S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/17/2018 - 23:51

దుబాయ్, సెప్టెంబర్ 17: టీమిండియా మిడిలార్డర్‌ను బలోపేతం చేయగల బ్యాట్స్‌మెన్లను గుర్తించడమే ఆసియా కప్ పరమార్థమని స్కిప్పర్ రోహిత్ శర్మ అన్నాడు. 4, 6 స్థానాల్లో రాణించగల బ్యాట్స్‌మెన్లను గుర్తించడంపై దృష్టిపెట్టామన్నాడు. హాంకాంగ్‌తో మంగళవారం ఆడాల్సిన తొలి మ్యాచ్‌తో ఆసియా కప్‌లోకి అడుగుపెడుతున్న టీమిండియా, మరుసటి రోజే దాయాది దేశమైన పాక్‌తో తలపడనుంది.

09/17/2018 - 23:49

దుబాయ్, సెప్టెంబర్ 17: హాంకాంగ్‌పై అప్రతిహత విజయంతో ఆసియా కప్‌లో శుభారంభాన్ని పలికిన పాక్, భారత్‌ను ఎదుర్కోవాలంటే మరింత సమర్థంగా ముందుకెళ్లాల్సి ఉందని స్కిప్పర్ సర్పరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌కే స్పెషల్ అట్రాక్షన్ అయిన భారత్- పాక్‌ల పోరు బుధవారం జరగనుంది. టోర్నీపై పట్టుపెంచేందుకు ఇరు జట్లూ సన్నద్ధమవుతున్నాయి.

09/17/2018 - 23:47

ముంబయి, సెప్టెంబర్ 17: ఆరో సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకెఎల్) అక్టోబర్ 7 నుంచి మొదలవుతున్నట్టు నిర్వాహక సంస్థ మార్షల్ స్పోర్ట్స్ వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5నే ప్రారంభం కావాల్సివున్నా, కారవాన్, స్టేడియంల సౌలభ్యంలాంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా రెండు రోజులు వెనక్కి జరిపినట్టు మీడియా ప్రకటనలో పేర్కొంది.

09/17/2018 - 02:40

న్యూఢిల్లీ: పోలెండ్‌లోని గ్లివైస్‌లో జరుగుతోన్న 13వ సిసీలియన్ ఓపెన్ బాక్సింగ్ మహిళా టోర్నీలో భారత బాక్సర్ మేరీ కోమ్ (48కేజీ) స్వర్ణాన్ని సాధించింది. మరో బాక్సర్ మనీషా (54 కేజీ) రజత పతకాన్ని ఒడిసిపట్టి భారత మహిళా బాక్సర్ల సత్తా ప్రదర్శించింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన మేరీ కోమ్ వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా మ్యాచ్‌లకు దూరంగా ఉంటుండటం తెలిసిందే.

09/17/2018 - 01:13

దుబాయ్, సెప్టెంబర్ 16: చిన్ని జట్టు. తక్కువ స్కోరు. ఇప్పుడిపుడే క్రికెట్‌లో అంతర్జాతీయ హోదా దక్కించుకోవడానికి ఉత్సాహం చూపుతోన్న హాంకాంగ్‌పై పాకిస్తాన్ ప్రతాపం చూపించింది. ప్రత్యర్థి జట్టును 116 పరుగులకే కట్టడిచేసి, లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించింది. ఆరు దేశాల క్రికెట్ పోరు ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై 8 వికెట్ల తేడాతో పాక్ తొలి విజయాన్ని నమోదు చేసింది.

09/17/2018 - 00:30

కటునాయకి (శ్రీలంక), సెప్టెంబర్ 16: శ్రీలంక టూర్‌లో స్కిప్పర్ మిథాలి రాజ్ రికార్డు సెంచరీ సాధించింది. ఆతిథ్య లంకతో ఆదివారం జరిగిన చివరిదైన థర్డ్ వనే్డలో చెలరేగిన మిథాలి (125) పరుగుల వరద సృష్టించింది. వనే్డల్లో మిథాలికి ఇది ఏడో సెంచరీ. 14 నెలల తరువాత సాధించిన తొలి సెంచరీ కూడా. 143 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌తో 125 పరుగులు సాధించిన మిథాలి, కొత్త మైలురాయిని చేరింది.

09/17/2018 - 01:15

దుబాయ్, సెప్టెంబర్ 16: ఆసియా కప్‌లో మూల‘విరాట్’ను మిస్సవుతున్నా, జట్టును ముందుకు నడిపించగల ‘అందరివాడి’తో ధీమాగా ఉన్నామని హైదరాబాదీ ప్లేయర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. ఎలాంటి పరిస్థితులెదురైనా జట్టును ముందుకు నడిపించగల అనుభవజ్ఞుడు మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడన్న ధైర్యం జట్టులో కనిపిస్తోందన్నాడు.

09/16/2018 - 02:29

మెల్‌బోర్న్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొరుూన్ అలీ త్వరలో విడుదల చేయనున్న ఆత్మకథలో చేసిన అభియోగాలపై దర్యాప్తు జరపాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. 2015లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సమయంలో ఓ ఆటగాడి నుంచి జాతి వ్యతిరేక దూషణలు ఎదుర్కొన్నానంటూ మొరుూన్ అలీ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.

09/16/2018 - 01:06

* చెస్ ఆనంద్‌లో కొత్త ఉత్సాహం టాటా స్టీల్ టోర్నీకి రాక

09/16/2018 - 01:08

మెల్‌బోర్న్, సెప్టెంబర్ 15: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు ఎక్కువ వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించాలన్న భారత ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ ప్రతిపాదనకు క్రికెట్ ఆస్ట్రేలియా పాజిటివ్‌గా స్పందించింది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌ను 1-4 స్కోరుతో టీమిండియా కోల్పోవడానికి కారణం తగినన్ని వార్మప్ మ్యాచ్‌లు ఆడకపోవడమేనన్న విమర్శలు రావడం తెలిసిందే.

Pages