S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/15/2020 - 03:40

ముంబయి, జనవరి 14: క్రికెటర్ గా కంటే బీసీసీఐ అధ్యక్ష పదవే సులు వని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఏసెసె అవార్డుల ప్రదానోత్స వంలో పాల్గొన్నాడు. 2019 ఉత్తమ టెస్టు జట్టుగా భారత్ ఎంపికవడంతో పాటు టీమిండియా తరఫున సౌరవ్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ టీమిండియా కు ఉత్తమ టెస్టు జట్టుగా అవార్డు ఇచ్చి నందుకు ధన్యవాదాలు.

01/15/2020 - 03:38

చెన్నై, జనవరి 14: రంజీట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న తమిళ నాడు, ముంబయి మ్యాచ్ చివరి రోజు డ్రాగా ముగిసింది. ముందుగా టాస్ గెలిచన ముంబయి జట్టు తన మొద టి ఇన్నింగ్స్‌లో 488 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్, వికెట్ కీపర్ ఆదిత్యథారె (154), శామ్స్ ములానీ (87), శశాంక్ (58) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై తన మొదటి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌటైంది.

01/15/2020 - 03:35

'చిత్రం... ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020లో భాగంగా మంగళవారం గౌహాతిలోని గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో
జరిగిన అండర్-17 విభాగంలో 200 మీటర్ల పరుగులో పాల్గొన్న అథ్లెట్లు.

01/15/2020 - 03:33

'చిత్రం... అడిలైడ్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా పురుషుల మొదటి రౌండ్ సింగిల్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ బోల్ట్‌తో తలపడుతున్న ఫ్రాన్స్ క్రీడాకారుడు స్టీఫెన్ రాబార్ట్.

01/13/2020 - 23:55

ముంబయి వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో మంగళవారం ప్రారంభం కానున్న తొలి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ సందర్భంగా సోమవారం ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, నవదీప్ సైనీ తదితరులు. అదేవిధంగా ఆసిస్ ఆటగాళ్లు మార్నస్ లబూస్‌ఛేంజ్, వికట్ కీపర్ అలెక్స్ క్యారీ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్న దృశ్యం

01/13/2020 - 23:49

లండన్, జనవరి 13: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ-20 ప్రపంచ కప్‌లో ఆడే జట్లను 16 నుంచి 20 వరకు పెంచేందుకు యోచిస్తోంది. అయితే, ఈ ఆలోచనను ఇప్పటికిప్పుడే అమల్లోకి తీసుకురాకున్నా 2023-31 మధ్యకాలంలో అమలు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

01/13/2020 - 23:49

మెల్‌బోర్న్, జనవరి 13: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహిస్తే సమంజసంగా ఉంటుందని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది వేసవి కాలంలో తమ దేశంలోని ఏ మైదానంలోనైనా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ప్రకటన చేసిన నేపథ్యంలో వార్న్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు.

01/13/2020 - 23:47

ముంబయి, జనవరి 13: ఆస్ట్రేలియా గడ్డలోని ఏ ప్రాంతంలోనైనా ఆ దేశ జట్టుతో డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడేందుకు తాము సిద్ధమేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కొన్ని నెలల కిందట ఆసిస్ క్రికెటర్ టిమ్ పైన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోహ్లీ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టుతో ఎక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ నిర్వహించినా ఈ ఏడాది తర్వాత తాము సంసిద్ధంగా ఉంటామని స్పష్టం చేశాడు.

01/13/2020 - 23:46

ముంబయి, జనవరి 13: బ్యాటింగ్ ఆర్డర్‌లో తన స్థానాన్ని మార్చుకోడానికి ఎలాంటి ఇబ్బంది లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం ముంబయి వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి వనే్డ జరుగనుంది. తమ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌ను అదే స్థానంలో ఆడించే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

01/13/2020 - 23:45

ముంబయి, జనవరి 13: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించేందుకు అత్యంత చేరువలో ఉన్నాడు. స్వదేశంలో ఆడిన వనే్డల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేయనున్నాడు. మంగళవారం నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడనుంది.

Pages