S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/10/2018 - 02:49

న్యూయార్క్, సెప్టెంబర్ 9: జపాన్ టెన్నీస్ క్రీడాకారిణి నవోమి ఓసాకా సంచలనం సృష్టించింది. ఆరితేరిన ఆటగత్తె సెరీనాపై 6-2, 6-4సెట్లతో సునాయాస విజయం సాధించి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించింది. గ్రాండ్‌శ్లామ్ సాధించిన తొలి జపాన్ క్రీడాకారిణిగానూ రికార్డు నిలుపుకుంది.

09/10/2018 - 02:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా వైఫల్యాలపై ప్రధాన కోచ్ రవిశాస్ర్తీని క్రికెట్ పాలక కమిటీ నివేదిక కోరే అవకాశం కనిపిస్తోంది. అది నేరుగానా? నివేదికరూపంలోనా? అన్నది తేలాల్సి ఉంది. ఇంగ్లాండ్‌తో వనే్డ, టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో, ప్రస్తుతం సాగుతోన్న ఐదో టెస్ట్ అనంతరం జట్టు సామర్థ్యంపై సీవోఏ ఒక అంచనాకు వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

09/10/2018 - 02:53

లండన్, సెప్టెంబర్ 9: ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు ఫైన్ విధించారు. అంపైర్ కుమార్ ధర్మసేన పట్ల దురుసుగా ప్రవర్తించి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన ఆండర్సన్ మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. అంతేకాదు డిసిప్లినరీ రికార్డులో డీమెరిట్ పాయింట్ సైతం జోడించడం గమనార్హం. చివరిదైన ఐదో టెస్ట్ రెండోరోజు ఇండియా ఇన్నింగ్స్‌లో కోహ్లీకి బౌలింగ్ చేస్తూ, ఎల్బీడబ్య్లుకి అప్పీల్ చేశాడు.

09/10/2018 - 02:38

చివరిదైన ఐదో టెస్ట్‌లోనూ ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టే ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో జో టీం ఇచ్చిన 332 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో విఫలమైన కోహ్లీ సేన, 292 పరుగులకు ఆలౌటైంది. భారీ వ్యత్యాసం లేకుండా అరంగేట్రం ఆటగాడు విహారి (56), రవీంద్ర జడేజా (86)లు అర్ధ శతకాలతో సహకరించారు.

09/10/2018 - 02:32

మాడ్రిడ్, సెప్టెంబర్ 9: మోకాలి గాయం కారణంగా యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ పోరునుంచి మధ్యలో తప్పుకున్న స్పానిష్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్, తాజాగా డేవిస్ కప్ సెమీఫైనల్స్ నుంచీ తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్పానిష్ టెన్నిస్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వచ్చేవారం స్పెయిన్‌లో జరగనున్న డేవిస్ కప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్ ఆటగాడితో నాదల్ తలపడాల్సి ఉంది.

09/09/2018 - 02:19

అద్భుతం జరిగితే తప్ప ఐదో టెస్ట్‌లో టీమిండియా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. చివరి టెస్ట్ గెలుపుతోనైనా గౌరవప్రదమైన ఓటమి (3-2)తో వెనుతిరగవచ్చన్న కోహ్లీ సేన ఆశల్ని ఇంగ్లీష్ ఆటగాళ్లు నెరవేరనివ్వడం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 198/7తో మలిరోజు బరిలోకి దిగిన జో జట్టు స్కోరును పరిగెత్తించింది. చివరి ఆటగాళ్లు చెలరేగిపోయి స్కోరు పరుగును 332వద్ద నిలపడంతో, టీమిండియా నీరుగారిపోయింది.

09/09/2018 - 02:17

న్యూయార్క్, సెప్టెంబర్ 8: ప్రత్యర్థి మోకాలి గాయం అర్జెంటీన్ ఆటగాడు జ్యువాన్ మార్టిన్ డెల్ పొట్రోకు వరమైంది. మోకాలి గాయంతో విలవిల్లాడుతూ స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ మైదానంలోనే చతికిలపడటంతో, విజేతగా పాట్రో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు. దీంతో డెల్ పొట్రో, నోవాక్ జొకోవిక్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది.

09/09/2018 - 02:15

లండన్, సెప్టెంబర్ 8: సరైన కసరత్తు, బలమైన ప్రత్యర్థి లేకుండా విదేశీ పర్యాటక మ్యాచ్‌లకు వెళ్లడం వృధాప్రయాసేనని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. పర్యాటక టెస్ట్ మ్యాచ్‌లకు ముందు ప్రిపరేషన్స్ ఎంతముఖ్యం? అన్న ప్రశ్నకు కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమవడం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..

09/09/2018 - 02:13

లండన్, సెప్టెంబర్ 8: అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే టెస్ట్ మ్యాచ్‌లు ఒక్కటే సరిపోదని, అన్ని ఫార్మాట్లలోనూ రాటుదేలాలని స్పిన్నర్ రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో చివరి ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 57 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయడం తెలిసిందే. ‘నా వరకూ దేశం కోసం క్రికెట్ ఆడటం గురించే ఆలోచిస్తా.

09/09/2018 - 02:12

చాంఘ్వాన్, సెప్టెంబర్ 8: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అప్రతిహతంగా పతకాల వేట కొనసాగిస్తున్నారు. పురుషుల డబుల్ ట్రాప్‌లో అంకుర్ మిట్టల్ ఫైనల్స్‌లో విజయం సాధించి భారత్ ఖాతాలో మరో పసిడిని చేర్చాడు.

Pages