S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/06/2016 - 05:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రియో ఒలింపిక్స్‌లో భారత షూటర్ల వైఫల్యాలపై నివేదిక పూర్తయింది. ఏస్ షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వంలోని కమిటీ అఖిల భారత షూటింగ్ సంఘం (ఎన్‌ఆర్‌ఎఐ)కి నివేదిక సమర్పించింది. అందులో సంఘం తీరును కమిటీ దుయ్యబట్టడం విశేషం. గత కొంతకాలంగా షూటింగ్‌లో ప్రమాణాలను పెంచడానికి ఎన్‌ఆర్‌ఎఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది.

10/06/2016 - 05:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారీ మార్పులుగానీ, ప్రయోజాలుగానీ లేకుండానే న్యూజిలాండ్‌తో జరిగే వనే్డ సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్‌గా తొలిసారి సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నాడు. గతంలో అతను సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు చీఫ్‌గా కొత్త బాధ్యతలను స్వీకరించాడు.

10/06/2016 - 05:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశవాళీ లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకునేది లేదని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) అధికారులకు ముకుల్ ముద్గల్ స్పష్టం చేశాడు. అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిడిసిఎ పాలనా వ్యవహారాలు సక్రమంగా సాగేలా చూడడానికి పరిశీలకుడిగా ముద్గల్‌ను ఢిల్లీ హైకోర్టు నియమించింది.

10/05/2016 - 07:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: డబ్బులు లేకపోతే ఆటను నిర్వహించలేమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మంగళవారం నిర్ద్వంద్వంగా స్పష్టం చేశాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న టెస్టు సిరీస్ భవితవ్యం ఏమిటన్నదీ చెప్పేందుకు ఆయన నిరాకరించాడు.

10/05/2016 - 07:24

లాసానే్న, అక్టోబర్ 4: నిషేధిత ఉత్ప్రేరకాలను వాడిందన్న ఆరోపణలపై రెండేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ తార మరియా షరపోవాకు ఆర్బిట్రేషన్ కోర్టులో ఊరట లభించింది. ఈ నిషేధాన్ని లాసానే్నలోని క్రీడలకు సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయస్థానం 15 నెలలకు తగ్గించింది. దీంతో షరపోవా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరిగి గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్‌లోకి రావడానికి వీలు కలుగుతుంది.

10/05/2016 - 07:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ భారత్‌పై చేసిన విమర్శలకు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మంగళవారం దీటైన జవాబిచ్చాడు. అటు క్రికెట్ మైదానంలోనూ, ఇటు రణ క్షేత్రంలోనూ పాకిస్తాన్ విజయం సాధించలేకపోవడంతో ఎదురైన షాక్ నుంచి మియాందాద్ ఇంకా కోలుకున్నట్లు లేడని, అతను ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు స్పష్టమవుతోందని బిసిసిఐ చీఫ్ వ్యాఖ్యానించాడు.

10/05/2016 - 07:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: సింగపూర్‌లో ఈ నెల 29వ తేదీ నుంచి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో తలపడే భారత మహిళా హాకీ జట్టుకు ఫార్వర్డ్ క్రీడాకారిణి వందనా కటారియా సారథ్యం వహించనుంది. అయితే ఇటీవల రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన సుశీలా చానూకు ఈ జట్టులో చోటు కల్పించకుండా డిఫెండర్ సునీతా లక్రాను వైస్-కెప్టెన్‌గా నియమించారు.

10/05/2016 - 07:22

ముంబయి, అక్టోబర్ 4: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చివరి టెస్టును నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపిసిఎ) ఏర్పాట్లు చేస్తోంది. ఎంపిసిఎకి చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించాడు.

10/05/2016 - 07:20

దుబాయ్, అక్టోబర్ 4: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) విడుదల చేసిన టాప్-10 ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా నుంచి ఎవరికీ స్థానం లభించలేదు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

10/05/2016 - 07:19

కోల్‌కతా, అక్టోబర్ 4: ఇండోర్‌లో ఈ నెల 8నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడవ, చివరి టెస్టు మ్యాచ్‌కోసం భారత జట్టులో గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కర్నాటకకు చెందిన యువ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్‌ను తీసుకున్నారు. ఎడం చేతి బొటనవేలు గాయం కారణంగా మూడో టెస్టుకు శిఖర్ ధావన్ దూరం కావడంతో కరుణ్ నాయర్‌కు అవకాశం లభించింది. నాయర్ భారత్ తరఫున ఇప్పటివరకు రెండు వన్‌డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

Pages