S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/16/2018 - 00:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఇస్తాంబుల్‌లో జరుగుతున్న అహ్మెట్ కొమార్ట్ టోర్నమెంట్‌లో భారత్ బాక్సర్ పింకి జంగ్రా ఫైనల్స్‌వైపు దూసుకెళ్తున్నాడు. మరో ఐదుగురు బాక్సర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్తున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో జంగ్రా (51కేజీ) తన ప్రత్యర్థి, ప్రపంచ మాజీ చాంపియన్ స్టెలుట దుతాను 5-0తో మట్టి కరిపించి ఫైనల్స్‌వైపు అడుగులేశాడు.

09/15/2018 - 02:39

దుబాయ్: ఆరు దేశాలు ఆడుతున్న ఆసియా కప్ టోర్నీ వచ్చే వరల్డ్ కప్‌లో భారత్ ‘పెర్ఫెక్ట్ కాంబినేషన్’కు ఉపకరిస్తుందని టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. వనే్డ మ్యాచ్‌లకు సంబంధించి భారత్ ఇప్పటికీ సరైన మిడిలార్డర్‌ను సెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతోంది. ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్ కప్‌కు బలమైన జట్టు నిర్మాణానికి ఆసియా కప్ టోర్నీ ఉపకరిస్తుందా? అన్న ప్రశ్నకు ‘ఒకవిధంగా అలా అనుకోవచ్చు.

09/15/2018 - 00:53

దుబాయ్, సెప్టెంబర్ 14: ఇంగ్లీష్ గడ్డపై పేలవమైన ఆటతో నొప్పించిన టీమిండియా, సౌదీ మైదానాల్లో ఆసియా కప్ కోసం ప్రదర్శించబోయే ప్రతాపాలు ఏతీరున ఉంటాయోనన్న ఉత్కంఠ క్రికెట్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికితోడు కనీసం రెండుసార్లు తలపడనున్న దాయాది దేశాలు భారత్-పాక్‌ల పోరు ఆసక్తి రేకెత్తించేదే. దుబాయ్ వేదికగా నేటినుంచి ఆసియా కప్ క్రికెట్ సమరం మొదలవుతుంది.

09/15/2018 - 00:47

చాంగ్వాన్, సెప్టెంబర్ 14: అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ టోర్నీ ముగింపులోనూ భారత షూటర్లు పతకాల వేట కొనసాగించారు. శుక్రవారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీలో సీనియర్ మెన్ స్టాండర్డ్ పిస్టల్ విభాగం నుంచి గురుప్రీత్ సింగ్ రజతాన్ని సాధించాడు. జూనియర్ షూటర్లు మాత్రం రెండు పసిడి పతకాలు సాధించి భారత సత్తా చాటారు.

09/15/2018 - 00:46

టోక్యో, సెప్టెంబర్ 14: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం స్టార్ షట్లర్ శ్రీకాంత్ ఓటమితో భారతపర్వం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెవెన్త్ సీడ్ శ్రీకాంత్, 33వ ర్యాంకర్, కొరియా షట్లర్ లీ డాంగ్ కెవున్‌తో తలపడి 21-19, 16-21, 18-21 స్కోరుతో ఓటమి చవిచూశాడు.

09/15/2018 - 00:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ‘ఆటకు అతనే నిజమైన రాయబారి’ అంటూ సర్దార్ సింగ్‌ను భారత హాకీ (హెచ్‌ఐ) వేనోళ్ల పొగిడింది. పనె్నండేళ్లు కెరీర్ పూర్తి చేసుకుని అంతర్జాతీయ హాకీనుంచి రిటైరవుతున్నట్టు సర్దార్ సింగ్ గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ కప్‌కు జాతీయ ప్రాబబుల్స్ క్యాంప్‌నుంచి సర్దార్ వైదొలిగాడు.

09/13/2018 - 01:03

న్యూఢిల్లీ: అప్పుడు భయపడ్డాడు. ఇప్పుడు భయపెట్టాడు. ఇంగ్లాండ్ టూర్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా స్కిప్పర్ కోహ్లీ సక్సెస్. కాకపోతే కెప్టెన్సీ విషయంలోనే.. సారథ్య సామర్థ్య పరిణితి చూపించలేకపోయాడు. 2014 సిరీస్‌లో ఇంగ్లీషోళ్లు చూసిన కోహ్లీకి, తాజా సిరీస్‌లో కనిపించిన విరాట్ కోహ్లీకి తేడా ఏమిటో.. 593లో ఏ పరుగునడిగినా చెబుతుంది. సారథిగా అప్పటికి ఇప్పటికీ ఎక్కడున్నాడంటే.. 1-4 సిరీస్ స్కోరే కనిపిస్తుంది.

09/13/2018 - 00:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: హాకీ యోధుడు ఆటకు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఆసియా గేమ్స్‌కు వెళ్తూ.. వచ్చే ఒలింపిక్‌లోనూ ఆడాలనుందని మనసులో మాట చెప్పిన ఆటగాడు, ముందే రిటైర్మెంట్‌కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. భారత హాకీని సమర్థంగా నడిపించడమే కాదు, హాకీకి ఓ నిర్వచనం ఇచ్చిన ఆ ఆటగాడే -సర్కార్ సింగ్.

09/13/2018 - 00:17

లండన్, సెప్టెంబర్ 12: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా, పది పాయింట్లు నష్టపోయినా ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అగ్రస్థానంలోనే నిలిచింది. ఇక సిరీస్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ప్రదర్శన చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్‌ను వెనక్కినెట్టి టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. సిరీస్ మొత్తంమీద కోహ్లీ 593 పరుగులు చేయడం తెలిసిందే.

09/13/2018 - 00:16

టోక్యో, సెప్టెంబర్ 12: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో భారత షట్లర్లు మను అత్రి, బి సుమీత్ రెడ్డి సంచలన విజయం సాధించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మలేసియాకు చెందిన ఒలింపిక్ రజత పతక విజేతలు గోహ్ వి షెమ్, టాన్ వీ కియోంగ్‌లను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

Pages