్రపంచ నంబర్‌వన్ 29 ఏళ్ల కరోలిన్ వోజ్నియాక్కి సోమవారం నాడిక్కడ హెచ్చరించింది. అలాగే నేటి తరం యువ క్రీడాకారులు పరస్పరం సుహృద్భావంతో మెలగాలని సూచించింది.

01/21/2020 - 04:28

మెల్బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా ఓపెన్ ద్వారా 24వ గ్రాండ్‌స్లాం టైటిల్‌పై కనే్నసిన 38 ఏళ్ల దిగ్గజ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సోమవారం తొలిరౌండ్‌లో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. కేవలం 19 నిమిషాల్లోనే తొలిసెట్‌లో రష్యన్ టీనేజర్ పొటపోవాను ఓడించి సత్తాచాటింది. లైలిక్ డ్రస్‌తో ఆకర్షణీయంగా కనిపించిన సెరీనా పవర్‌ఫుల్ స్ట్రోక్స్‌తో పొటపోవాను ఇక్కట్లపాలు చేసింది.

01/20/2020 - 05:21

బెంగళూరు: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన చివరి వనే్డలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3)ను షమీ అవుట్ చేశాడు.

01/20/2020 - 05:19

''చిత్రాలు.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఆస్ట్రేలియాన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కోసం ఆదివారం సాధన చేస్తున్న జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా. ఇక ఇదే పురుషుల చాంపియన్‌షిప్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్.

01/20/2020 - 05:16

వెస్ట్ బెంగాల్, జనవరి 19: రంజీట్రోఫీలో భాగంగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ జట్టు మొదటి రోజు 5 వికెట్లు కోల్పోయ 366 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచిన బెంగాల్ బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోరు 1 పరుగు వద్ద అభిషేక్ రామన్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, కెప్టెన్ అభిమా న్యూ ఈశ్వరన్ (12), ఖాజీ సైఫీ (27) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు.

Pages